అన్వేషించండి

Gruhalakshmi July 29th Update: హనికి తల్లి స్థానంలో తులసి- 'పనోళ్లా' అంటూ నందుని అవమానించిన అనసూయ

హనీ కాంపిటీషన్ లో గెలిచేలా చేసేందుకు తులసి సహాయం చేస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

హనీతో పాటు డాన్స్ చేయాల్సిన టీచర్ సుశీల కనిపించడం లేదని తులసి వచ్చి సామ్రాట్ కి చెప్తుంది. దీంతో ఇద్దరు కలిసి టీచర్ కోసం వెతుకుతారు. ఎంత వెతికినా కనిపించకపోయేసరికి ఇద్దరూ కంగారూ పడతారు. హనీ ముఖంలో నిరాశ, కన్నీళ్ళు కనిపించకూడదు, ఏం చేసి అయిన, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే ఇంకో టీచర్ ని ఏర్పాటు చెయ్యమని సామ్రాట్ తన బాబాయ్ కి చెప్తాడు. డబ్బుతో ఏర్పాటు చేయలేరు ఇప్పటికిప్పుడు ప్రాక్టీస్ లేకుండా ఎవరు చేయలేరని తులసి అంటుంది. ఎలాగైనా టీచర్ ని వెతికి తీసుకొస్తానని సామ్రాట్ వెళ్ళిపోతాడు. హనీ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూసి తులసి బాధపడుతుంది. టీచర్ కంగారుగా ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయిందని అక్కడి వాచ్ మెన్ సామ్రాట్ కి చెప్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని సామ్రాట్ అరుస్తాడు. ఇప్పుడు హనికి ఏమని చెప్పాలి, తనకి ఏం చెప్పి కన్వీన్స్ చెయ్యాలి అని సామ్రాట్ బాధపడతాడు. ప్రదర్శన ఇవ్వాల్సిందిగా హనీ పేరుని పిలుస్తారు. ఆంటీ కాంపిటీషన్ వాళ్ళు నా పేరు పిలుస్తున్నారు టీచర్ ఎక్కడా అని హనీ తులసిని అడుగుతుంది. ఇక తులసి అక్కడి ఉన్న జడ్జిలకి పరిస్థితి చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. అది చూసి మనం చేయాల్సిన పని తులసి చేస్తుందని సామ్రాట్ అంటాడు. ఇక హనీ కంగారుగా ఏమైందని తులసిని హనీ అడుగుతుంది. నువ్వు వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చెయ్యి మీ టీచర్ ని వెనకాలే నేను పంపిస్తాను అని చెప్తుంది.  

Also Read: పరాకాష్ఠకి చేరిన మాధవ పైశాచికత్వం- రుక్మిణి ఫోన్ కి దేవి తండ్రిగా ఫోన్ చేయించి బెదిరించిన మాధవ, అల్లాడిపోయిన సత్య

హనీ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే అప్పుడే తులసి ఎంట్రీ ఇస్తుంది. హనీతో కలిసి తులసి డాన్స్ చేస్తుంది. అది చూసి నందు, లాస్య షాక్ అవుతారు. సామ్రాట్ షాక్ అయినా తేరుకుని సంతోషంగా చూస్తూ ఉంటాడు. హనీ, తులసి కలిసి స్టేజ్ మీద డాన్స్ ఇరగదీస్తారు. మేమిద్దరం కలిసి స్టేజ్ మీద డాన్స్ వేస్తుంటే ఎంత బాగుందో నేను ఈ కాంపిటీషన్ లో నేను గెలవకపోయిన పర్వాలేదు ఇది చాలు అని హనీ అంటుంది. ఇక ఈ పోటీలు చాలా టఫ్ గా జరిగిందని యాంకర్ చెప్తుంది. ఇద్దరు పేర్లని పిలుస్తారు వారిద్దరిలో ఎవరు విన్నరో జడ్జి లు ప్రకటిస్తారు అని చెప్తారు. ఇక లక్కీ, హనీని స్టేజ్ మీదకి పిలుస్తారు. ఇక ఎవరు గెలుస్తారా అని అందరూ టెన్షన్ పడుతుంటే ఇద్దరూ విన్నర్స్ అని యాంకర్ ప్రకటిస్తుంది. అది చూసి తులసితో సహా అందరూ సంతోషిస్తారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇది స్టూడెంట్ టీచర్ కాంపిటీషన్ కదా హనీతో కలిసి తులసి ఎలా డాన్స్ చేస్తుంది అని అడుగుతాడు. అలా విన్నర్ గా ఎలా డిక్లేర్ చేస్తారని నిలదీస్తాడు.  అది పెద్ద విషయం కాదు తులసి గారు హనికి సంగీతం నేర్పించే టీచర్, ఈ డాన్స్ కూడా ఆమె నేర్పించారు. తనతో డాన్స్ చేసే టీచర్ చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడంతో తులసి గారు హనీతో డాన్స్ చేసేందుకు పర్మిషన్ అడిగారు. టీచర్ చేసిన తప్పు వల్ల స్టూడెంట్ కి అన్యాయం జరగకూడదు. అందుకే తులసి గారు అడిగింది న్యాయం అనిపించి ఒప్పుకున్నామని జడ్జి చెప్తాడు. అది విని అందరూ చప్పట్లతో తులసిని అభినందిస్తారు. 

