Chinni Serial Today November 5th: చిన్ని సీరియల్: దేవాని పూర్తిగా నమ్మేసిన మధు! దేవాకి తానే చిన్ని అని చెప్పేస్తుందా! 10 నిమిషాలు ఏం మాట్లాడుతుంది?
Chinni Serial Today Episode November 5th మధు, మ్యాడీ దేవా దగ్గరకు వెళ్లడం మధు దేవాకి తనని స్కామ్ నుంచి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత చందుతో మాట్లాడటం శ్రేయ చూస్తుంది. లోహిత దగ్గరకు వెళ్లి అతనేంటి నీతో మాట్లాడుతున్నాడు అని ప్రశ్నిస్తుంది. మన కాలేజ్ స్టాఫ్ స్టూడెంట్ మీద ఇలా అరవడం ఏంటి అని శ్రేయ అడిగితే చెప్పా కదా మాకు తెలిసిన వాడు అని నన్ను ఇంటికి వెళ్లమని చెప్పాడు అని అంటుంది. 
శ్రేయ లోహితను మీరు అంత రిచ్ కదా చందు సార్ మిడిల్ క్లాస్‌లా ఉన్నారు.. మీకు వాళ్లకి ఎలా రిలేషన్ ఉంది అని అడుగుతుంది. దానికి లోహిత వాళ్ల నాన్న మా దగ్గర పని చేస్తుంటారు. ఇతను అప్పుడప్పుడు వస్తారు. సేమ్ మా అన్నయ్య వయసే కదా అందుకే ఫ్రెండ్స్ అయ్యారు అంటుంది.
మధు, మ్యాడీ ఇద్దరూ దేవాని కలవడానికి బయల్దేరుతారు. మ్యాడీ దేవాకి కాల్ చేసి డాడీ మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఎక్కడున్నారు అని అడుగుతాడు. పార్టీ ఆఫీస్‌లో అని దేవా చెప్పగానే వస్తున్నా అంటాడు. మ్యాడీ, మధు ఇద్దరూ స్కూటీ మీద రావడం చూసిన దేవా కాస్ట్‌లీ కార్లో తిరగాల్సినోడివి ఇలా ఎండల్లో స్కూటీ మీద తిరుగుతున్నావా చా అని దేవా మనసులో అనుకుంటాడు.
మధు దేవాతో అంకుల్ నేను థ్యాంక్స్ చెప్పాలి అని వచ్చాను.. ఆ విషయంలో మీ ఇద్దరూ నాకు సాయం చేయకపోతే నాకు హాల్‌టికెట్ వచ్చేది కాదు.. థ్యాంక్యూ సో మచ్ అంకుల్ అని మధు చెప్తుంది.దానికి దేవా సోషల్ మీడియాలో వీడియో చూశా స్టేషన్కి కాల్ చేశా.. అయినా నా కొడుకు ఫ్రెండ్ ప్రాబ్లమ్‌లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని దేవా అంటాడు. దానికి మధు అంటే నా మీద మీరు చాలా కోపంగా ఉన్నారు కదా అంకుల్ అంత కోపం ఉన్నా నన్ను కాపాడారు మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంకుల్ అని మధు అంటుంది. అది మా ఫ్యామిలీకి సంబంధించి మేటర్ ఇది నీ లైఫ్‌కి సంబంధించిన మేటర్.. అందుకే దానికి దీనికి ముడి పెట్టకూడదు అని నీ మీద కోపాన్ని పక్కనపెట్టి నీకు సాయం చేశా అని అంటాడు. మీరు చాలా చాలా గ్రేట్ అంకుల్ చాలా చాలా థ్యాంక్స్ అని మధు అంటుంది. 
మ్యాడీ తండ్రితో మధు మీద కోపం పక్కన పెట్టినట్లే వరుణ్ బావ మీద కోపం పక్కన పెట్టొచ్చు కదా అంటాడు. వాడు నా మేనల్లుడు వాడు ఈ అమ్మాయి ఒకటేనా.. అయిన వాళ్లు బాధ పెడితే తట్టుకోలేం అని దేవా అంటాడు. మీరు వెళ్లండి నాకు మీటింగ్‌కి టైం అయింది అని దేవా అంటాడు.
