Ammayi garu Serial Today November 4th: అమ్మాయిగారు సీరియల్: ఒక్కో సీన్ క్లైమాక్స్ లెక్కే! రాజు, కోమలిల పోరు మొదలైందా! దీపక్ మారిపోయాడా!
Ammayi garu Serial Today Episode November 4th అశోక్ కోమలి గురించి నిజం చెప్తా అని వచ్చి రాజు మీద నింద వేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ మందారం మాట వింటున్నాడని అందుకు తాయొత్తు కారణం తెలుసుకున్న విజయాంబిక దీపక్‌కి విరుగుడు తాగిస్తుంది. చేతికి ఉన్న తాయొత్తు తీస్తుంది. ఇక కోమలి తనకు అన్యాయం చేస్తుందని అశోక్ కోమలి నాటకం గురించి సూర్యప్రతాప్‌తో చెప్పడానికి అశోక్ ఇంటికి వస్తాడు.
సూర్యప్రతాప్‌తో అశోక్ మీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతుందని చెప్పి తన లవర్ తనని మోసం చేసిందని.. ఇప్పుడు నాకు మీ ఇంటి నుంచి ప్రాణహాని ఉందని అంటాడు. కోమలి, విజయాంబిక తమ గురించి అశోక్ చెప్పేస్తాడని వణికిపోతారు. అయితే అశోక్ కోమలిని చూపిస్తూనే రాజు మీదకు ప్లేట్ తిప్పేస్తాడు. రాజు వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్తాడు. చీమకు కూడా హాని చేయని రాజు నీకు ఇబ్బంది పెట్టడం ఏంటి అని సూర్యప్రతాప్ అడిగితే ఆరోజు ఈ అమ్మాయి (కోమలి) తో మాట్లాడినందుకు నన్ను టార్గెట్ చేశారు.. నా ఉద్యోగం తీయించేశారు.. సీఎంతో తలపడే అంత సీన్ నాకు లేదు సార్.. నా పెళ్లి కూడా ఆగిపోయింది సార్ నా జోలికి రావొద్దని చెప్పమని అశోక్ మోకాలి మీద పడి కోరుతాడు.
రాజు అశోక్‌తో నోటికి వచ్చినట్లు వాగితే ఊరుకోను అని అంటాడు. చూడండి సార్ మీ ముందే ఎలా బెదిరిస్తున్నాడో అని అశోక్ అంటాడు. రూప అశోక్‌ని ఏయ్ ఆపు.. పరిస్థితిని మీకు నచ్చినట్లు వాడుకోవడం మీకు అలవాటు అని అర్థమవుతుంది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన.. అంటారు.. చేసే పని మీదే మనకు అధికారం ఉంటుంది. ఫలితం మీద కాదు.. ఖర్మ అనేది ఒకటి ఉంటుంది. నిజం నీడలో అబద్ధపు ముసుగు వేసుకొని అందలం ఎక్కేస్తాం అని అనుకోడు.. పోతారు.. మొత్తం కట్టకట్టుకొని కొట్టుకొని పోతారు అని ఇన్‌డైరెక్ట్‌గా రూప కోమలి, విజయాంబిక వాళ్లకి వార్నింగ్ ఇస్తుంది.
సూర్యప్రతాప్ అశోక్‌తో రాజు సామాన్యంగా ఎవరి జోలికి వెళ్లడు.. నువ్వు చెప్పినా వచ్చాడు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏది ఏమైనా పెళ్లి కుదిరింది అన్నావు కదా రాజు నీ జోలికి రాడు.. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి అశోక్‌ని పంపేస్తాడు. ఇలా అయింది ఏంటి అని విరూపాక్షి రాజు, రూపల్ని ప్రశ్నిస్తుంది. కోమలి నన్ను అడ్డు పెట్టుకొని ఏదో సాధించాలి అనుకుంది కదా అమ్మగారు అదే కోమలిని వాడుకొని మనం వాళ్లని ఇరికించాలని ప్లాన్ చేశాం.. నా నటన చూసి అశోక్ కోమలి నాటకం చెప్పేస్తాడు అనుకున్నా కానీ మొత్తం మారిపోయింది. నేను వేసిన ప్లాన్ నాకు అమ్మాయి గారికి తప్ప ఇంకెవరికీ తెలీదు.. అయినా ఆ అశోక్ ఎలా ప్లాన్ మార్చాడో అర్థం కావడం లేదు అని రాజు అంటాడు.
విజయాంబిక, కోమలితో దీపక్ అశోక్ అలా మాట్లాడటానికి కారణం నేనే అశోక్ ఏదో కొంపలు అంటుకునే పని చేస్తాడని అడ్డుకున్నానని దీపక్ చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్‌లో దీపక్ అశోక్‌ని అడ్డుకొని కోమలి ఎవరి విషయంలో తప్పు చేసినా నీ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.. అది నీకు తెలుసు.. నాకు తెలిసి ఇదంతా రాజు ప్లాన్ అయింటుంది. నిన్ను ట్రాప్ చేసుంటాడు. కోమలి రాజు వెంట పడటం లేదు అని దీపక్ చెప్తాడు. దీపక్ అశోక్‌కి మొత్తం చెప్తాడు. దాంతో అశోక్ విషయం మార్చేస్తాడు.
మందారం నీకు మాయ చేసిందిరా అని విజయాంబిక అంటే ఇక నుంచి మందారం ఏం ఇచ్చినా తీసుకోవద్దని కోమలి అంటుంది. ఇలా జరిగింది ఏంటా అని రూప బాధ పడుతుంది. అశోక్ బయట ఉంటే రాత్రి కోమలి వెళ్లి అశోక్‌ని కలుస్తుంది. ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. విజయాంబిక, దీపక్ కూడా వెనకే వెళ్తారు. కోమలి అశోక్‌కి సారీ చెప్పి నన్ను అపార్థం చేసుకుంటావా అని అంటుంది. అశోక్ కూడా సారీ చెప్తాడు. నువ్వు రాజుతో చనువుగా ఉంటే నేను తట్టుకోలేను అని అంటాడు. వాడితో కలిసి నువ్వు కాఫీ తాగడమేంటి.. తినడమేంటి.. వాడితో కలిసి గుడికి వెళ్లడం ఏంటి అని అడుగుతాడు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని కోమలి అడిగితే రాజు చెప్పాడని అశోక్ అంటాడు.
కోమలి, విజయాంబిక వాళ్లు షాక్ అయిపోతారు. రాజునే అశోక్‌ని గుడికి కూడా పిలిచాడు అని తెలిసి బిత్తరపోతారు. ఇదంతా రాజు ప్లానా అని కోమలి వాళ్లు బిత్తరపోతారు. రాజుని కనీసం అనుమానించలేకపోయాం.. రాజుకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మామూలుగా ఉండదు అని అంటుంది. రాజు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి.. నేనేంటో రాజుకి పూర్తిగా అర్థమయ్యేలా చేస్తా అని కోమలి అంటుంది.
మందారం దీపక్ చేయి పట్టుకొని రండి బాబు భోజనం చేద్దాం అని అంటే దీపక్ కోపంగా చూసి మందారానికి లాగిపెట్టి కొట్టి ఏంటి అలా చూస్తున్నావ్ నువ్వు కట్టిన తాయొత్తు పని చేస్తుందో లేదో అని చూస్తున్నావా అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















