Chinni Serial Today November 10th: చిన్ని సీరియల్: లోహిత గురించి నిజం తెలుసుకున్న మధు! రివర్స్ అయిపోయిన లోహిత!
Chinni Serial Today Episode November 10th లోహిత ఫేక్ పేరెంట్స్‌ని తెచ్చిందని లోహిత ధనవంతురాలు కాదని మధుకి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode వరుణ్, లోహితల నల్లపూసల తంతు పూర్తయిపోతుంది. లోహిత తల్లిదండ్రులుగా వచ్చిన వారు నల్లపూసలు వేసేశారు కాదా ఇక ఫోటోలు తీసుకుందాం అని అంటారు. వాళ్ల ప్రవర్తన మీద మధుకి అనుమానం వస్తుంది. లోహిత వాళ్లు పంతులుకి తాంబూలం ఇచ్చిన తర్వాత మ్యాడీ ఫోటోలు తీసుకుందాం అని అంటాడు.
లోహిత తల్లిదండ్రులుగా వచ్చిన వారు తమకు ఫుల్ పేమెంట్ ఇస్తేనే ఫోటోలు అంటారు. అదేంటి అని అందరూ నోరెళ్లపెడితే అబ్బాయి తరుపు వాళ్లు మాకు డబ్బు ఇవ్వాలి అది మా ఆచారం అని కవర్ చేస్తారు. దాంతో మ్యాడీ డబ్బు తీసి ఇవ్వబోతే మొత్తం లాగేసుకుంటారు. అందరూ షాక్ అయిపోతారు. తర్వాత సెల్ఫీలు తీసుకుంటారు. మధు మ్యాడీ భుజానికి తన భుజం టచ్ చేస్తూ మురిసిపోతుంది.
మధు పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని మాట్లాడుతుంటే మ్యాడీ పెళ్లి కూతురు బొమ్మ పట్టుకొని మాట్లాడుతాడు. మహి మీ డాడీ నీతో ఏం మాట్లాడుతాడో అని మధు అనుకుంటే డాడీని ఒప్పించాలి అని మ్యాడీ అనుకుంటాడు. లోహిత, వరుణ్‌ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతికి మా ఇంటికి కోడలిగా చేస్తా చిన్ని అని మ్యాడీ అనుకుంటాడు. నువ్వు కలవగానే నీకు మంచి ఫ్రెండ్ మధుని పరిచయం చేస్తా నీకు మధు చాలా బాగా నచ్చుతుంది అని అనుకుంటాడు.
మ్యాడీ పెళ్లి కూతురు బొమ్మ కింద పడిపోతుంటే మధు పట్టుకుంటుంది. మహి మధుకి థ్యాంక్స్ చెప్తాడు. బొమ్మ గురించి అంత కంగారు ఎందుకు అని మధు అడిగితే ఇది బొమ్మ కాదు నా హార్ట్ ఇది బ్రేక్ అయితే నా గుండె బ్రేక్ అయిపోతుంది అని మ్యాడీ అంటాడు. దాంతో మధు చాలా హ్యాపీగా ఫీలవుతుంది.. నీ హార్ట్ బ్రేక్ అవ్వకుండా నేను చూసుకుంటా అని చెప్తుంది. అదేంటి అని మ్యాడీ అంటే ఎప్పుడు బొమ్మ పడిపోయినా నేను పట్టుకుంటా అని కవర్ చేస్తుంది.
లోహిత తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్లు డబ్బు ఎక్కువ ఇవ్వమని లోహితను అడుగుతారు. మీద లో బడ్జెట్ సినిమా అనుకున్నాం కానీ పాన్ ఇండియా సినిమా కాబట్టి రెమ్యునరేషన్ పెంచమని ఇద్దరికీ తలో 50 వేలు ఇవ్వమని అంటారు. లోహిత నోరెళ్ల బెడుతుంది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అందర్ని పిలిచి గోల చేస్తాం అని లోహితను బెదిరిస్తారు.
లోహితను వెతుక్కుంటూ మధు బయటకు వస్తుంది. లోహిత వాళ్లని బతిమాలుతుంది. ఆ సీన్ మధు చాటుగా మొత్తం చూస్తుంది. ఇద్దరూ లోహితను బెదిరించి బంగారం గాజులు ఇవ్వమని అడుగుతారు. లోహిత గాజులు ఇవ్వడం మధు చూస్తుంది. మధు లోహిత దగ్గరకు వచ్చి అద్దె పేరెంట్స్ వెళ్లిపోయారా అంటుంది. వాళ్లు నా సొంత పేరెంట్స్ అని లోహిత అంటే కాదు నీ ఫ్రెండ్ నాకు నిజం చెప్పింది అని మధు ఆమెని పిలుస్తుంది.
లోహిత షాక్ అయిపోతుంది. వచ్చిన వాళ్లు నీ పేరెంట్స్ కాదనే కాదు నువ్వు చెప్పినట్లు మీది రిచ్ ఫ్యామిలీ కాదని.. బిజినెస్‌లు లేదని.. నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉంటారు అనే మీ అమ్మా అన్నలు అసలు ఎయిర్ పోర్ట్ ముఖమే చూడలేదు అని అన్నీ చెప్పేసింది అని మధు అంటే లోహిత షాక్ అయిపోతుంది. నన్ను నాలుగు పీకితే చెప్పానని లోహిత ఫ్రెండ్ అంటుంది. వాళ్లు నా అద్దె పేరెంట్స్ మేం రిచ్ కాదు అయితే ఏంటి.. ఇదంతా నేను వరుణ్‌కి చెప్పాలి అనుకునేలోపు నువ్వు మాకు పెళ్లి చేశావ్.. నీ వల్లే మా పేరెంట్స్ ఎవరో అని మేం చెప్పుకోలేకపోయాం.. నువ్వు నీ ఇష్టానికి ఇలా మాకు పెళ్లి చేయడం వల్లే ఇదంతా అని లోహిత మధు మీద తోసేస్తుంది. నువ్వు అలా చేయడం వల్లే నేను ఇలా చేశాను అని లోహిత అంటుంది.
వరుణ్ ఎంత బాధ పడతాడో ఒక్కసారి అయినా ఆలోచించావా.. మ్యాడీ ఎలా అనుకుంటాడో ఆలోచించావా అని లోహితని మధు అడిగితే అది నా తలనొప్పి నేను చూసుకుంటా.. నేనేమీ నీకు పెళ్లి చేయమనలేదు.. మీ ఇంటికి తీసుకురమ్మనలేదు.. దొంగ చాటుగా పెళ్లి చేసినందుకు మీ ఇంట్లో తల దాచుకునేలా చేశావ్ నీకు చేతనైతే నువ్వు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి మా ముగ్గురిని ఆ ఇంటికి పంపేలా చూడు.. లేదంటే మూసుకొని ఉండు.. నా గురించి ఈ విషయం వాళ్లకి చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలీదు అని అంటుంది. లోహిత ఇలా అంటుందేంటి అని మధు అనుకుంటుంది.
దేవేంద్ర వర్మ బాలరాజు, ఆఫ్ టికెట్‌ల దగ్గరకు వెళ్తాడు. చిన్ని గురించి అడుగుతాడు. ఇద్దరూ చెప్పమని అంటారు. దేవా బాలరాజు జుట్టు పట్టుకొని చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాం.. కలిసి తిరిగాం.. కలిసే సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు ఎందుకురా ఇలా తయారయ్యావ్.. నువ్వు ఎప్పటిలా ఉండుంటే ఇద్దరం సంతోషంగా ఉండేవాళ్లం కదా.. ఎందుకురా ఇలా శత్రువులా మారావ్ అంటాడు. నా భార్య జోలికి వచ్చినందుకు నువ్వు నాకు శత్రువులా మారావ్,, నా బిడ్డ జోలికి వచ్చినందుకే నువ్వు నాకు శత్రువులా మారావ్,, అని అంటాడు బాలరాజు దాంతో దేవా బాలరాజుని కొడతాడు. ఆఫ్ టికెట్ చాలా డేంజర్ అని వాడి ప్లేస్ మార్చేయండి అని దేవా రౌడీలకు చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















