అన్వేషించండి

Jagadhatri Serial Today JULY 13th:జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ

Jagadhatri Serial Today Episode July 13th: జేడీ ఎత్తులకు చిత్తయిన మీనన్....కిడ్నాపర్ల స్థావరం కనిపెట్టిన జేడీ, కేడీ

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. మీనన్‌ ఎత్తులను జేడీ చిత్తు చేస్తుంది. జేడీనే బోల్తా కొట్టించానని ఆనందపడిపోతున్న మీనన్‌కు డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి షాక్‌ ఇస్తుంది. మీనన్‌తో చేతులు కలిపి ఈ కిడ్నాప్‌లు చేయిస్తున్న హెల్త్‌మినిస్టర్‌ ఈ దృశ్యం చూసి హడలిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ రసవత్తరంగా మారుతుంది.
కిడ్నాపర్లను పట్టుకోవడానికి జేడీ ప్లాన్
                        శ్రీవల్లిని మీనన్ మనుషులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోవడంతో జేడీ,కేడీ అలెర్ట్‌ అవుతారు. ఈదందా వెనక ఉన్నది మీనన్ అని మనకు తెలిసిపోయింది కాబట్టి వాడు చాలా అప్రమత్తమవుతాడు. వీలైనంత త్వరగా వాడి స్థావరం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని జేడీ అనుకుంటుంది. మరో కిడ్నాప్ జరిగే వరకు ఎదురుచూడకుండా మనలో ఒకరు వాడికి దొరికిపోయేలా ప్లాన్ చేద్దామని జేడీ అంటుంది.అప్పుడు వాళ్లను ఫాలో అవుతూ వెళ్తే మనకు మీనన్ దొరికిపోతాడని చెబుతుంది. దీంతో నలుగురు అబ్బాయిలు, అమ్మాయిలను రెడీ చేస్తారు. అందులో రమ్య కూడా ఉంటుంది. మీనన్ మనుషులకు కనిపించేలా మనం వీళ్లని ఒంటరిగా నిలబెడదామని జేడీ చెబుతుంది. వాళ్లు ఎవరినైనా కిడ్నాప్ చేయగానే మిగిలిన వాళ్లు స్టేషన్‌కు వెళ్లిపోండని చెబుతుంది.
                           రామస్వామి మనుషులకు కనిపించేలా ఒంటరిగా రోడ్డుపై రమ్య నిల్చుంటుంది.వెంటనే రామస్వామి రంగంలోకి దిగుతాడు.ఈ ఒక్క అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మన టార్గెట్‌ పూర్తవుతుందని అనుకుంటారు.రామస్వామి రావడం గమనించిన జేడీ....రమ్యను అలెర్ట్‌గా ఉండమని చెబుతుంది. వాళ్లు మత్తు మందు ఇచ్చినా ఏమాత్రం భయపడొద్దని చెబుతుంది. ఇంతలో రామస్వామి వచ్చి రమ్యకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేస్తాడు. వెంటనే జేడీ, కేడీ ఇద్దరూ కిడ్నాపర్ల కారును ఫాలో అవుతారు.అలాగే మరో కానిస్టేబుల్‌ను బైక్‌పై వెంట రమ్మని జేడీ చెబుతుంది. దీంతో వాళ్లంతా కిడ్నాపర్ల కారు వెనకే వెళ్తుంటారు.  ఆ కారు సిటీ బయటకు రావడంతో జేడీకి అనుమానం వస్తుంది.మనం వెతుకుతున్నామనే....వీళ్లు సిటీకి చివరలో ఉన్న ఫాంహౌస్‌కు డెన్ మార్చి ఉంటారని జేడీ  అంటుంది.
