Jagadhatri Serial Today November 10th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిని దుబాయ్ అమ్మేయనున్న వనజ! సొంత చెల్లిని కేథార్ కాపాడుకుంటాడా!
Jagadhatri Serial Today Episode November 10th శ్రీవల్లిని దుబాయ్‌లో అమ్మేయడానికి వనజ తీసుకొచ్చి ఓ గెస్ట్‌హౌస్‌లో ఉంచడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode శ్రీవల్లి తన కూతురు అంటూ వనజ ఇంటికి వస్తుంది. జగద్ధాత్రికి అనుమానం వచ్చి వైజయంతి, వనజ ఇద్దరులకు ఒకే సారి పుట్టిన రోజు అడుగుతారు. వనజ ఏప్రిల్ 3 అని చెప్తే వైజయంతి జనవరి 19 అని చెప్తుంది. అందరూ అనుమానంతో అడిగితే వనజ చెప్పిందే నిజమని వైజయంతి అంటుంది.
వనజ తాను కాశీలో ఉంటున్నానని కూతుర్ని తీసుకెళ్లిపోతా ఫ్లైట్‌కి టైం అయిందని అంటుంది. ఇక జగద్ధాత్రి అనుమానం వచ్చి కేథార్‌తో మీ అమ్మ ఫొటో నీ ఫోన్‌లో ఉంది కదా తీసుకురా అని అంటుంది. ఫోన్ చార్జింగ్ పెట్టానని కేథార్ వెళ్తాడు. ఇక వైజయంతి జగద్ధాత్రిని ఇక్కడే ఉండకూడదు అని కాఫీ తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది. ఇక వైజయంతి వనజకు సైగ చేయడంతో వనజ ఫ్లైట్‌కి టైం అయిపోయిందని హడావుడి చేసి శ్రీవల్లని తీసుకెళ్తా అంటుంది. ఇక వైజయంతి కూడా హడావుడి చేసి శ్రీవల్లిని పంపేస్తుంది.
కేథార్, జగద్ధాత్రి వచ్చే టైంకి శ్రీవల్లి వెళ్లిపోయిటుంది. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ పరుగులు తీస్తారు. ఇద్దరూ బయటకు వచ్చే సరికి శ్రీవల్లిని తీసుకొని వనజ వాళ్లు వెళ్లిపోతారు. జగద్ధాత్రి తనకు ఇంకా డౌట్ వస్తుందని కేథార్‌కి చెప్పి పరుగులు తీస్తారు. సుధాకర్ భార్యతో నిజం ఇదన్నమాట సారీ అని చెప్తాడు. యువరాజ్ కూడా మనసులో అమ్మని అనవసరంగా అపార్థం చేసుకున్నా అని అనుకుంటాడు. ఇక నిషిక కూడా మనసులో అనవసరంగా నానామాటలు అన్నాను అని అనుకుంటుంది.
వైజయంతి కంగారుగా తిరుగుతుంది. అది చూసిన నిషిక ఏదో జరుగుతుందని అనుకుంటుంది. వైజయంతి వనజకు కాల్ చేస్తే వనజ శ్రీవల్లికి అనుమానం రాకుండా విజయ అంటూ మాట్లాడుతుంది. జగద్ధాత్రికి అనుమానం వచ్చిందని తనకు జేడీ, కేడీ అనే పోలీసులు తెలుసని వాళ్లకి చెప్తే మన పని అయిపోతుంది త్వరగా దాన్ని దేశం దాటించే కానీ దాన్ని క్షేమంగా చూసుకో నేను అవసరం అయినంత డబ్బు ఇస్తా అది నాకు బిడ్డ కాకపోయినా బిడ్డ లాంటిదే.. ఇక్కడ అంతా సెట్ అయిన తర్వాత చెప్తా తనని తీసుకొచ్చి మంచి ప్లేస్‌లో వదిలేయ్ అని వైజయంతి చెప్తుంది.
