Jagadhatri Serial Today November 5th: జగద్ధాత్రి సీరియల్: పిన్నిని అక్కున చేర్చుకున్న కేథార్! నిషికి షాక్ ఇచ్చిన తల్లి!
Jagadhatri Serial Today Episode November 5th నిషి తల్లి ఇంట్లో అందరికి పౌర్ణమికి పిలిచి నిషిని మాత్రం రావొద్దని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode వైజయంతి తమతో పాటు తినడానికి యువరాజ్, నిషిక, సుధాకర్ ఒప్పుకోరు.. దాంతో ఓ మూలన కూర్చొని తింటాను ఆకలికి తట్టుకోలేనని వైజయంతి అనడంతో జగద్ధాత్రి వడ్డించి ఇస్తుంది. సుధాకర్‌కి ఒప్పించి ఇస్తుంది.
వైజయంతి కింద ఓ మూల కూర్చొని తింటుంటే కేథార్ తట్టుకోలేక వైజయంతి దగ్గరకు వెళ్లి కూర్చొని తింటాడు. కేథార్ వచ్చి పక్కన కూర్చొవడం యువరాజ్ కనీసం పట్టించుకోకపోవడంతో వైజయంతి ఏడుస్తుంది. కేథార్‌ని ప్రేమగా చూస్తుంది. కేథార్ పిన్నితో పిన్ని మీ పక్కన ఎవరు ఉన్నా లేకపోయిన అమ్మ లేని నాకు నువ్వు అమ్మ లాంటి దానివి నేను నీకు తోడుగా ఉంటాను అని అంటాడు.
నిషి మనసులో ఆవిడకే దిక్కులేదు నువ్వు ఆవిడను కాకాపట్టి ఏం ప్రయోజనం అనుకుంటుంది. వైజయంతి పొలమారితే కేథార్ నీరు తాగిస్తాడు. నేను తినిపిస్తాను అని వైజయంతికి తినిపిస్తాడు. సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. వైజయంతి సవతి కొడుకుని కన్న కొడుకుని చూస్తూ ఉంటుంది. కేథార్‌ని చూసి ఏడుస్తుంది. ఏడుస్తూ నా కడుపు నిండిపోయింది చాలబ్బీ అని ఏడుస్తూ వెళ్లిపోతుంది.
కౌషికి వైజయంతికి పాపం అని అనగానే సుధాకర్ కోపంతో వెళ్లిపోతాడు. తర్వాత శ్రీవల్లి, యువరాజ్, నిషి అందరూ వెళ్లిపోతారు. పిన్నిని అలా చూడలేకపోతున్నాం అని కౌషికి, కేథార్ అంటాడు. తను అలా బాధ పడితే నిజం బయట పెడతారు అని జగద్ధాత్రి అంటుంది.
యువరాజ్ రావడం లేదు యువరాజ్ వస్తేనే మన పని అవుతుందని మీనన్ వాళ్లు మాట్లాడుకుంటారు. యువరాజ్‌ని ఒప్పించేలా మాట్లాడుతా అని మీనన్ యువరాజ్‌కి కాల్ చేస్తాడు. యువరాజ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్లీ మళ్లీ కాల్ చేస్తాడు. ఆవేశంతో కొన్ని కొన్ని జరిగిపోతాయ్ అన్నీ మర్చిపోయి వచ్చేయ్ అని అంటాడు. నేను రాలేను అని యువరాజ్ అంటే నిషిక మొత్తం వింటుంది. నిషి ఫోన్ లాక్కొని యువరాజ్ వస్తాడు అని చెప్పేస్తుంది.
