Jagadhatri Serial Today November 4th: జగద్ధాత్రి సీరియల్: నిజం చెప్పేసిన వైజయంతి.. శ్రీవల్లి, కేథార్‌కి ఆస్తి ఇచ్చేసిన సుధాకర్! ధీనస్థితిలో వైజయంతి!
Jagadhatri Serial Today Episode November 4th వైజయంతి సుధాకర్‌ని శ్రీవల్లి సుహాసిని కూతురు అని చెప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ, కేడీలు యువరాజ్ నిర్దోషి అని నిరూపిస్తారు. ఇక యువరాజ్ తన తల్లి తప్పు చేసిందని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడు. సుధాకర్ శ్రీవల్లి కోసం బట్టలు తెస్తాడు. ఎవరూ నిన్ను పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటా అని అంటాడు.
వైజయంతి అందరికీ వడ్డించి మార్కులు కొట్టేయాలి అనుకుంటుంది. సుధాకర్కి వడ్డిస్తుంది. సుధాకర్ ప్లేట్ అవతలకు విసిరేసి నీ చేతితో ఏం పెట్టినా అది విషమే నేను తినను.. అంటాడు. యువరాజ్ తల్లితో నాన్న అన్నదాంట్లో తప్పు లేదు.. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ నువ్వు వడ్డిస్తే నేను కూడా తినను.. నీ ఓవర్ యాక్షన్ ఆపు దొంగ ఏడుపు ఆపు అని అంటాడు. యువరాజ్, నిషి వైజయంతిని అసహ్యించుకొని వెళ్లిపోతారు.
కౌషికి పిన్నితో నిజం చెప్పేస్తే మీకు మీ కన్నీరు ఉండవు కదా నిజం చెప్పేయండి పిన్ని అని అంటుంది. వైజయంతి ఏడుస్తూ వెళ్లిపోతుంది. పిన్ని బాగా ఫీలైందని కేథార్ అంటే ఆవిడ ఎంత బాధ పడితే అంత త్వరగా నిజం బయటకు వస్తుంది అని జగద్ధాత్రి అంటుంది. శ్రీవల్లి ఇంటి నుంచి వెళ్లిపోతా నా వల్లే అంతా అవుతుందని అంటే వద్దు శ్రీవల్లి నిజం బయటకు రావాలి అంటే ఇలాంటివి తప్పవు అని ధైర్యం చెప్పి వడ్డిస్తుంది.
కౌషికి సుధాకర్ దగ్గరకు వెళ్లి మీ ఆరోగ్యం బాగుండాలి బాబాయ్ మీరు ముందు తిని మందులు వేసుకోవాలి అంటుంది. సుధాకర్ కౌషికితో అది అస్సలు పశ్చాత్తాప పడుతుందా.. చూడు ఎలా మాట్లాడుతుందో అని అది వడ్డిస్తే నేను తినను అని అంటాడు. నేను వడ్డిస్తా రండి అని కౌషికి పిలుస్తుంది. యువరాజ్, నిషి వచ్చి ఆవిడను పట్టించుకోవద్దు.. మీరు ఆవిడను చూడొద్దు అని అంటారు. సుధాకర్ సరే అని వెళ్తాడు.
వైజయంతి జరిగింది తలచుకొని ఏడుస్తుంది. ఏంట్రా నా బతుకు ఇలా తయారైంది.. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన కొడుకు ఇలా అసహ్యించుకుంటున్నారు. చివరకు నా కోడలు కూడా నోటికొచ్చినట్లు తిడుతుంది. ఇంకా ఈ నిజం దాచడం వల్ల నాకు వచ్చే లాభం లేదు.. అని నిజం చెప్పేయాలి అని వైజయంతి అనుకుంటుంది.
వైజయంతి ఆవేశంగా డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి శ్రీవల్లిని లాగేస్తుంది. ఏం చేస్తున్నారు అత్తయ్యా అని జగద్ధాత్రి అడిగితే నా మీద పడిన నింద చెరిపేసుకుంటా.. ఈరోజు నిజం చెప్తా అని అంటుంది. శ్రీవల్లిని వైజయంతి తోసేస్తుంది. దాంతో సుధాకర్ వైజయంతి తిడుతాడు. ఇది నా కడుపున పుట్టిన కూతురు కాదు.. దీనికి నేను తల్లి కాదు.. అని అంటుంది. నువ్వు కన్నది కాకపోతే దీన్ని నువ్వు ఎందుకు ఆశ్రమంలో ఎందుకు చేర్చావ్ అని అడుగుతాడు. దాంతో వైజయంతి ఇది నా కూతురు కాదు.. నీ మొదటి భార్య సుహాసిని కూతురు.. నీ కన్న కూతురు.. ఈ కేథార్ గాడికి సొంత చెల్లెలు.. ఆ రహస్యం నీకు తెలిస్తే దీన్ని ఇంటికి తీసుకొచ్చి ఆస్తిలో వాటా ఇస్తావని ఈ విషయం ఎవరికీ తెలీకూడదని అనాథాశ్రంలో చేర్పించా అని అంటుంది.
