Nindu Manasulu Serial Today November 10th:నిండు మనసులు: సాహితి కిడ్నాప్ కేసులో ట్విస్ట్! అసలు కిడ్నాపర్ గణనే! సిద్ధూ, ప్రేరణ ఏం చేస్తారు!
Nindu Manasulu Serial Today Episode November 10th సిద్ధూ వాళ్లకి కిడ్నాపర్లు కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ప్రేరణ చెప్పిన పోలికలతో పరాంకుశం బొమ్మ గీస్తాడు. ప్రేరణ అది చూసి అతనే అని చెప్తుంది. అందరూ కంగారు పడతారు. విజయానంద్ గణతో వాడు ఎవడో తెలిసింది కదా ఇంక ఫోర్స్‌ని పంపి వెతికించు అని అంటాడు. సిద్ధూ అలా చేస్తే ప్రమాదం అని వాడి డ్రాయింగ్ గీసి వెతికిస్తున్నాం అని తెలిస్తే అలర్ట్ అయిపోతాడు. అది సాహితికే ప్రమాదం ఏం చేసినా సీక్రెట్‌గా చేయాలి అంటాడు.
గణ సిద్ధూ చెప్పింది కరెక్ట్ అని కిడ్నాపర్లలో ఒకడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చూసుకుంటా అని అంటాడు. సీన్ కట్ చేస్తే గణ కిడ్నాపర్లు దగ్గరకు వెళ్తాడు. కిడ్నాపర్‌ని తన దగ్గర ఉన్న ఫోటోని చూసి అతన్ని లాగి పెట్టి కొడతాడు. ఎందుకు అని ఆయన అడిగితే నేనేం చెప్పాను నువ్వు ఏం చేశావ్ అని తిడతాడు. మీరు చెప్పినట్లే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాం కదా సార్ అని అంటాడు. నీ ముఖం చూపించేశావురా అని గణ ప్రేరణ చూసిన విషయం చెప్తాడు. ఒక్క సెకన్ నా ముఖం చూసి నా బొమ్మ అంత కరెక్ట్‌గా ఎలా గీయించింది సార్ తను గ్రేట్ అంటాడు. సాహితి కిడ్నాప్ వెనక నువ్వు ఉన్నావ్ అని నీ వెనక నేను ఉన్నాను అని తెలీకూడదు.. రేపు నేను వచ్చి సాహితిని తీసుకెళ్తా.. నిన్ను పట్టుకుంటా నేను సైగ చేసినప్పుడు పారిపో అంత వరకు విజయానంద్‌కి ఫోన్ చేసి కోటి రూపాయలు అడుగు అని అంటాడు. విజయానంద్ వణికిపోవాలని అంటాడు.
ఇందిర, ఐశ్వర్యలకు ప్రేరణ సాహితి కిడ్నాప్ గురించి చెప్తుంది. ప్రేరణ సుధాకర్‌ని పిలిపిస్తుంది. సుధా రాగానే కిడ్నాపర్ ఫొటో చూపిస్తుంది. వాడు పరమరాక్షసుడు అమ్మా అని వాడి గురించి చెప్పి వాడి మీద లేని కేసు అంటూ లేదమ్మా అని సుధా చెప్తాడు. మనం బలంగా ప్రయత్నించాలి అని ప్రేరణ అంటే ఆ గణ డీల్ చేస్తున్న కేసు అమ్మా ఇది మనం ఉన్నామని తెలిస్తే ఉంచడు అంటాడు. లేదు మామయ్య మనం ప్రయత్నించాలి అని ప్రేరణ చెప్తుంది. సుధాకర్ ఆ రౌడీ గురించి తెలిసి కొంత మందికి వాడి గురించి అడిగి తెలుసుకుంటా అని అంటాడు.
ప్రేరణ సిద్ధూకి కాల్ చేసి విషయం చెప్తుంది. ఇంతలో విజయానంద్ ఫోన్‌కి కిడ్నాపర్ కాల్ చేస్తాడు. విజయానంద్‌కి కాల్ చేసి డబ్బు అడుగుతాడు. కోటి కాదు రెండు కోట్లు అయినా ఇస్తాం.. అని అంటాడు. సిద్ధూ ఫోన్ లాక్కొని నువ్వు అడిగినంతా డబ్బు నీకు ఇస్తాం కానీ నా చెల్లి ఎలా ఉందో మాకు తెలియాలి.. ఇప్పుడే వీడియో కాల్ చేయమని అంటాడు. గణ సిద్ధూతో వాళ్లని రెచ్చగొట్టేస్తున్నావ్ ఎందుకు అని అంటాడు. వాళ్లు సంఘసేవకులు కాదు కర్కోటకులు వాళ్లు నా చెల్లి ఎలా ఉందో నేను తెలుసుకోవాలి అంటాడు.
గణ విజయానంద్‌తో ఏంటి సార్ ఇలా చేస్తున్నారు. డిమాండ్ చేసే పరిస్థితిలో మనం ఉన్నామా అని అంటాడు. విజయానంద్ సిద్ధూతో ఆవేశపడకు అని అంటాడు. నేను ఆవేశ పడటం లేదు మీరు డబ్బు ఇస్తా అని తొందర పడుతున్నారు. ఒక సారి మనం సాహితి ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవాలి.. వాళ్లు అడిగిన డబ్బు మనం ఇచ్చే వరకు వాళ్లు మన కంట్రోల్‌లోనే ఉంటారు అని అంటాడు.
రౌడీలు వీడియో కాల్ చేస్తారు. సాహితి తనని కాపాడమని ఏడుస్తుంది. సిద్ధూ సాహితి వెనక ఉన్న సత్యంబాబు వైన్స్ అని పేరు చూస్తాడు. రౌడీలు కాల్ చేసి మేం అడిగిన డబ్బు ఇవ్వకపోయినా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా నీ కూతుర్ని చంపేస్తా అని అంటాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఏరియాలో కిడ్నాపర్లు ఉన్నట్లు సిగ్నల్ వచ్చిందని పోలీసులు చెప్తారు. గణ మొత్తం చూసుకుంటా అని డబ్బు అవసరం లేదు అని అంటాడు. డబ్బు ఇవ్వకపోవడం ఏంటి నిన్ను నమ్మి మా చెల్లిని వదిలేయాలా అని సిద్ధూ అంటాడు. నువ్వేం మాట్లాడకు ప్రమాదంలో ఉంది నా కూతురు అని అంటాడు. తను నీకు కూతురే కాదు నాకు చెల్లి కూడా నేను ఎవరినీ నమ్మను..నా చెల్లిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు..ఆ వీడియో నాకు ఫార్వర్డ్ చేయ్ అని సిద్ధూ వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