మధు దేవా మాటలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటే మ్యాడీ చూసి ఏదో ఒకటి చేసి మధుని నవ్వించాలి అని నుకొని మధు ఫోన్ రింగ్ అవుతుంది మాట్లాడు అని అగ్గిపెట్టెలకు దారం కట్టి ఫోన్‌లా మధు ముందుకి తీసుకొస్తాడు. నేను చిన్ని చిన్నప్పుడు ఇలా మాట్లాడుకునేవాళ్లం ఇప్పుడు మనిద్దరం కూడా మాట్లాడుకుందాం అని అంటాడు. ఇద్దరూ ఆ ఫోన్‌లో మాట్లాడుకుంటారు. కాలేజ్‌లో నువ్వు సూపర్ స్టార్ అయిపోయావ్ అని మ్యాడీ అంటే నేను కాదు నువ్వు మీ డాడీ సూపర్ స్టార్స్ మీరు సాయం చేయకపోతే నా లైఫ్ పోయేది అని మధు అంటుంది. 
మధు మ్యాడీకి చిన్ని గురించి చెప్పమని అంటుంది. మ్యాడీ హ్యాపీగా చెప్తా అని మాట్లాడుతాడు. మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది. చిన్ని గురించి నువ్వు చెప్తుంటే అంతా నా కళ్ల ముందే జరిగినట్లు అనిపిస్తుంది చాలా బాగా చెప్పావ్ అని మధు అంటుంది. మధుని మ్యాడీ నవ్వించి వెళ్లిపోతాడు. చిన్నప్పటి విషయాలు ఒక్కటి కూడా మర్చిపోలేదు నా మహి అని మధు అనుకుంటుంది. 
చిన్ని గురించి త్వరగా తెలిస్తే కానీ మ్యాడీ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు అని దేవా రౌడీలకు కాల్ చేసి ఆఫ్ టికెట్ నిజం చెప్పాడా అని అడుగుతాడు. ఇంకా చెప్పలేదని రౌడీలు అంటే చావు అంచుల వరకు వెళ్లే వరకు కొట్టండి అప్పుడు నిజం చెప్తాడు అని దేవా అంటాడు. మధు చెప్పిన థ్యాంక్స్ గురించి దేవా ఆలోచిస్తూ ఉంటాడు. నాగవల్లి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ బావ అని అడిగితే ఆ మధు గురించి అని అంటాడు. 
మ్యాడీ ఇప్పుడు మన మాట కంటే మధు మాట ఎక్కువ వింటున్నాడు.. ఆ మధుకి హాల్‌టికెట్ రాదేమో పరీక్షలు రాయలేదేమో అని చాలా కంగారు పడ్డాడు. ఆ మధు స్నేహానికి వాడు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. అది మనం వాడుకొని మన పని పూర్తి చేసుకోవాలి.. చేస్తా ఆ మధుని అడ్డుపెట్టుకొని మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా అంటాడు. ఏం చేస్తానో ఎలా చేస్తానో చూస్తూ ఉండు ప్రాబ్లమ్ మాత్రం సాల్వ్ అయిపోతుంది అని దేవా అంటాడు.
మధు దేవా గురించి ఆలోచిస్తుంది. అంకుల్ ఎంత మంచివాళ్లు అని అనుకుంటుంది. నా భవిష్యత్ గురించి ఆలోచించిన ఆయన మ్యాడీ, వరుణ్‌ల భవిష్యత్ గురించి ఇంకెంత ఆలోచిస్తారు కానీ ఆయనకు విషయం అర్థమయ్యేలా చెప్పాలి.. అని అనుకుంటుంది. అందుకు దేవా ఒక్కడినే కలవడానికి పార్క్‌కి వెళ్తుంది. 
దేవాని కలిసి అంకుల్ ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి టైం ఇవ్వండి అని అంటుంది. మా ఇంటికి వెళ్లి మాట్లాడుదాం అని దేవా అంటే వద్దు అంకుల్ ఇక్కడే మాట్లాడుకుందాం అని అంటుంది. పర్లేదు రామ్మా అని చెప్పి మధుని తీసుకెళ్తాడు. మధు స్కూటీ తీసుకురమ్మని తన మనిషికి చెప్తారు. మ్యాడీ ఫ్రెండ్ అని తెలిసే నన్ను ఇంతలా చూసుకుంటున్నారు. కానీ నేనే చిన్ని అని తెలిస్తే అంకుల్ ఇంకెంత చక్కగా చూసుకుంటారో అని అనుకుంటుంది మధు.
లోహిత వరుణ్, మ్యాడీలు తనని తన ఇంటికి తీసుకెళ్లాలా ప్లాన్ చేస్తుంది. కావాలనే ఫోన్‌లో ఏడుస్తూ మమ్మీ మమ్మీ అని నా మీద బెంగ పెట్టుకోవద్దు అని పెద్దగా ఏడుస్తుంది. వరుణ్, మ్యాడీ వచ్చి ఏమైంది అని అడిగితే మా అమ్మ నా మీద బెంగతో అన్నం తినడం మానేసింది మెడిసిన్ వేసుకోవడం మానేసిందని ఏడుపు నటిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