కేథార్ ఏడుస్తూ ఎంత పని చేశారు పిన్ని తల్లిని బిడ్డను వేరు చేస్తారా అని అంటాడు. నేనేం తల్లిబిడ్డల్ని వేరు చేయలేదు.. దీన్ని కన్న తర్వాత మీ అమ్మ చనిపోయింది.. అందుకే దీనికి ఎప్పటికైనా దాని తల్లి ఎవరో తెలియాలి అని సుహాసిని ఫోటో పెట్టా అని అంటుంది. ఇప్పటికైనా మీ రాక్షసత్వం బయట పెట్టి నా రక్తాన్ని బయట పెట్టినందుకు నాకు ఆనందమే అని కేథార్ అంటాడు.
శ్రీవల్లిని దగ్గరకు తీసుకుంటాడు. నువ్వే నా తోడబుట్టిన వాడు అయింటే బాగున్నా అనుకున్నా నువ్వే అయ్యావ్ అని శ్రీవల్లి అంటుంది. సుధాకర్ శ్రీవల్లితో నీకు నీ అన్నకి నేను ద్రోహం చేశాను.. కేథార్ నా కొడుకు అని నేను ప్రపంచానికి చెప్పలేకపోయా.. నువ్వు పుట్టినట్లు కూడా నాకు తెలీదు అమ్మా.. ఇప్పటి వరకు అయింది అయింది.. ఇక మిమల్ని అనాథల్లా బతకనివ్వను.. వీళ్లిద్దరికీ ఆస్తిని చెరో సగం పంచుతా అని సుధాకర్ అంటాడు. అంత పని చేయకు అబ్బోడు అన్యాయం అయిపోతాడు అని వైజయంతి అంటుంది. అంత పని చేయొద్దు అని బతిమాలుతుంది. వాడికి చేయాల్సింది చాలా చేశా ఇక మీ దారి మీరు చూసుకోండి అని అంటాడు.
సుధాకర్ నిర్ణయంతో వైజయంతి, యువరాజ్, నిషిక బిత్తరపోతారు. కౌషికి కూడా మీ నిర్ణయం మంచిదే అని యువరాజ్ కూడా పాపాలు చేస్తుంటాడు కాబట్టి వాడు సున్నాతో మొదలవ్వాలి.. కేథార్, శ్రీవల్లికి ఆస్తి పంచేయండి అని అంటుంది. సుధాకర్ ఆస్తి పేపర్లు తీసుకురమ్మని కౌషికికి చెప్తుంది. యువరాజ్ ఎంత ఆపినా సుధాకర్ సంతకం పెట్టి కేథార్, శ్రీవల్లికి తన ఆస్తి మొత్తం రాసేసి నా వారసులు వాళ్లే అని అంటాడు. పేపర్లు చింపేస్తా అని వైజయంతి అంటే సుధాకర్ లాగిపెట్టి కొడతాడు. తీరా చూస్తే ఇదంతా వైజయంతి కల..
సుధాకర్ నిజం ఏంటి అని వైజయంతిని అడిగితే వైజయంతి తడబడుతుంది. మళ్లీ వైజయంతికి చీవాట్లు పడతాయి. నన్ను ఇలా దూరం పెట్టడం మీకు ఏమైనా బాగుందా అని వైజయంతి అంటే చాలా బాగుంది అని యువరాజ్ అంటాడు. కనీసం భోజనం అయినా చేస్తానురా అని వైజయంతి అడిగితే నువ్వు మాతో కలిసి కూర్చొవడానికి అయినా వీల్లేదు అని యువరాజ్ అంటాడు. కనీసం ఈ మూల అయినా కూర్చొని తింటానురా.. ఆకలికి అస్సలు తట్టుకోలేను అని మీకు తెలుసు కదా అని ఏడుస్తుంది. జగద్ధాత్రి నేను పెట్టిస్తా అత్తయ్యగారు అని అంటుంది. జగద్ధాత్రిని సుధాకర్ కోపంగా చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















