Jagadhatri Serial Today July 25th: జగద్ధాత్రి సీరియల్: జగద్ధాత్రి మాస్టర్ ప్లాన్.. ఆదిలక్ష్మిని నమ్మించి తికమక పెట్టేసిందిగా.. సురేష్‌ను రక్షిస్తుందా?
Jagadhatri Serial Today Episode July 25th జగద్ధాత్రి, కేథార్‌లు సురేశ్‌ని రాజు మర్డర్ కేసు గురించి అడగటం, ఆదిలక్ష్మీ బాబు విషయంలో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి ఆదిలక్ష్మీని హాల్‌లో కూర్చొపెడుతుంది. సురేశ్ రావడం చూసిన జగద్ధాత్రి, కేథార్‌లు రాజు మర్డర్ కేసు గురించి అడగాలని సురేశ్ కూడా వర్క్ ఉందని రాత్రంతా ఇంటికి రాలేదని అనుకుంటారు. ఇక బాబు ఏడుస్తుంటే కౌషికి బాబు దగ్గరకు వెళ్తుంటుంది. దాంతో ఆదిలక్ష్మీ కౌషికి ఆపి నువ్వు బాబు దగ్గరకు వెళ్లడానికి వీల్లేదని చెప్తుంది.
సురేశ్ వెళ్లాలని అనుకొని తల్లి మాటలు విని ఆగిపోతాడు. దాంతో కేథార్ నువ్వు ఉండు అక్క నేను వెళ్తాను అని చెప్పి సురేశ్‌కి వెళ్లమని సైగ చేస్తాడు. ఆదిలక్ష్మీకి బిందె అడ్డు ఉండటంతో సురేశ్ వెళ్లినట్లు ఆదిలక్ష్మీకి తెలీదు. ఆదిలక్ష్మీని మోసం చేస్తున్నారని నిజం చెప్దామని యువరాజ్ అంటే నిజం చెప్పడం కాదు ముందు ఆ బిందే తీసే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని వైజయంతి అంటుంది. ఇంతలో ఒకతను వచ్చి బర్త్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు కదా డౌట్స్ వచ్చాయని అంటాడు. ఆదిలక్ష్మీ విని ఆ బాబు కౌషికి కొడుకు కాదని అంటుంది. సర్టిఫికేట్ ఇచ్చే అతన్ని ఆదిలక్ష్మీ పంపేస్తుంది. కౌషికి చాలా బాధ పడుతుంది. కన్నీరు పెట్టుకుంటుంది. నిషిక వాళ్లు నవ్వుకుంటారు.
జగద్ధాత్రి కౌషికి దగ్గరకు వెళ్తే కౌషికి ఏడిస్తూ ఒక్కసారి అతను ఆఫీస్‌లో ఈ విషయం చెప్తే బాబు నా కొడుకు అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి అంటుంది. జగద్ధాత్రి ఆ సర్టిఫికేట్ వచ్చేలా తాను చేస్తానని చెప్పి కేథార్‌కి ఏదో చెప్తుంది. కేథార్ నేను చూసుకుంటా అని చెప్పి వెళ్తాడు. జగద్ధాత్రి బయటకు వెళ్లి బాబుకి సర్టిఫికేట్ కావాలి అంటుంది. లోపల ఆ బాబు కాదని అన్నారు కదా అంటే అది వేరే బాబు కోసం మేం ఆ బాబుని చూపిస్తాం అని జగద్ధాత్రి అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆదిలక్ష్మీకి అతను వచ్చినట్లు తెలియాలని నిషిక చెప్తుంది. జగద్ధాత్రి ఆదిలక్ష్మీతో బాబు మనబాబు కాదని చెప్పడానికి వేరే ఇలా ఫాం నింపాలని అంటుంది. ఆదిలక్ష్మీకి మనవడు కాదని అసలు మనవడు లేదని అంటుంది. మనవడు కాని ఆ మనవడని చూపించాలని సర్టిఫికేట్ చేసే అతను అడిగితే బూచిని పిల్లాడి గెటప్ వేసి తీసుకొస్తారు.
బూచిని చూసి నిషిక వాళ్లు షాక్ అయిపోతారు. సుధాకర్ నవ్వుతాడు. ఆదిలక్ష్మీ సర్టిఫికేట్ వద్దు అని చెప్పిన మనవడు బూచినే అని అందరూ చూపిస్తారు. ఇతనికి ఈ వయసులో సర్టిఫికేట్ ఇవ్వొద్దని చెప్పడమే కాదు ఇవ్వరు కూడా అని అంటాడు. మొత్తానికి సర్టిఫికేట్ ఇచ్చే అతన్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. పోయి పోయి వీళ్లు నాకే తగలాల అని అతను పారిపోతాడు. సురేశ్ జగద్ధాత్రితో మా అమ్మని భలే మాయ చేశావ్ బాబుకి సర్టిఫికేట్ ఇచ్చారని అంటాడు.
నిషిక ఆదిలక్ష్మీతో విషయం చెప్తుంది. సర్టిఫికేట్ అప్లే చేశారా అని కోప్పడుతుంది. ఇక జగద్ధాత్రి సురేశ్‌కి రాజు గురించి అడుగుతుంది. రాజుని కలిశారా అంటే లేదు అని సురేశ్ అంటాడు. రాజుని ఎవరో మర్డర్ చేశారు లాస్ట్ కాల్ మీదే అని అంటారు. మీరు ఎందుకు కలవాలి అనుకున్నారు అని అడిగితే వీడు మా కొడుకే కదా మరి రిపోర్ట్స్ ఎలా మారిపోయావా అని అడుగుదామని కలవాలి అనుకున్నానని అంటాడు. రాజుని కలవాలని వెళ్లా ఎంత సేపటికి రాలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని అంటాడు. నన్ను అరెస్ట్ చేస్తారా అని సురేశ్ అడిగితే దానికి కౌషికి లేదు జగద్ధాత్రి వాళ్లు ఒకరోజు గడువు అడిగారు ఈ లోపు జేడీ కేడీలు కేసు తేల్చేస్తామని అన్నారని చెప్తుంది.
మరోవైపు యువరాజ్ ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఆదిలక్ష్మీ బిందె తీయడానికి ప్రయత్నిస్తాడు. జగద్ధాత్రి వాళ్లు చూసి షాక్ అయిపోతారు. అతను ఆదిలక్ష్మీ బిందె తీసేస్తారు. ఆదిలక్ష్మీ సురేశ్‌ని పిలిచి సర్టిఫికేట్ కోసం సంతకం పెట్టావా అంటుంది లేదని సురేశ్ చెప్తాడు. మీరు నన్ను మోసం చేశారు అని ఆదిలక్ష్మీ అంటే జగద్ధాత్రి ఆ బాబు ఈ బాబు అంటూ మళ్లీ అదిలక్ష్మీని తికమక పెట్టేసి మీరు తెలివైన వారు మీకు ఎవరూ మాయచేయలేరు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















