Illu Illalu Pillalu Serial Today November 5th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మదని చంపేస్తానని బెదిరించిన సేనా.. అర్ధరాత్రి వీధిలో రచ్చ!
Illu Illalu Pillalu Serial Today Episode November 5th నర్మద ఆస్తులు జప్తు చేయడంతో సేనాపతి తాగి చెల్లి ఇంటి మీదకు గొడవకు వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode నర్మద భద్రావతి, సేనాపతిల ఇల్లీగల్ ఆస్తులను జప్తు చేస్తుంది. ఇదంతా మీ మామయ్య చెప్తే నువ్వు చేస్తున్నావ్ నీ అంతు చూస్తా అని నర్మద మీదకు రాబోతే పోలీసులు అడ్డుకుంటారు. మీ మామని చూసి రెచ్చిపోతున్నావ్ నిన్ను వదలనే అని సేనాపతి అంటే పోలీసులు సేనాని ఈడ్చుకుంటూ వెళ్తారు. భద్రావతి నర్మదని కోపంగా చూస్తుంది.
ఇడ్లీబాబాయ్, భాగ్యం పడుకొని ఉంటే పొద్దు పొద్దున్నే శ్రీవల్లి వచ్చి డోర్ కొడుతుంది. శ్రీవల్లి చేతిలో పూల దండలు చూసి ఏమైంది దండలతో వచ్చావు అని భాగ్యం అడిగితే మీ చావు తెలివి తేటలు అన్నీ వాడేసి నాకు పెళ్లి చేశారు కదా మీకు సన్మానం చేస్తాను అని అంటుంది. గుడ్డు నుంచి పిల్ల వస్తే కోడికి ఇప్పుడు మాకు చాలా గర్వంగా ఉందే అమ్మడూ అని ఇడ్లీబాబాయ్ మురిసిపోతాడు.
శ్రీవల్లి తల్లిదండ్రులిద్దరికీ దండలేస్తుంది. నేనో పెద్ద కృష్ణ పరమాత్ముడిని అన్నట్లు నాకు రాయభారం అప్పగించారు.. ఆ బండోడు పూటకోసారి అమూల్యని అక్కడికి తీసుకురా ఇక్కడికి తీసుకురా అని నన్ను చంపేస్తున్నాడు..నన్ను కానీ మా ఇంట్లో ఎవరైనా ఆ బండ సచ్చినోడితో మాట్లాడుతున్నట్లు చూశాడే అనుకో నా కాపురం సంగతి అటు ఉంచు.. నన్ను చంపి పాతేస్తారు అని శ్రీవల్లి అంటుంది. మీరు అసలు మనుషులే కాదు అని బండ బూతులు తిడుతుంది. 
సేనాపతి ఫుల్లుగా మందు తాగేసి రాత్రి రామరాజు ఇంటి మీదకు వెళ్తాడు. రేయ్ రామరాజు రారా నువ్వా నేనా తేల్చుకుందాం అని అరుస్తాడు. వేదవతి తన కోడళ్లు, కూతురు బయటకు వస్తారు. తర్వాత కొడుకులు, తిరుపతి కూడా వస్తారు. ఆ పిరికి దద్దమ్మని రమ్మని చెప్పండ్రా అంటే చందు, ధీరజ్, సాగర్ గొడవకు వెళ్తారు. వేదవతి ఆపుతుంది. మీ నాన్న లేనప్పుడు ఇంట్లో గొడవ జరిగింది అని తెలిస్తే తట్టుకోలేరు వద్దురా అని అంటుంది. ఇక సేన రామరాజుని గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చొన్నాడా అని అనడంతో మళ్లీ గొడవ జరుగుతుంది. దాంతో వేదవతి మరోసారి ఆపి కొడుకుల్ని లోపల పెట్టి గేటు వేసి ఈ గేటు దాటి వస్తే నా మీద ఒట్టు అని చెప్పి కొడుకుల్ని ఆపేస్తుంది.