వైజయంతి అప్పుడే గది దగ్గరకు వచ్చి వింటుంది. నిషి యువరాజ్‌ని నువ్వు వెళ్లి తీరాలి లేదంటే నా ప్రాణాలు పోతాయి అని అంటుంది. నీ ప్రాణాల కోసం నా ప్రాణాలు తీసుకోవాలా.. నిన్ను పెళ్లి చేసుకోవడం, భాయ్ దగ్గరకు వెళ్లడం అంతా నా ఖర్మ అని యువరాజ్ ఆవేశంగా బయటకు వెళ్తాడు. వైజయంతి యువరాజ్‌తో బయటకు వెళ్లకురా,, కౌషికి మాట వినరా అంటే యువరాజ్ వైజయంతిని ముట్టుకోనివ్వడు. నాకు చెప్పే అర్హత నీకు లేదు,, నీ అడ్డమైనా యాక్టింగ్ నా దగ్గర చూపించకు.. నిన్ను చూస్తే అసహ్యంగా ఉంది అని అంటాడు.
యువరాజ్ భాయ్‌కి కాల్ చేసి కొంచెం టైం ఇవ్వండి వస్తాను అంటే సాయంత్రమే రమ్మని అంటాడు. నా కొడుకుకి ఏం అవుతుందా ఏమో అని విషయం ఎవరికైనా చెప్పి యువరాజ్‌ని కాపాడుకోవాలని వైజయంతి అనుకుంటుంది. ఇంతలో ఇంటికి నిషి తల్లిదండ్రులు వస్తారు. ఇక ఆటో డ్రైవర్ ఎక్కువ డబ్బులు అడుగుతాడు. ఇవ్వను అని జగద్ధాత్రి తండ్రి చెప్పడంతో కాలర్ పట్టుకొని కొట్టడానికి వెళ్తాడు. జగద్ధాత్రి వాళ్లు బయటకు రావడంతో జగద్ధాత్రికి వాళ్ల పిన్ని విషయం చెప్తుంది. జగద్ధాత్రిలో జేడీ బయటకు వచ్చేసి ఆటో డ్రైవర్‌ని వాయించేస్తుంది. అందరూ బిత్తరపోయి చూస్తారు. జగద్ధాత్రి ఆటో డ్రైవర్‌ని పంపి మా నాన్న జోలికి ఎవరైనా వస్తే నాకు ఆవేశం వచ్చేస్తుంది.. ఏం చేస్తాను నాకే తెలీదు అంటుంది.
కౌషికి మనసులో ఈ రేంజ్‌లో కొట్టింది అంటే పోలీసే అని అనుకుంటుంది. ఇక నిషి చీప్‌గా వచ్చి మా పరువు తీశారు ఇంట్లో రెండు కారులు ఉండి కూడా రాలేదని అంటుంది. నేను చాలా ఫీలయ్యానని నిషి అంటే నువ్వు దీనికే ఇంత ఫీలైతే మీరు చేసిన పనికి మేం ఎంత ఫీల్వాలి అని రేఖ అంటుంది. ఇక అందరూ ఇంట్లోకి వెళ్తారు. శ్రీవల్లి పలకరిస్తుంది. ఎవరు అని అడిగితే కౌషికి వదిన తీసుకొచ్చిందని జగద్ధాత్రి కవర్ చేస్తుంది.
జగద్ధాత్రి, నిషిల తండ్రి కార్తీక పౌర్ణమికి పిలవడానికి వచ్చామని అంటారు. మేం వస్తాం కానీ జగద్ధాత్రి వాళ్లు రారు అని నిషి అంటుంది. రేఖ వైజయంతికి కొట్ట బట్టలు పెట్టి పిలుస్తుంది. కౌషికికి కూడా బట్టలు పెట్టి పిలుస్తుంది. జగద్ధాత్రికి కూడా బట్టలు పెట్టి బొట్టు పెట్టి పిలుస్తుంది. నిషిని పిలవకపోవడంతో నాకు పిలవలేదు అంటే రేఖ నిషికి బొట్టు పెట్టి మీరు మాత్రం రావొద్దు అని అంటుంది. మేం ఎందుకు రావొద్దు అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