Also Read: జైలు నుంచి బయటికి వచ్చేందుకు ఖైలాష్ ప్లాన్, కాంచనకి వేద క్షమాపణలు- ఖైలాష్ ని విడిపించమన్న మాలిని

హనీ, లక్కీకి అవార్డ్ ప్రజంటేషన్ జరుగుతుంది. ఇక పిల్లల తల్లిదండ్రులు కూడా స్టేజ్ మీదకి రావాలని పిలుస్తారు. ఈరోజు నా గెలుపుకి కారణం తులసి ఆంటీ.. ప్రైజ్ తీసుకునేటప్పుడు నా పక్కన తులసి ఆంటీ ఉండాలని కోరుకుంటున్నా అని హనీ అంటుంది. సామ్రాట్ వచ్చి మా మనసులో మాట హనీ నోటి నుంచి వచ్చింది వెళ్ళండి తులసి గారు అని సామ్రాట్ అడుగుతాడు. కానీ తులసి మాత్రం పిల్లల పక్కన పేరెంట్స్ ఉండాల్సిన సమయం నేను కాదు అని అంటుంది. అమ్మ కంటే ఎక్కువ చేశావ్ ధైర్యం చెప్పావ్ హనీ పక్కన నిలబడే అర్హత నీదేనమ్మా అని సామ్రాట్ బాబాయ్ సర్ది చెప్పడంతో తులసి స్టేజ్ మీదకి సామ్రాట్ తో కలిసి వెళ్తుంది. అది చూసి లాస్య నందుతో పేరెంట్స్ ఉండాల్సిన ప్లేస్ లో తులసి ఉంది చూడు అని నూరిపోస్తుంది. ఇక జడ్జిలు లక్కీ, హనికి బహుమతులు ఇస్తారు. 

తరువాయి భాగంలో.. 

నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. మ్యూజిక్ స్కూల్ ప్లాన్ గురించి మాట్లాడటానికి వచ్చామని నందు చెప్తాడు. మ్యూజిక్ స్కూల్ కి ఇన్వెస్ట్మెంట్ చేసేది సామ్రాట్ గారు కదా అని అంకిత అంటుంది. మేము సామ్రాట్ గారి కంపెనీలో హోదాలో ఉన్న ఆఫీసర్లమని నందు అంటే.. పనోళ్లా అని అనసూయ హేళనగా అంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 24th: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
జగద్ధాత్రి సీరియల్: నిషిక ఫేస్‌ప్యాక్‌లో కారం కలిపిన ఆదిలక్ష్మీ.... జగధాత్రి చెప్పడంతో అత్తకు వార్నింగ్ ఇచ్చిన కౌషికి
Nara Rohith Kapaali : సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నారా రోహిత్ - తెలియని ప్రపంచంలో న్యూ జర్నీ 'కపాలి'
The Odyssey Collections : ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
ఇండియాలో ది ఒడిస్సీ రికార్డు కలెక్షన్స్ - వారం రోజుల్లోనే ఆ మార్క్ దాటేసిందిగా...
Sumo Didi OTT : ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి ఇండియాస్ ఫస్ట్ మహిళా సుమో రెజ్లర్ స్టోరీ - ఇంట్రెస్టింగ్ టీజర్... ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget