Jagadhatri Serial Today JULY 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్
Jagadhatri Serial Today Episode July 15th:తండ్రి ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లుపట్టుకున్న శ్రీవల్లి...నిజం చెప్పమని ఒట్టేయించుకున్న సుధాకర్

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది.తల్లిగా వైజయంతి అమ్మ దగ్గరకు తీసుకోవడం లేదు కాబట్టి...తన తండ్రి ఎవరో చెబితే ఆయన దగ్గరకు వెళ్లిపోతానని వేడుకున్న శ్రీవల్లి....వైజయంతి కాళ్లు పట్టుకుని నిజం చెప్పమని అడుగుతుంది. సుధాకర్ కూడా నిజం చెప్పేయమని అంటాడు.దీంతో యువరాజు తన తల్లికి తీవ్ర అవమానం జరుగుతుందని తెలిసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత జగధాత్రికి గోరింటాకు పెట్టేందుకు కేదార్ చేసిన చిలిపి పనులు నవ్వు తెప్పిస్తాయి.
వైజయంతి కాళ్లు పట్టుకున్న శ్రీవల్లి
మీనన్ చెర నుంచి శ్రీవల్లిని ఇంటికి తీసుకుని వచ్చినా ఆమె భయం మాత్రం ఇంకా పోదు.అప్పుడే జగధాత్రి, కేదార్ బయట నుంచి రాగా....ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లారని నిషిక నిలదీస్తుంది. అందరం శ్రీవల్లి కోసం కంగారుపడుతుంటే...మీరు మాత్రం ఆశ్రమం నుంచి నేరుగా ఎక్కడికి వెళ్లారని అడుగుతుంది. దీంతో జగధాత్రి,కేదార్‌కు ఏం చెప్పాలో అర్థం కాదు.మీరు ఏమైనా అండర్‌కవర్ పోలీసు ఆఫీసర్లా అని యువరాజు కేదార్‌ను ఇరికించాలని చూస్తాడు. కౌషికి కూడా గట్టిగా నిలదీస్తుంది.మీరు ఏమైనా మా దగ్గర దాస్తున్నారా అని అడుగుతుంది.వెంటనే జగధాత్రి పాపారాయుడు బాబాయి ఊరిలోకి వచ్చాడేమోనని ఎంక్వైరీ చేయడానికి వెళ్లామని అబద్ధం చెబుతుంది.ఆ మాటలు విన్న వైజయంతి మండిపడుతుంది. మా అన్నయ్య శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేస్తాడని నిలదీస్తుంది. మీ అన్న చేసిన పనికి ఎవరైనా అనుమానిస్తారని....వాళ్లు కూడా అలాగే అనుమానించి వాకబు చేయడానికి వెళ్లి ఉంటారులేనని చెబుతాడు.
భయంతో వణికపోతున్న శ్రీవల్లి దగ్గరకు వచ్చి ఏం కాదని జగధాత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది.నా భయం అంతా నేను చచ్చిపోతానని కాదని...నేను చచ్చిపోయేలోగా మా నాన్నను చూడకుండా చచ్చిపోతానేమోనని భయపడ్డాడని చెబుతుంది. అమ్మ ఎలాగూ నన్ను కూతురిలా ఒప్పుకోవడం లేదని....కనీసం మానాన్న ఎవరో చెబితే నేను ఆయన కాళ్లుపట్టుకుని బ్రతిమలాడి ఆయినా ఆయన దగ్గరకు వెళ్లిపోతానని అంటుంది. ఒకవేళ నిజంగానే మానాన్న కూడా నాకోసం ఆతృతగా ఎదురుచూస్తుండొచ్చు కదా అందుకే మానాన్న ఎవరో చెప్పమంటూ వైజయంతి కాళ్లు పట్టుకుంటుంది.
నిజం చెప్పకుంటే ఒట్టేనన్న సుధాకర్
అందరికీ నీ గురించి తెలిసిన తర్వాత కూడా ఇంకా నిజం దాచడంలో ఉపయోగంలేదని..మర్యాదగా నువ్వు పెళ్లికి ముందు సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పమని సుధాకర్ అంటాడు. ఇదేదో నా మెడకు చుట్టుకునేలా ఉందని వైజయంతి అనుకుంటుంది. మా ఆయన బండారం భయటపెట్టకుండా చూడాలనుకుంటే ఇప్పుడు నేను అందిరి ముందు తప్పుడుదానిలా అయిపోయానని వైజయంతి బాధపడుతుంది. మా అమ్మ ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పాల్సిన పనిలేదని యువరాజు అంటాడు. ఇంతకు ముందు అంటే చెప్పకపోయినా పర్వాలేదని....కానీ ఇప్పుడు శ్రీవల్లి అడుగుతుంది కాబట్టి చెప్పాల్సిందేనని కేదార్ అంటాడు.ఇంతలో సుధాకర్ కల్పించుకుని నువ్వు ఇప్పుడు నిజం చెప్పకుంటే నామీద ఒట్టేనని అంటాడు. తన తల్లి పరువు అందరిముందు పోతుందని గ్రహించి యువరాజు వెంటనే వాళ్ల అమ్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేను దానితో ఎలాగైనా ఆ నిజం చెప్పిస్తానులేమ్మా అని సుధాకర్ శ్రీవల్లికి సర్దిచెబుతాడు.
కేదార్ రోమాన్స్
జగధాత్రికి గోరింటాకు పెట్టాలని కేదార్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ధాత్రి అందరితో కలిసి సీరియల్ చూస్తుండగా ఆమెను చాటుగా పిలవడానికి ట్రై చేయగా కౌషికి సహా అందరూ చూస్తారు. నీ భార్యకు గోరింటాకు పెట్టడానికి ఇలా చాటుమాటుగా పిలవాల్సిన పనిలేదని ధైర్యంగా తీసుకెళ్లి గోరింటాకు పెట్టుకోమని కౌషికి పంపిస్తుంది.అది చూసిన నిషిక కూడా తనకు గోరింటాకు పెట్టమని యువరాజును అడగ్గా...ఇప్పుడు నేను గోరింటాకు పెడితే నాచేతులకు అంటుకుంటుందని రేపు ఆఫీసులో బాగుండదని అంటాడు. దీంతో నిషిక అలిగి వెళ్లిపోతుంది. కౌషికి వాళ్ల తమ్ముడిని తిట్టి భర్త తన చేతులతో భార్యకు గోరింటాకు పెడితే ఆ సంతోషమే వేరని వెళ్లి మీ ఆవిడకు సారీ చెప్పి గోరింటాకు పెట్టమని పంపిస్తుంది.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