అన్న దగ్గరకు వెళ్లి మేం మీ జోలికి రాలేదు.. మరి తాగి మా ఇంటి మీదకు గొడవకు ఎందుకు వచ్చావ్.. నీకు వేరే పనీ పాటా లేదా అని తిడుతుంది. ఏంటి మీ పని మీరు చూసుకుంటున్నారా.. మరి అయితే మీ రెండో కోడలితో చెప్పి మా ప్రోపర్టీని సీజ్ చేయించారెందుకు అని అడుగుతాడు. అందరూ షాక్ అయి నర్మదని చూస్తారు.
నర్మద గేటు తీసి బయటకు వచ్చి చూడండి మీరు గవర్నమెంట్ ఆస్తిని కబ్జా చేశారు.. పక్కా ఆధారాలు ఉండటం వల్ల నేను ఒక సబ్ రిజిస్టర్‌గా నా డ్యూటీ నేను చేశాను.. అది పూర్తిగా నా డ్యూటీకి సంబంధించిన విషయం.. మీరు ఏమైనా మాట్లాడాలి అంటే ఆఫీస్‌కి వచ్చి మాట్లాడండి.. అంతే కానీ ఇలా ఇంటి మీకు వస్తే నేను లీగల్‌గా వెళ్లాల్సి వస్తుంది అని అంటుంది. ఆ కూలోడు రామరాజు డైరెక్ట్‌గా మాతో పెట్టుకోలేక ఇలా నీ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నాడు.. సిగ్గులేని వాడు అని తిడతాడు. 
నర్మద మళ్లీ ఫైర్ అవుతుంది. మామయ్యగారికి ఇందులో ఏం సంబంధం లేదు అని అంటుంది. ఆ రోజు ఆ కూలోడు నా చెల్లిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయాడు.. వాడి కొడుకు నా కూతుర్ని తీసుకెళ్లిపోయాడు.. వాడిని వదలను.. మరీ ముఖ్యంగా నిన్ను వదలను అని నర్మదకి సేనాపతి వార్నింగ్ ఇస్తాడు.
ధీరజ్ ప్రేమని గదిలో తిడతాడు. మీనాన్నకి బుద్ధి ఉందా.. ఆడవాళ్ల మీదకు అలా రాకూడదు అని కనీసం లేదా.. అలా ఎలా వచ్చేస్తాడు మీదకు ఎందుకు అలా గొడవ పడతాడు అని అంటాడు. వదిలేయ్‌రా అని ప్రేమ అంటే నీకు కోపం వస్తుంది కదా మీవాళ్లని ఏమైనా అంటే నీకు కోపం వస్తుంది.. నీకు వాళ్లు అంటే అంత లవ్ కదా,, వాళ్లు తప్పు చేసినా వాళ్లే రైట్ అని అంటాడు. రేయ్ జరిగింది వదిలేయ్‌రా అని ప్రేమ అంటే ధీరజ్ ఊరుకోడు.. మీ వాళ్లని వెనకేసుకొని రావడం నీకేం కొత్త కాదు అని తిడతాడు. మనవైపు తప్పు పెట్టుకొని కూడా ఎదుటి వాళ్ల మీదకు వెళ్లడం మీ బ్లడ్‌లోనే ఉంది కదా.. మీరు రాక్షస జాతికి ఆఖరి వాళ్లలా ఉన్నారే ఎప్పుడూ గొడవలే అని అంటాడు.
ప్రేమ కోపంతో రేయ్ ధీరజ్ అంటూ ధీరజ్ చేతికి కొరికేస్తుంది. ధీరజ్ కెవ్వుమంటాడు. రాక్షసి ఇలా కొరికి చచ్చావేంటే అని ధీరజ్ అని ఇద్దరూ గొడవ పడతారు. కొట్టుకోవాలని చూస్తారు. ప్రేమ ధీరజ్‌ని మెలేసి కొట్టేస్తుంది. ఇక నుంచి దీంతో జాగ్రత్తగా కాస్త దూరంగా ఉండాలి అని ధీరజ్ అనుకుంటాడు. సేనా ఇచ్చిన వార్నింగ్ తలచుకొని వేదవతి ఆలోచిస్తుంది. ఇంతలో నర్మద వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















