Janaki Kalaganaledu July 29th Update: మల్లికని వరలక్ష్మి వ్రతం చేయమన్న జ్ఞానంబ- కుమిలిపోతున్న రామా, జానకి
జానకిని రామా ఐపీఎస్ చదివిస్తున్న విషయం జ్ఞానంబకి తెలిసిపోతుంది. దీంతో కథనం ఉత్కంఠగా మారింది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ కోపంగా బాధగా వెళ్ళి తలుపు వేసుకుంటుంది. అది చూసి ఇంట్లో వాళ్ళు అందరూ కంగారూ పడతారు. అప్పుడే జ్ఞానంబ గదిలో నుంచి బయటికి వస్తుంది. మల్లికా ఏం జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏం కొంపలు అంటుకు పోయాయని అందరూ భయం భయంగా గది వైపు చూస్తున్నారు అని జ్ఞానంబ అంటుంది. మీరు గదిలో సీరియస్ గా ఏం ఆలోచిస్తున్నారు, మీ నోటి నుంచి ఎలాంటి నిర్ణయం వినాల్సి వస్తుందో అని అందరూ భయంగా ఉన్నారని మల్లిక అంటుంది. మీరు ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పండి అత్తయ్యగారు అని మల్లిక ఆత్రంగా అడుగుతుంది. రేపు వరలక్ష్మి వ్రతం అంటుంది. ఎందబ్బా ఇది పోలేరమ్మ నోటి నుంచి గెట్ ఔట్ అని వస్తుంది అనుకుంటే రేపు వ్రతం ఎల్లుండి వంకాయ పులుసు వండుకుందామని అనే డైలాగ్ లు వస్తున్నాయ్ ఏంటి అని మల్లిక మనసులో అనుకుంటుంది. ప్రతి సంవత్సరం మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ఈసారి కూడా అలాగే చెయ్యాలి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చూడమని జ్ఞానంబ చెప్పి వెళ్ళిపోతుంది. చికితా వచ్చి మల్లికమ్మగారు మీరు ఉన్నారా పోయారా.. ఆ.. అయిన మీరు అంతా తొందరగా పోయే వాళ్ళు కాదులెండి అని అంటుంది. ఆ మాటకి మల్లిక కోపంగా చికితకి మొట్టికాయ వేస్తుంది.
నేను ఊహించిన సీన్ ఏంటి ఇలా జరిగింది ఏంటి అని మల్లిక లబోదిబోమంటుంది. జానకి జ్ఞానంబ మాటలు తలుచుకుని బాధపడుతుంటే రామా వచ్చి అడుగుతాడు. అమ్మ కోపం మిమ్మల్నే కాదు నన్ను కూడా భయపెడుతుందని రామా అంటాడు. అత్తయ్యగారు మాట్లాడితే ఆవిడ మనసులో ఏముందో ఎలాంటి నిర్ణయం ఉందో తెలుసుకోవచ్చు.. ఆ కోపం ఎంతైనా భరించవచ్చు. కానీ అత్తయ్యగారి మౌనాన్ని భరించడం చాలా కష్టంగా ఉందని జానకి అంటుంది. ఆ మౌనం వెనక ఏదో ఒక నిర్ణయం ఉండే ఉంటుంది, ఆ మౌనం నుంచి వచ్చే కోపం ఏ స్థానంలో ఉంటుందో అని చాలా భయంగా ఉండి దీన్ని ఎంతకాలం మొయ్యాలో అర్థం కావడం లేదని రామా అంటాడు. సర్టిఫికెట్స్ తీసుకోవడానికి ముందే మనం అత్తయ్యగారికి నిజం చెప్పేసి ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. మీరు చెప్పింది నిజమే ఆ రోజు మీరు చెప్పినట్టు అమ్మకి నిజం చెప్పి ఉంటే బాగుండేదని రామా కూడా అంటాడు. ఈ పరిస్థితిని చక్కదిద్ది మళ్ళీ మామూలుగా ఎలా చేయాలో అర్థం కావడం లేదని బాధపడుతుంటే అక్కడికి గోవిందరాజులు వస్తాడు. మేరు ఇవేమీ ఆలోచించకండి మనసులో నుంచి ఆ బాధని తీసివేయమని చెప్తాడు. ప్రేమించే మనిషికి క్షమించే గుణం ఉంటుంది.. అది మీ అమ్మాలో కూడా ఎంతో కొంత ఉంది. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో కూడా వరలక్ష్మి వ్రతం చెయ్యమని చెప్పింది. మీరు ఇవేవీ మనసులో పెట్టుకోకుండా వ్రతం చెయ్యమని చెప్తాడు.
Also Read: హనికి తల్లి స్థానంలో తులసి- 'పనోళ్లా' అంటూ నందుని అవమానించిన అనసూయ
ఇక ఇంట్లో వ్రతానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు జానకి, రామా. అది చూసి జ్ఞానంబ ఇంట్లో వాళ్ళందరిని పిలుస్తుంది. కోడలు అంటే కోరి తెచ్చుకునే అదృష్టం, ఆ అదృష్టం ఇంటికి వెలుగునిచ్చేలా ఉండాలి అంతే కానీ కంట తడి పెట్టించేలా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట ఇస్తే దాన్ని తప్పకూడదు. ఆ మాటకి ఉన్న విలువని దాని వెనక ఉన్న బాధని అర్థం చేసుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే కోడలు అనే మాటకి ధర్మానికి ఒక అర్థం. ఈ వరలక్ష్మి వ్రతం తంతుని కోడలిగా నీ చేతుల మీద నిర్వహించు. వచ్చిన ముత్తైదువులకి పసుపు బాధ్యతలన్నీ నువ్వే నిర్వర్తించు అని జ్ఞానంబ చెప్తుంది. వీటన్నిటికీ జానకి ఉంది కదా అని మల్లిక కావాలని అంటుంది. చేయడానికి నీకేమైనా కష్టమా అని జ్ఞానంబ తిడుతుంది. జానకిని తిడుతున్నందుకు ఒక పక్క సంతోషపడుతూనే మరో వైపు ఏమి తెలియనట్టు నటిస్తుంది. ఎదురు ప్రశ్నలు ఆపి చెప్పిన పని చెయ్యమని అంటుంది.