Jagadhatri Serial Today November 18th: జగద్ధాత్రి సీరియల్: సిరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నది ఎవరు? జేడీ, కేడీల ఎంట్రీతో అసలు రహస్యం బయటపడుతుందా?
Jagadhatri Serial Today Episode November 18th జేడీ, కేడీలు సిరిని తీసుకొని కొడైకెనాల్ వెళ్లి రిసార్ట్‌లో ఎంక్వైరీ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode సిరిని ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జగద్ధాత్రికి తెలుస్తుంది. దాంతో హనీమూన్‌లో ఏం జరిగిందో మొత్తం చెప్పమని అంటుంది. సిరి ఆ రోజు ఏం జరిగిందో చెప్తుంది. సిరి వాళ్లకి రూంలోకి తీసుకెళ్లిన బాయ్ బాత్‌రూం చెక్ చేస్తా అని వెళ్తాడు. అక్కడ ఏదో ఫిక్స్ చేసి అనుమానంగా చూడటంతో సిరి ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది.
సిరి, సిరి భర్త ఇద్దరూ అతన్ని అనుమానిస్తారు. ఆ విషయం సిరి అక్కకి చెప్తుంది. వాడే కాస్త ఓవర్ అనిపించింది కానీ ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదు అని చెప్తుంది. మొత్తం ఆలోచించి చెప్పు అని కేథార్ అడుగుతాడు. దాంతో సిరి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిందని చెప్తుంది. ఇద్దరూ మేనేజర్ దగ్గర తాళాలు తీసుకొని వెళ్లే సరికి ఆ గదిలో అప్పటికే వాళ్లని రూంలోకి తీసుకొచ్చిన బాయ్ అంటాడు. సిరి భర్త అతన్ని కొడతారు. మీరు లేనప్పుడే కదా మేం రూం క్లీన్ చేసేది అని అతను అనడంతో సిరి భర్త అతన్ని తీసుకొని వెళ్లి ప్రశ్నిస్తాడు. మేనేజర్ తానే కుమార్‌కి కీస్ ఇచ్చి పంపానని అంటాడు.
మొత్తం విన్న కేథార్, జగద్ధాత్రి అన్నింటికి ఆ కుమారే కారణం వాడి వెనక ఇంకేదో పెద్ద తలకాయ ఉందని అనుకుంటారు. అప్పుడే విషయం చెప్పుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదు అని జగద్ధాత్రి అంటుంది. ఇక రేఖ జగద్ధాత్రి వాళ్లతో పోలీసులకు చెప్తే ఆ బ్లాక్ మెయిల్ చేసేవాళ్లు వీడియో వైరల్ చేస్తాం అన్నారు.. అందుకే మీ నాన్న ఇంతవరకు మీకు విషయం చెప్పలేదు అన్నారు అంటే మీరు పోలీసులా అని అడుగుతుంది. జగద్ధాత్రి, కేథార్ షాక్ అవుతారు. వాళ్లేం పోలీసులు కాదు వీళ్లకి చెప్పినా పోలీసులకు తెలిసిపోతుంది అని అంటారు. మొత్తం మేం చూసుకుంటాం అని జగద్ధాత్రి, కేథార్ రిసార్ట్‌కి బయల్దేరుతుంది.
జేడీ, కేడీలు సిరిని తీసుకొని రిసార్ట్‌కి వెళ్తారు. సిరికి జేడీ స్కార్ఫ్ కడుతుంది. జేడీ, కేడీలు మేనేజర్ దగ్గరకు వెళ్లి రూం తీసుకుంటారు. జేడీ అక్కడ పని చేస్తున్న ప్రతీ ఒక్కర్ని చూపించి అతనేనా అని అడుగుతుంది. ఓ చోట కుమార్ ఫ్లోర్ క్లీన్ చేయడం సిరి చూసి ఆగిపోతుంది. జగద్ధాత్రి చూసి అతనేనా అని అడుగుతుంది. జేడీ, కేడీలు ఇద్దరూ అతని దగ్గరకు వెళ్తారు. కేథార్ కుమార్‌ని లాగిపెట్టి కొట్టి ఈడ్చుకొని వెళ్తాడు. మేనేజర్ వచ్చి అతను ఏం చేశాడు అని అంటే జేడీ గన్ చూపిస్తుంది. మేనేజర్ జేడీ, కేడీలు పోలీసులు అని తెలిసి షాక్ అయిపోతారు. ఏమైంది అని అడిగితే మా చెల్లి మరిది మీ రిసార్ట్‌కి వచ్చిన పాపానికి వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు కాజేస్తారా అని అంటుంది.
కుమార్, మేనేజర్‌ని ఓ చోటకు తీసుకెళ్లి సిరిని మాస్క్ తీయిస్తుంది. కుమార్ చూసి మాకేం తెలీదు మేడం అంటాడు. జేడీ కుమార్ ఫోన్ తీసుకొని చెక్ చేస్తుంది. కుమార్, శార్వానంద్ ఇద్దరి ఫోన్‌లు చెక్ చేసినా ఏం అనుమానంగా ఉండవు.. దాంతో జేడీ చివరి ప్రయత్నంగా ఒక రాయి వేద్దాం అని అనుకొని నిజం చెప్తారా ఊరి చివరకు తీసుకెళ్లి కాల్చేయాలా అని అంటుంది. మీరు చేయలేదు అని నమ్ముతున్నా.. కానీ ఇక్కడే ఎవరో ఇలా చేశారు.. మీ బ్యాచ్‌లో ఎవరైనా అలాంటి వాళ్లు ఉన్నారా అని అడుగుతారు. దాంతో కుమార్ గౌతం అనే ఒకతను ఉన్నాడని చాలా పేదవాడని కానీ ఈ మధ్య ఐఫోన్లు కొడుతున్నాడు.. లగ్జరీగా ఉంటున్నాడు.. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు అని అంటాడు. ఫోటో చూపిస్తారు. అతను డ్యూటీ దిగిపోవడంతో కుమార్‌ని తీసుకొని వెళ్తారు.
గౌతమ్ ఓ చోట తన లవర్‌తో మాట్లాడుతూ ఉంటే కుమార్ చూపిస్తాడు. గౌతమ్ కాలర్ పట్టుకొని జేడీ పోలీస్ స్టేషన్‌కి పదరా అంటుంది. సిరిని చూసి గౌతమ్ షాక్ అయిపోతాడు. జేడీ, కేడీలు ఇద్దరూ గౌతమ్‌ని చితక్కొడతారు. రిసార్ట్‌కి ఒక రోజు ఒకతను వచ్చాడని తనని కలిశాడని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















