Jagadhatri Serial Today November 11th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని కాపాడిన జేడీ, కేడీలు.. వైజయంతిని నిలదీసి కడిగేశారుగా!
Jagadhatri Serial Today Episode November 11th జేడీ, కేడీలు శ్రీవల్లిని కాపాడి ఇంటికి తీసుకెళ్లి వైజయంతిని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today November 11th Episode జేడీ, కేడీలు శ్రీవల్లిని ఉంచిన గెస్ట్‌హౌస్‌కి వస్తారు. మేనమామగా వచ్చిన వ్యక్తి శ్రీవల్లి గదిలోకి వెళ్లి శ్రీవల్లి నిన్ను చూడగానే నాకు నచ్చేశావ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా అని మీద మీదకు వెళ్లాడు. ఏం మాట్లాడుతున్నావ్.. నీ వయసు ఏంటి.. నా వయసు ఏంటి అని శ్రీవల్లి అంటే ఏమైంది ఇప్పుడు.. నా కంటే పెద్ద వాళ్లు రేపటి నుంచి నీ దగ్గరకు వస్తారు అని అంటాడు.
శ్రీవల్లి షాక్ అయిపోతుంది. నన్ను పెళ్లి చేసుకోవా అయితే ముందు ఫస్ట్ నైట్ అయితే తర్వాత నువ్వే పెళ్లి చేసుకుంటావ్ అని శ్రీవల్లి మీదకు వెళ్లాడు. కాపాడండి అని శ్రీవల్లి అరుస్తూ ఉంటుంది. ఇక జేడీ, కేడీలు గెస్ట్‌హౌస్‌లోకి వచ్చి తాము పోలీసులము అని చెప్పి చెక్ చేయాలి అని వెళ్తారు. వనజ శ్రీవల్లిని పోలీసులు చూస్తే మన బండారం బయట పడిపోతుందని కంగారు పడతారు. శ్రీవల్లి ఉన్న గది వైపు వెళ్లకుండా చూడమని అంటుంది.
జేడీ బయట వెతుకుతూ ఉంటే శ్రీవల్లి కాపాడండి కాపాడండి అని అరుస్తుంది. జేడీని కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. జేడీ, కేడీని పిలిచి విషయం చెప్తుంది. జేడీ, కేడీలు ఇద్దరూ తలుపు పగలగొట్టి శ్రీవల్లిని కాపాడతారు. కేడీ, జేడీలు ఇద్దరూ రౌడీలను చితక్కొడతారు. శ్రీవల్లిని వనజ సైలెంట్‌గా తీసుకెళ్లిపోతుంది. జేడీ శ్రీవల్లి లేకపోవడంతో కేథార్ జేడీని వెళ్లి శ్రీవల్లిని కాపాడమని చెప్తాడు.
జేడీ పరుగులు పెడుతుంది. వనజ శ్రీవల్లిని కారులో ఎక్కించి మేనమామ అన్న వ్యక్తి కోసం కారు ఆపితే అతను పరుగెడుతుండగా జేడీ కాలి మీద కాల్చేస్తుంది. అతను పోలీసులకు దొరికిపోతే ప్రమాదం అని వనజ తమ్ముడిని తీసుకెళ్లి శ్రీవల్లిని వదిలేస్తుంది. శ్రీవల్లి జేడీ, కేడీలతో తనని అమ్మేయాలని ప్రయత్నించారని చెప్తుంది. జేడీ, కేడీలు శ్రీవల్లిని తీసుకెళ్తారు.
వనజ ఇంకా కాల్ చేయలేదు అని వైజయంతి తెగ కంగారు పడుతుంది. ఇంతలో వనజ కాల్ చేసి జేడీ, కేడీ వచ్చారని శ్రీవల్లి తప్పించుకుందని అంటుంది. వైజయంతి షాక్ అయిపోతుంది. దీని వెనక తాను ఉన్నాను అని పోలీసులు కనిపెట్టేస్తే నా పని అయిపోతుందని వైజయంతి కంగారు పడుతుంది.
జగద్ధాత్రి, కేథార్‌లు శ్రీవల్లితో పాటు ఆశ్రమం గురువుగారిని తీసుకొస్తారు. వైజయంతిని పిలుస్తారు. వైజయంతి తనకు ఏం తెలీనట్లు నువ్వు వచ్చావేంటి శ్రీవల్లి మీ అమ్మ ఏది అని అడుగుతుంది. అది మీరే చెప్పాలి అత్తయ్య అని జగద్ధాత్రి అడుగుతుంది. వనజ నిజంగా శ్రీవల్లి తల్లా అని కోపంగా అడుగుతుంది. అవును అని వైజయంతి అంటుంది. వనజ ఎక్కడా అని వైజయంతి అడిగితే పోలీసులు పట్టుకోవాలి అని చూస్తే పారిపోయింది అని దాని తమ్ముడిగా వచ్చిన వాడు శ్రీవల్లి మీద అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు అని చెప్తుంది. ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు.
జగద్ధాత్రి విషయం మొత్తం చెప్పి అలాంటి దుర్మార్గురాలికా మీరు శ్రీవల్లిని అప్పగించారు అని అడుగుతుంది. నిన్ను అనవసరంగా నమ్మి సారీ కూడా చెప్పాను అని సుధాకర్ అంటాడు. ఆవిడే శ్రీవల్లి తల్లి అని వైజయంతి అంటే గురువుగారు అబద్ధం చెప్తున్నారు.. ఆ రోజు మీరే ఆశ్రమంలో శ్రీవల్లిని ఇచ్చారు.. శ్రీవల్లిని కన్న తల్లి మీరే అది నేను బలంగా నమ్ముతున్నా అని అంటారు. వనజ తల్లి అయితే వనజ ఫొటో ఎందుకు ఇవ్వలేదు అని నిషి అడిగితే వనజ తల్లి అని శ్రీవల్లి బ్యాగ్‌లో పెట్టింది నువ్వే కదా అని యువరాజ్ అంటాడు. నిషి వైజయంతి టెన్షన్ పరుగులు ఉరుకులు చూశానని చెప్తుంది. అందరూ వైజయంతిని నానా మాటలు అంటారు. కేథార్ పిన్నితో మీకు శ్రీవల్లి భారం అయితే చెప్పండి నేను చూసుకుంటాను కానీ తనని వదిలించుకోవడానికి పరాయివాళ్ల చేతిలో పెట్టకండి.. అసలే రోజులు బాలేవు అని అంటాడు. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే తల్లివి అని కూడా చూడను అని యువరాజ్ అంటాడు.
వనజే శ్రీవల్లి తల్లి అని వైజయంతి అంటుంది. అయితే మరి తను మా ఆశ్రమానికి వచ్చింది అని ఎలా చెప్పారు అని గురువుగారు అంటారు. శ్రీవల్లి కన్న తల్లి తనే తల్లి అయి ఇలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదు అని వైజయంతి అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని సుధాకర్ అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















