Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ విహారిని హర్ట్ చేయడానికి కారణమేంటి? కావేరి గతంతో విహారికి సంబంధం ఉందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode November 4th లక్ష్మీ విహారితో చెప్పి టెండర్ ఆపించడం అంబిక ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి టెండర్ వేయకుండా ఆపడానికి వచ్చిన లక్ష్మీని అంబిక తన మనుషులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. విహారి టెండర్ వేసే టైంకి రెండు మూడు సార్లు లక్ష్మీ పిలుపు వినిపించి బయటకు వెళ్లి చూస్తాడు.
విహారి లక్ష్మీని రౌడీలు తీసుకెళ్లడం చూస్తాడు. లక్ష్మీని కాపాడటానికి వెళ్తూ టెండర్ పేపర్ కింద పడేస్తాడు. దాంతో అది బురద నీటిలో పడి తడిసిపోతుంది. ఇక రౌడీలను విహారి చితక్కొట్టి లక్ష్మీని కాపాడుతాడు. టెండర్ పేపర్ తడిసిపోవడం చూసిన అంబిక కోపంగా రగిలిపోతుంది. అభిజిత్‌ని ఆఫీస్‌కి వెళ్లిపోమని చెప్తుంది. మళ్లీ ఏం తెలీనట్లు విహారి వాళ్ల దగ్గరకు వస్తుంది.
లక్ష్మీ విహారితో విహారిగారు మీరు ఈ టెండర్ వేయొద్దు అని అంటుంది. నువ్వు ఓకే చేసిన టెండర్ కదా అని విహారి అంటే లేదు బాబు నేను రిజెక్ట్ చేశా అని అంటుంది. ఎవరో కావాలనే ఇదంతా చేశారు అని మనకు తెలీకుండా మన చుట్టూ శత్రువులు ఉన్నారు అని వాళ్లని నేను కనిపెడతా అని అంబిక వెళ్లిపోతుంది. విహారి లక్ష్మీతో నువ్వు నాకు చాలా సాయం చేశావ్ నీ సాయం ఎలా తీర్చుకోవాలి అంటే నేను చేసిన ఉడత సాయానికి మీరు అలా అనొద్దు అంటుంది.
విహారి లక్ష్మీని డ్రాప్ చేస్తాను అని చేయి పట్టుకుంటే లక్ష్మీ విడిపించేస్తుంది. పండుని తనని తీసుకెళ్లమని అంటుంది. విహారి పండుని పంపేసి నేను తప్పు చేశాను అని అనుకుంటున్నావా,, నీ చేయి పట్టుకునే అర్హత నాకు లేదా అని అంటాడు. నేను ఆ రోజు తాగడం తప్పే కానీ నా మనసులో నిన్ను పెట్టుకొని మరొకరితో ఉండలేను.. నువ్వు నీ చేయి పట్టుకోవద్దు అని అనుకుంటే నాకు చావాలి అని ఉంది అని అంటాడు. మీరు మిమల్ని నిందించుకోవద్దు.. మీరు చేసింది తప్పు కాదు.. సహస్రమ్మతో మీకు పెళ్లి అయింది అది తప్పు కాదు అని అంటుంది. మీకు నాకు ఏం సంబంధం లేదు విహారి గారు అని అంటుంది లక్ష్మీ. నేను నీ భర్తని లక్ష్మీ అని విహారి అంటే దయచేసి అలా మాట్లాడకండి..మీకు సహస్రమ్మకి దేవుడు రాసేశాడు.. నేను మీకు దూరంగా ఉండటం కాదు.. మీరు నాకు దూరంగా ఉండాలి..నేను మిమల్ని ఎప్పటికీ ద్వేషించలేను.. అలా అని ప్రేమించలేను.. మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అని చెప్పి పండుతో వెళ్లిపోతుంది.
యమున పూజ చేసి తన ఫోన్ ఎక్కడ ఉందో అనుకుంటుంది. ఆ రోజు విహారి అనుకోకుండా ఫోన్ టచ్ చేసి వీడియో రికార్డ్ చేసిన ఫోన్ యమునది. యమున ఫోన్ కోసం మొత్తం వెతుకుతుంది. సహస్ర రాగానే ఫోన్ గురించి అడుగుతుంది. విహారి గదిలో యమున ఫోన్ చూసే టైంకి విహారి వచ్చాడని వెళ్లిపోతుంది. పండు లక్ష్మీతో ఎందుకమ్మా ఇలా చేస్తున్నావ్ అంటే నేను ఈ కుటుంబం కోసమే చేస్తున్నా అని నీకు తెలుసు ఆ విషయం ఇంకెప్పుడూ మాట్లాడకు అంటుంది.
లక్ష్మీ దగ్గరకు యమున వస్తే లక్ష్మీ యమునకు విహారి బాబు టెండర్ వేయలేదు అని చెప్తుంది. లక్ష్మీ డల్‌గా గదిలోకి వెళ్తే ఏమైందిరా పండు లక్ష్మీ అలా ఉంది అని యమున అడిగితే పండు యమునకు ఫైట్ గురించి చెప్తాడు. లక్ష్మీ కష్టాలు తలచుకొని యమున ఏడుస్తుంది.
కావేరి ఇంటి పనులు చేస్తుంటే వీర్రాజు చూసి ఏంటమ్మా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ అవతారం ఏంటి అని అంటాడు. పెళ్లి ఏంటి అండీ అని కావేరి అడిగితే నిన్ను ఇంట్లో పెట్టుకొని ముప్పూటలు మేపుతుంది ఎందుకు వేరే ఎవడినో నీకు ఇచ్చి పెళ్లి చేసి కాళ్లు కడిగి పంపేయడానికి అనుకున్నావా.. సకల కలా వల్లభుడు అయిన నా కొడుకుతో పెళ్లి చేయడానికి పెళ్లి కూతురు ఎలా ఉండాలో అలా ఉండు అంటాడు. అది కాదండీ అని కావేరి అంటే మీ అమ్మ కోసమే కదా నీ బెంగ నేను వెతికిస్తున్నాను అమ్మ తను దొరికేటప్పుడే దొరుకుతుంది అని అంటాడు.
అంబిక వీర్రాజుకి కాల్ చేసి ఊరు వస్తున్నా అని చెప్తుంది. వీర్రాజు పానకాలుతో ఇంత వరకు రూపాయి చేతిలో పెట్టలేదు కానీ అన్నీ చేయమని అంటుందని అంటాడు. విహారి ముందు బాటిల్ పగలగొట్టి నీ వల్లే నా జీవితం నాశనంఅయిపోయిందని అనుకుంటాడు. నాకేం గుర్తు లేదు లక్ష్మీని ఎలా నమ్మించాలి అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















