Nuvvunte Naa Jathaga Serial Today November 11th:నువ్వుంటే నా జతగా: ఒకే చోట మిథున, దేవా! మిథున మరో పెళ్లి చేసుకుంటుందా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode November 11th మిథునని తీసుకొని అలంకృత రెస్టారెంట్‌కి వెళ్లడం దేవా అక్కడే ఉండటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode లలిత మిథునకు సమస్య ఏంటి అని అడుగుతుంది. మిథున ఏం లేదు చెప్పినా లలిత నమ్మదు. నేను నీ తల్లినే నీ బాధ నాకు తెలుసు అని అంటుంది. దేవా కట్టిన తాళి కోసం పుట్టింటిని వదిలేసి వెళ్లిపోయావ్.. అలాంటి నువ్వు ఏ కారణం లేకుండా అతన్ని వదిలేసి వచ్చేశావు అని అంటే నేను నమ్మాలా అని అడుగుతుంది.
మిథున మనసులో నాన్నని అడ్డు పెట్టుకొని దేవా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు అని నీకు ఎలా చెప్పాలి అమ్మా అని అనుకుంటుంది. లలిత గుచ్చి గుచ్చి మిథునని అడుగుతూ ఉంటే హరివర్థన్ మిథునకు భోజనం తీసుకొని వచ్చి తనని ఏం అడగొద్దు అని చెప్పినా ఎందుకు అడుగుతున్నావ్ అని అంటాడు. తను ఆ జ్ఞాపకాల్లోంచి ఎంత త్వరగా బయటకు వస్తే తన భవిష్యత్ అంత బాగుంటుంది.. నువ్వు మళ్లీ తనని ఆ చేదు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లకు అంటాడు.
మిథనతో ఎప్పుడు తిన్నావో ఏంటో నేను తినిపిస్తాను అమ్మా అని మిథునని కూర్చొపెట్టి గోరు ముద్దలు కలిపి తినిపిస్తాడు. ఇక దేవా మిథునని తలచుకుంటూ ఏడుస్తాడు.
కాంతం ఫోన్‌లో డబ్బులు చూసుకొని మిథున ఇక లేదు అని చిందులేస్తుంది. శ్రీరంగం వస్తే ఈ హ్యాపీ మూమెంట్‌లో రీల్ చేద్దాం అని ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా అని డ్యాన్స్‌లు చేస్తారు. ఇక ఇంత సంతోషం ఎందుకు అని రంగం అడిగితే త్రిపురకు మేటర్ చెప్పి రెండు లక్షలు కొట్టేశాను అని చెప్తుంది. రంగం ఫోన్‌లో మెసేజ్ చూసి నోరెళ్లబెట్టి ఇది ఫేక్ మెసేజ్నే డబ్బులు వచ్చినట్లు మెసేజ్ వస్తుంది కానీ అకౌంట్‌లో డబ్బులు ఉండవు అని అంటాడు. కాంతం గుండె పగిలిపోతుంది. అకౌంట్‌లో చూసి ఏడుస్తుంది. త్రిపుర సంగతి చెప్తా అని అనుకుంటుంది.
శారద బాధగా ఉంటే ప్రమోదిని కూరగాయలు కట్ చేస్తూ కాంతాన్ని పిలిచి కూరగాయలు కట్ చేయమని అంటుంది. ఈ పనులు అన్నీ నాకు ఎప్పుడు తప్పుతాయో ఏంటో అని కాంతం తిట్టుకుంటూ కట్ చేస్తుంది. మిథున కావాలనే ఇంటి నుంచి వెళ్లిపోయింది.. తను పక్కా ప్లాన్ వేసుకుంది.. తను వాళ్ల నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిపోయిందని అంటుంది. శారద, ప్రమోదిని అరవడంతో ఇన్ని రోజులు వెళ్లనిది ఇప్పుడు ఎందుకు వెళ్లింది అని అంటుంది. చావు అయినా బతుకు అయినా ఇక్కడే అని చెప్పినామె ఇంత సడెన్‌గా వెళ్లిపోయింది అంటే అర్థం కాలేదా..చూస్తూ ఉండండి ఇంకో పెళ్లి చేసుకుంటుంది మిథున అని కాంతం అంటుంది.
వదినా అని దేవా అరుస్తూ ఎందుకు వదినా మిథునని అలా అంటారు అని అడుగుతాడు. ఎందుకు అలా లేనిది మాట్లాడినట్లు అలా ఫైర్ అయ్యావు కొంప తీసి నీకు తన మీద లవ్ ఉందా అని అడుగుతుంది. ఇంట్లో లేని మనిషి గురించి అలా మాట్లాడొద్దు అని అంటాడు.
మిథున బాధగా కూర్చొని ఉంటే అలంకృత రెస్టారెంట్‌కి వెళ్దాం అని పిలుస్తుంది. మిథున ఇంట్రస్ట్ లేదని చెప్తుంది. అలంకృత బతిమాలుతుంది. హరివర్థన్ వచ్చి వెళ్లమ్మా అని అంటాడు. నేను వెళ్లలేను అని మిథున అంటే అందరూ వెళ్లమని చెప్తారు. అందరూ వెళ్లమనడంతో మిథున సరే అంటుంది.
దేవా కూడా అదే రెస్టారెంట్‌కి వెళ్తాడు. మిథున, అలంకృత కూడా అక్కడికే వస్తారు. అలంకృత దేవాని చూసి మిథునకు చూపిస్తుంది. దేవా అని మిథున అని దేవా మాటలు గుర్తు చేసుకొని ఆగిపోతుంది. మీ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడానికే ఆ దేవుడు ఇలా ఒకే దగ్గరకు చేర్చినట్లు ఉన్నాడని అలంకృత అంటుంది. ఇక అలంకృత దేవా బావ అని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తున్నావ్ అని మిథున అంటుంది. అప్పుడే దేవా మిథునని చూస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