జేడీ, కేడీలు రంగంలోకి దిగుతారు. రమ్యకి కాల్ చేసి కాశీకి ఫ్లైట్స్ ఉన్నాయా అని అడుగుతుంది. రమ్య చెక్ చేసి రాత్రి 11 వరకు ఏం లేవని చెప్తుంది. జేడీకి అనుమానం వచ్చి ఆశ్రమానికి కూడా కాల్ చేస్తుంది. వనజ ఆశ్రమానికి వచ్చిందా అని అడిగితే లేదు అని గురువుగారు చెప్తారు. శ్రీవల్లి ఆవిడ కూతురు కాదు కదా మీ దగ్గరకు ఎలా వస్తుంది అని అంటారు. జేడీ కేడీతో డౌటే లేదు వాళ్లు శ్రీవల్లికి చెందిన వాళ్లు కాదు.. వాళ్లని వెంటనే ఆపాలి.. లేదంటే శ్రీవల్లి మనకు దక్కదు అని కేథార్ అంటాడు.
జగద్ధాత్రి కారు నెంబరు గుర్తు చేసుకొని రమ్యకి కాల్ చేసి కారు ట్రేస్ చేసి డిటైల్స్ చెప్పమని అంటుంది. రమ్య డిలైల్స్ చెప్తుంది. లొకేషన్ షేర్ చేస్తుంది. వనజ దారిలో కారు ఆపి ఆమెతో పాటు వచ్చిన వ్యక్తితో వైజయంతి మనకు జాగ్రత్తలు చెప్తుందిరా.. కానీ మనం దీన్ని 30 లక్షలకు దుబాయ్‌కి అమ్మేస్తున్నాం కదా అని అంటుంది. వనజ వాళ్లు శ్రీవల్లిని ఓ గెస్ట్ హౌస్‌కి తీసుకొస్తుంది. శ్రీవల్లికి డౌట్ వచ్చి అన్నయ్యావదినతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వండి అని అంటుంది. లోపలికి వెళ్లి మాట్లాడుదాం ఫ్లైట్ లేటు ఉందని వనజ చెప్పి శ్రీవల్లిని తీసుకెళ్తుంది. వనజ మామలా నటించిన వ్యక్తి కారు డ్రైవర్‌తో కారు తిప్పుతూ ఉండు పోలీసులు అడిగితే నాది క్యాబ్ అని చెప్పు అంటాడు.
జేడీ, కేడీలకు విషయం తెలియక కారుని ఫాలో అవుతూ ఉంటారు. జేడీ దూరం నుంచి చూసి కారులో ఎవరూ లేరు.. మనల్ని డైవర్ట్ చేయాలని ఇలా చేశారు.. ఈ లోపు శ్రీవల్లిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తున్నారేమో అని అంటుంది. జేడీ రమ్యకి కాల్ చేసి ఒక్క నిమిషం కారు ఆగింది అని చెప్పావు కదా ఆ లొకేషన్ చెప్పు అని అంటుంది.
వనజ వాళ్లు శ్రీవల్లిని ఓ గదిలో ఉంచుతారు. శ్రీవల్లి చాలా భయపడుతుంది. తర్వాత వనజ వాళ్లు రౌడీలతో జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఇక వనజ శ్రీవల్లిని నమ్మించాలని శ్రీవల్లితో మాట్లాడటానికి వెళ్తుంది. శ్రీవల్లి ఫోన్ అడిగితే వనజ ఇవ్వదు. మీరు అబద్ధం చెప్తున్నారు..ఏదో జరుగుతుంది అని అంటుంది. శ్రీవల్లి బతిమాలితే వనజ శ్రీవల్లి మీద అరుస్తుంది. ఇక మేనమామ అంటూ వచ్చిన వ్యక్తి శ్రీవల్లిని పట్టుకుంటూ మీద మీదకు వెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















