Nuvvunte Naa Jathaga Serial Today November 5th: నువ్వుంటే నా జతగా: దేవాని వదిలి శాశ్వతంగా వెళ్లిపోతానని మాటిచ్చేసిన మిథున! హరివర్థన్ ఇక సేఫ్!
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 5th తన తండ్రిని కాపాడితే దేవాని వదిలేస్తా అని మిథున దేవాకి మాటివ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున తన తండ్రిని కాపాడమని దేవాని కోరుతుంది. తన జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపోతానని మాటిస్తే జడ్జిని కాపాడుతా అని దేవా కండీషన్ పెడతాడు. కండీషన్‌కి ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్లి కాపాడుతా అని అంటాడు.
దేవా పైకి మిథునని తన జీవితంలో నుంచి వెళ్లిపోమని కండీషన్ పెట్టినా మిథునని దూరం చేసుకోవాల్సి వస్తుందని బాధ పడతాడు. ఇలాంటి కండీషన్ పెడతావేంటి దేవా అని మిథున ఏడుస్తుంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం అని దేవా అనుకుంటాడు. మిథున వద్దని ఇలాంటి కండీషన్ వద్దని నువ్వు నన్ను నిజంగానే మనస్ఫూర్తిగా పంపేయాలి అనుకుంటున్నావా అని అడిగితే అవును అని దేవా అంటాడు.
దేవా నిజంగా నీకు నేను ఇష్టం లేదా అయితే నా కళ్లులోకి చూసి చెప్పు అని అంటుంది. నీకు నేను ఇష్టం దేవా నా మీద నీకు ప్రేమ ఉంది అని మిథున చెప్తే దేవా లేదు అని అంటాడు. నువ్వు దాస్తున్న నీ కన్నీరు చెప్తున్నాయి అని అంటుంది. దేవా మిథున కళ్లలోకి చూసి నువ్వు నాకు ఇష్టం లేదు.. నీ కళ్లలోకి సూటిగా చూసి చెప్పా ఇప్పుడు అయినా అర్థం చేసుకో అని అంటుంది. మిథున ఇంకా దేవాకి ఒప్పించాలి అని చూస్తే దేవా మీ నాన్నని కాపాడాలా లేదా చెప్పు కాపాడి అంటే నా కండీషన్‌కి ఒప్పుకో అని అంటాడు. అలా ఎలా ఒప్పుకుంటాను అని మిథున అంటే అయితే మీ నాన్న ప్రాణాలు పోయినా పర్లేదా అని దేవా అడుగుతాడు.
దేవా నువ్వేనా ఇంత దారుణంగా మాట్లాడుతుంది అని మిథున షాక్ అయిపోతుంది. ఈ బంధం నాకు చాలా ముఖ్యం నా గుండె కొట్టుకునేంత వరకు నా తాళి నా గుండెల మీద ఇలాగే ఉండాలి దయచేసి నా బాధ అర్థం చేసుకో అని మిథున అంటుంది. మా నాన్నని కాపాడు దేవా ఇలా బ్లాక్ మెయిల్ చేయకు అని మిథున అంటే ఇక మాటల్లేవు నా కండీషన్‌కి ఎస్ ఆర్ నో చెప్పు.. నువ్వు నా జీవితంలో నుంచి వెళ్లిపోతా అంటే మీ నాన్నని కాపాడుతా లేదంటే ఇక్కడ నుంచి వెళ్లిపోతా.. ఇంకా అరగంటే టైం ఉంది అని అంటాడు.
దేవా వెళ్లిపోతుంటే మిథున ఒప్పుకుంటా అని అంటుంది. మిథున దేవా చేతిలో చేయి వేసి మా నాన్నకి కాపాడితే నీ జీవితంలో నుంచి వెళ్లిపోతా అని మాటిస్తుంది. మీ నాన్నకి కాపాడుతా ఆ మరుక్షణమే నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి.. రెడీగా ఉండు అని చెప్తాడు. మిథున చాలా ఏడుస్తుంది.
సత్యమూర్తి ఇంట్లో బాధ పడుతూ ఉంటే కాంతం అందరితో మిథున వల్ల మనకు ఎప్పుడైనా ప్రమాదమే అని తెలిసి మీరు మామయ్య తనని పంపలేదు.. ఇప్పుడు చూడండి ఎలా జరిగిందో అని అంటుంది. రంగం కూడా మిథున అన్న వచ్చి కాలర్ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది అదే పోలీసుల్ని తీసుకొచ్చి ఉంటే అందరి జైలు పాలయ్యే వాళ్లం అని అంటుంది.
మిథున ఇంటికి రావడం చూసి కాంతం మిథునతో మీవల్ల మేం ఈ పాటికి పైలోకానికి పార్శిల్ అయిపోయేవాళ్లం అని రాహుల్ చేసిన గొడవ వార్నింగ్ గురించి చెప్తుంది. దయచేసి నువ్వు వెళ్లిపో తల్లి మేం ప్రశాంతంగా ఉంటాం అని కాంతం అంటుంది. కాంతాన్ని రెండు తిట్టి శారద కోడలికి ధైర్యం చెప్తుంది. మంచి వాళ్లకి మంచే జరుగుతుంది భయపడకమ్మా అని సత్యమూర్తి మిథునకు చెప్తాడు. కాసేపట్లో దేవా నన్ను పంపేస్తాడు అని మిథున అనుకుంటుంది.
ఎమ్మెల్యే హరివర్థన్‌ని కొట్టిస్తుంది. మళ్లీ వెళ్లి అడుగుతుంది. కేసు డ్రాప్ అవ్వమని చెప్తుంది. లేదంటే చంపేస్తా అని మళ్లీ బెదిరిస్తుంది. చంపేస్తే చంపేయ్ నేను మాత్రం నీ కొడుకుకి చిప్ప కూడు తినేలా చేస్తా అంటాడు. దాంతో ఎమ్మెల్య హరివర్థన్‌ని చంపేయమని అంటుంది. రౌడీలు హరివర్థన్‌ని చంపేటైంకి దేవా వచ్చి నేను ఉండగా అతన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారారా అని రౌడీలను చితక్కొడతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