జేడీని బోల్తా కొట్టించిన  మీనన్
                        ఈ కిడ్నాప్ దందా వెనక నేను ఉన్నానని తెలిసినా ఆ జేడీ ఇంత సైలెంట్‌గా ఉందంటే...ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసి ఉంటుందని మీనన్ అనుకుంటాడు. ఇప్పటి వరకు నా మనుషులను అరెస్ట్ చేయలేదు...నా సైట్స్‌పై రైడ్‌ చేయలేదని అంటాడు.అంటే ఏదో ప్లాన్ వేసే ఉంటుందని అనుకుంటాడు. అదే నేను జేడీ ప్లేస్‌లో ఉంటే ఎలా ఆలోచిస్తానని మీనన్‌ అనుకుంటాడు.వెంటనే అతనికి విషయం అర్థమవుతుంది.రామస్వామికి ఫోన్ చేసి నీ వెనక ఓ కారు వస్తుందేమో చూడమని చెబుతాడు. వస్తుందని రామస్వామి చెప్పడంతో...మీనన్‌కు విషయం అర్థమైపోతుంది. అది జేడీ కారని చెబుతాడు.  నన్నే పట్టుకోవడానికి నా మనుషులకే ఎర వేస్తావా అని మీనన్ అంటాడు.మీరు కిడ్నాప్ చేసిన అమ్మాయి ఫొటో తీసి పంపమని రామస్వామిని అడుగుతాడు.అతను పంపించగానే ఈ అమ్మాయి జేడీ టీంలో ఉండే  ఆఫీసరని చెబుతాడు.మీరు ఏం బయపడొద్దని...నేను చెప్పినట్లు చేయమని చెబుతాడు. మీరు వస్తున్న కారులాంటి కారు నేను పంపిస్తానని...నేను చెప్పినప్పుడు మీరు ఆ జేడీని డైవర్ట్‌ చేయమని చెబుతాడు. మీనన్ చెప్పినట్లే వాళ్లు చేస్తారు. 
మీనన్ ఎత్తులకు జేడీ పై ఎత్తులు
                 సిటీ బయటకు వచ్చిన కారు మళ్లీ సిటీలోకి వెళ్తుండటం చూసి జేడీకి అనుమానం వస్తుంది.ఖచ్చితంగా ఏదో జరుగుతుందని కేదార్‌తో అంటుంది. వెంటనే బైక్‌పై  ఫాలో అవుతున్న తన టీం కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి కారు వెనకే వెళ్లమని చెబుతుంది. దీంతో జేడీని డైవర్ట్‌ చేసిన రామస్వామి రమ్యను తీసుకుని ఫాంహౌస్‌కు వెళ్లిపోతాడు. జేడీ మాత్రం ఆ డమ్మీ కారు చుట్టూ తిరుగుతూ ఉంటుంది.ఇప్పుడు జేడీపై నేనే గెలిచానని మీనన్‌ సంబరపడిపోతాడు.  కారులో ఉన్న వాళ్లకు ఫోన్ చేసి కారు ఆపమని చెబుతాడు.  మీ వెనక కారులో ఉన్న జేడీ దగ్గరకు  వెళ్లి ఫోన్‌ ఇవ్వమని చెబుతాడు. జేడీ ఓటమిని నేను కళ్లారా చూడాలని అనుకుంటాడు. మీనన్ చెప్పినట్లే అక్కడికి వెళ్లి చూసిన రౌడీలు షాక్‌ తింటారు. అందులో జేడీ,కేడీలకు బదులుగా కానిస్టేబుల్ ఉండటం చూసి మీనన్‌ ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని ఒకసారి బయటకు వెళ్లి చూస్తే...మా మేడం మీకు హాయ్ చెబుతారని అంటాడు. ఆల్రెడీ జేడీ మీ దగ్గరకు వచ్చేసిందని చెబుతాడు. బయటకు వచ్చి చూసిన మీనన్‌ను చూసి జేడీ నవ్వుతుంది.అయినా నాపై నువ్వు గెలుస్తావని  ఎలా  అనుకున్నావని అంటుంది.మేం ఒక్కకారులోనే ఫాలో చేస్తామని ఎలా అనుకున్నావని ప్రశ్నించడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget