అన్వేషించండి

Brahmamudi Serial Today November 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్: క్షమాపణ కోరిన రాహుల్‌ - ఎవరం నమ్మలేమ్మన్న దుగ్గిరాల ఫ్యామిలీ  

Brahmamudi serial today episode November 10th: స్టేషన్‌ నుంచి ఇంటికి వచ్చిన రాహుల్‌ అందరినీ క్షమించమని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  జైళ్లో ఉన్న రాహల్‌ దగ్గరకు రుద్రాణి, స్వప్న వెళ్తారు. వాళ్లిద్దరిని చూసిన రాహుల్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. స్వప్న కోపంగా చూస్తుంది.

రాహుల్‌: నేను ఏ తప్పు చేయలేదు స్వప్న. నాకే పాపం తెలియదు నన్ను నమ్ము స్వప్న

స్వప్న:  ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. మగాణ్ని అనే మత్తులో మనిషిని అనే విషయం కూడా మర్చిపోయావు. కట్టుకున్నది చెప్పే మంచిని కూడా వదిలేసి అబద్దాలతో ఆకలి తీర్చుకునే మీ అమ్మ మాటలే నమ్మావు.. మీ అమ్మ మాట మీదే నడుస్తూ.. అబద్దం మీదే తడుస్తూ.. అదే ఆనందం అని నువ్వు బతికావు. ఇప్పుడు ఏమైంది. జైళ్లో కూర్చుని చిప్ప కూడు తినాల్సి వచ్చింది.

రుద్రాణి: స్వప్న నువ్వు ఇక్కడకు వచ్చింది.. నువ్వు వాణ్ని ఓదార్చడానికా..? లేక తిట్టడానికా..?

స్వప్న: నువ్వు ఉన్నంత కాలం.. నీ కొడుకు నీ మాట విన్నంత కాలం.. ఒకరు అవమానించాల్సిన పని లేదు. నీ కొడుకే అవమానాన్ని వెతుక్కుంటూ అగాథంలో పడిపోతాడు. దానికి నిదర్శనమే ఈ జైలు గోడలు ఇంకా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు

రాహుల్‌: నువ్వు చెప్పింది అక్షర సత్యం స్వప్న. నేను ఎన్నో తప్పులు చేశాను. నిన్ను ఎంతగానో బాధపెట్టాను. కానీ నేను హత్య చేయలేదని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మితే చాలు స్వప్న

స్వప్న: ఎలా నమ్మమంటావు.. తాళి కట్టిన భార్యతోనే నేను పలానా దాన్ని ప్రేమించాను. దానితోనే డబ్బుందని.. ఇక దాంతోనే ఉంటాను.. దాని ఇంట్లోనే ఉంటాను అని చెప్పిన గొప్ప మనిషివి నువ్వు

రాహుల్‌: అలా అనకు స్వప్న నేను నీకు చెప్పింది నిజమే తన దగ్గర డబ్బు ఉందని ఆ డబ్బు నాకు సొంతం కావాలని వెళ్లింది కూడా నిజమే కానీ నేను ఏమీ ఆ అమ్మాయిని ఇష్ట పడలేదు స్వప్న నాకు ఆ ఆలోచన కూడా లేదు. అలాంటిది తనని చంపాలని నేను ఎందుకు అనుకుంటాను దాని వల్ల నాశనం అయ్యేది నా జీవితమే కదా ఒక్కసారి ఆలోచించు. స్వప్న ఇంట్లో మామయ్యలకు రాజ్‌ కు చెప్పి ఎలాగైనా నన్ను కాపాడు స్వప్న.. ఫ్లీజ్‌ నీకు దండం పెడతాను స్వప్న..

స్వప్న: ఇన్నాళ్లు నేను నమ్మితేనే కదా మోసం చేశావు.. అయినా జీవితం పంచుకున్న దాన్ని కదా..? మళ్లీ నిన్ను నమ్మి ఏదైనా ప్రయత్నం చేయాలన్నా అబద్దానికి చిరునామా లాంటి అయిన నిన్ను ఇక్కడ, అక్కడ ఎవ్వరూ నమ్మరు

రుద్రాణి: కోపంగా నువ్వేం చేయోద్దు నోరు మూసుకుని ఉండు.. ఓరేయ్‌ రాహుల్‌  నువ్వు దేనికీ తల వంచోద్దురా..? ఎవ్వరికీ భయపడనక్కర్లేదు.. నీకు నేనున్నాను ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నిన్ను నేను బయటికి తీసుకొస్తాను..

స్వప్న: చూశావా ఇది మీ అమ్మ మానసిక స్థితి.. ఇక మీరు మారరు.. జీవితాలు నాశనం అయినా..? బతుకులు బూడిద అయినా మీరు మాత్రం మారరు. ఇప్పుడు అది కూడా చాలదు అన్నట్టు కొడుకును తప్పుడు మార్గంలో విడిపించాలని చూస్తున్నారు

రుద్రాణి: నేను తప్పుకుంటే.. వాడు జైళ్లో ఉండటం కాదు.. నువ్వు కూడా రోడ్డు మీద ఉంటావు.. భర్త లేని ఆడదానిగా బజారున పడతావు.. అందుకే నేను కొడుకును అడ్డదారిలో వెళ్లైనా సరే కాపాడుకోవాలి అనుకుంటున్నాను.. నీకు చేతనైతే రహదారిలో వెళ్లి కాపాడుకో

అంటూ రంజిత్‌ ఫోన్‌ చేసి మాట్లాడుకుంటూ బయటకు వెళ్లిపోతుంది రుద్రాణి. మరోవైపు సీసీటీవీ పుటేజీ కోసం కూయిలీ ఇంటికి వెళ్లిన రాజ్‌, కావ్య అతి కష్టం మీద వీడియో సంపాదిస్తారు. ఆ వీడియో తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరుతారు. మధ్యలో రంజిత్‌, రుద్రాణితో బేరాలు ఆడుతుంటే చూసి రంజిత్‌ ను పట్టుకుని స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు వీడియో చూపిస్తారు. వెంటనే పోలీసులు రంజిత్‌ను అరెస్ట్‌ చేసి రాహుల్ ను విడిచిపెడతారు. ఇంటికి వచ్చిన రాహుల్‌ను అందరూ తిడుతుంటే తనను క్షమించమని ఎమోషనల్‌ అవుతూ రిక్వెస్ట్‌ చేస్తాడు రాహుల్‌. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
Karthika Deepam 2 Serial Today August 7th: కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
కార్తీకదీపం 2 సీరియల్: ఆస్తి కోసం జ్యోత్స్నకి పారు బ్లాక్‌మెయిల్! జ్యోత్స్నని రిజెక్ట్ చేసిన సూరజ్! దిమ్మతిరిగే ట్విస్ట్‌లు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 7th:మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
నువ్వులేక నేను లేను: మందుతాగి వచ్చి అందరి ముందు రచ్చచేసిన ప్రియా...సుందరి నకిలి చిట్టీ అంటూ గొడవ
Podarillu Serial Today August 7th: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ
పొదరిల్లు: మాధవ్‌ను వెతికి ఇంటికి తీసుకొచ్చిన చక్రి....పెద్దకొడుకు చెంపపగులగొట్టిన నారాయణ

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
Embed widget