Jagadhatri December 21st Episode: 'జగద్ధాత్రి' సీరియల్: దివ్యాంకకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కౌషికి, యువరాజ్‌లో బలపడుతున్న అనుమానం!
Jagadhatri Today Episode : కిడ్నాప్ అయిన పాపని రక్షించిన ధాత్రి వాళ్లు వాళ్ల మీదకి అనుమానం రాకుండా పోలీసులే పాపని రక్షించారు అని చెప్పటంతో కంప్లైంట్ ఇవ్వకుండా వాళ్లకి ఎలా తెలిసింది.
Jagadhatri Today Episode: రౌడీల చర్యలను కనిపెట్టావు నువ్వు గ్రేట్ అని మెచ్చుకుంటాడు కేదార్. నువ్వు కూడా గ్రేట్ లేదంటే నిషిక కి దొరికి పోయేవాళ్ళం అంటుంది ద్ధాత్రి. ఆ తర్వాత తమ కోసమే వెతుకుతున్న రౌడీలతో ఫైట్ చేసి వాళ్ళని అరెస్టు చేయమని వాళ్ళ టీం మెంబెర్స్ తో చెప్పడంతో రౌడీలని తీసుకొని వెళ్ళిపోతారు కొలీగ్స్.
తరువాత ఇద్దరూ అక్కడ నుంచి బయలుదేరి వెళ్లిపోతుంటే కొందరు రౌడీలు సురేష్ గురించి మాట్లాడుకుంటూ వస్తారు. వీళ్ళు అన్నయ్య కోసం వచ్చినట్లుగా ఉన్నారు లోపల ఏదో గొడవ జరిగేలాగా ఉంది పదా అని ధాత్రి కేదార్ తో చెప్పడంతో ఇద్దరు మళ్ళి హోటల్ లోపలికి వెళ్తారు. అదే సమయంలో
దివ్యాంక : కౌషికిని ఏడిపించాలనే ఉద్దేశంతో ఈ టేబుల్ వద్దు టేబుల్ చేంజ్ చేద్దాం అని సురేష్ తో అంటుంది.
సురేష్ : ఎందుకు మేడం లంచ్ అయిపోయింది కదా వెళ్ళిపోదాం అంటాడు.
దివ్యాంక: ఇంకా లేదు డిసర్డ్స్ ఆర్డర్ చేయలేదు కదా అని కౌషికి వాళ్ళ టేబుల్ దగ్గరికి వస్తుంది. అక్కడికి మేనేజర్ వస్తే వాళ్లతో వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు. ఎలా అంటే ఆ పింక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయికి ఈయన ఎక్స్ హస్బెండ్ అని వెటకారంగా మాట్లాడుతుంది.
కౌషికి : కోపంగా దివ్యాంకపై చెయ్యి ఎత్తుతుంది కానీ కొట్టకుండా దివ్యాంకతో నా సంస్కారం అడ్డొచ్చింది లేదంటే నీ చంప పగిలిపోయేది, మీ ఇద్దరు ఎలా అయినా ఊరేగండి కానీ నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని వార్నింగ్ ఇస్తుంది.
సురేష్: మీరు ఇలా మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి సురేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రౌడీలు వచ్చి సురేష్ ని అడ్డగిస్తారు.
రౌడీలు: ఏంటి మా సార్ ని బెదిరిస్తున్నావంట, పేపర్లో వేయిస్తానన్నావంట అంటూ అతనిపై అటాక్ చేస్తారు. ఒకడు సురేష్ ని కత్తితో పొడవబోతే కీర్తి పరిగెత్తుకుని వెళ్లి అడ్డుపడుతుంది. ఒక రౌడీ ఆ పాపని పక్కకి నెట్టేస్తాడు.
సురేష్: నా కూతురు జోలికి వచ్చావంటే ఊరుకోను అని కోపంగా అంటాడు.
రౌడీ: ఆ పిల్ల నీ కూతురా, సాక్ష్యాలు మాకు ఇచ్చి మీ పాపని తీసుకువెళ్ళు అని పాపని తీసుకొని అక్కడినుంచి పారిపోతారు.
కౌషికి: ఇదంతా మీ ఇద్దరి వల్లే జరిగింది నా పాపకు ఏమైనా జరిగిందంటే మీ ఇద్దరినీ వదిలిపెట్టేది లేదు.
దివ్యాంక :వాళ్లు మీ పిల్లని ఎత్తుకెళ్లిపోతే మధ్యలో నేనేం చేస్తాను.
సురేష్: పాపకి ఏమీ కాదు అని హామీ ఇస్తాడు. కానీ కౌషికి మాత్రం పాప ఒంటి మీద దెబ్బ పడిందంటే మాత్రం నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తుంది.
అప్పటికే ఎవరూ చూడకుండా రౌడీల వెనక వెళ్తారు ధాత్రి వాళ్ళు. సురేష్ కూడా వెళ్తుంటే నిన్ను వద్దనుకున్న కుటుంబం కోసం నువ్వెందుకు అంత తాపత్రయపడతావు అని దివ్యాంక సురేష్ ని ఆపుతుంది.
సురేష్: ఎవరు ఏమనుకున్నా తను నా కూతురు అయినా మీరు ఇలా మాట్లాడుతారని నేను అనుకోలేదు అని కోపంగా అక్కడి నుంచి వచ్చేస్తాడు.
ఆ తర్వాత రౌడీలు కీర్తిని తీసుకొని వచ్చేస్తుంటే డ్రైవర్ ప్లేస్ లో ఉన్న యువరాజ్ పక్కనే ఉన్న కీర్తి రౌడీలకి గన్ గురి పెడతారు. వాళ్లతో ఫైట్ చేసి పాపని రక్షిస్తారు. పోలీసులకి ఫోన్ చేయటంతో పోలీసులు కూడా వస్తారు.
పోలీస్: పాపని రక్షించినందుకు థాంక్స్ అంటాడు.
ధాత్రి: అదేంటి మీరే కదా పబ్లిక్ హెల్ప్ తీసుకుని పాపని రక్షించమని ఇన్ఫామ్ చేశారు అని అంటుంది.
పోలీస్: ఇదేంటి నేను కష్టపడుకుంటానే నాకు క్రెడిట్ వస్తుంది ఎవరో ఇన్ఫార్మ్ చేస్తే అది నేనే అనుకుంటున్నాట్లుగా ఉన్నారు అనుకుంటాడు.
ఇంతలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కీర్తిని హగ్ చేసుకుంటారు.. ధాత్రి వాళ్ళకి థాంక్స్ చెప్తుంది కౌషికి.
ధాత్రి : కీర్తిని రక్షించింది మేము కాదు ఈ పోలీస్ అని చెప్తుంది.
వైజయంతి: మేము కంప్లైంట్ ఇవ్వలేదు కదా అతనికి పాప కిడ్నాప్ అయినట్టు ఎలా తెలుసు.
ధాత్రి : ఆయన అదే టైంకి ఆ రెస్టారెంట్ కి టిఫిన్ చేయడానికి వచ్చారంట అని అబద్ధం చెప్తుంది.
యువరాజ్: వీళ్ళ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది వీళ్ళు ముగ్గురు ఏదో దాస్తున్నారో ఇందాక నిషిక చూసింది వీళ్ళనేనా అని మనసులో అనుమానపడతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
>Also Read : 'సలార్' సెకండ్ సింగిల్ వచ్చేసింది - యుద్ధమైన చిరునవ్వుతోనే ఆపేసి చూపాలిరా!