Jagadhatri Serial Today September 3rd: ‘జగధాత్రి’ సీరియల్: జిమ్ ఓపెన్ చేసిన యువరాజ్ – జిమ్ లో ప్రొటిన్ పౌడర్ డబ్బాలో డ్రగ్స్ పెట్టిన టోని
Jagadhatri Today Episode: యువరాజ్, టోనీ పెడుతున్న జిమ్ ఓపెనింగ్ కు వచ్చిన తెలుగు హీరో జిమ్ లోపల డ్రగ్స్ తీసుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Jagadhatri Serial Today September 3rd: ‘జగధాత్రి’ సీరియల్: జిమ్ ఓపెన్ చేసిన యువరాజ్ – జిమ్ లో ప్రొటిన్ పౌడర్ డబ్బాలో డ్రగ్స్ పెట్టిన టోని jagadhatri serial today episode September 3rd written update Jagadhatri Serial Today September 3rd: ‘జగధాత్రి’ సీరియల్: జిమ్ ఓపెన్ చేసిన యువరాజ్ – జిమ్ లో ప్రొటిన్ పౌడర్ డబ్బాలో డ్రగ్స్ పెట్టిన టోని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/03/89aa3543eb17ca77e166e548bde3f4131725329488179879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagadhatri Serial Today Episode: యువరాజ్ జిమ్ బిజినెస్ చేద్దామనుకుంటున్నానని 20 కోట్లు పెట్టుబడి అవసరం అని అడగ్గానే ధాత్రి, కేదార్ జిమ్ బిజినెస్ కు 20 కోట్ల పెట్టుబడి అవసరమా? అని ప్రశ్నిస్తారు. కౌషికి కూడా 20 కోట్టు పెట్టాక రిటర్న్ రాకపోతే మన పరిస్థితి ఏంటని అడుగుతుంది. దీంతో నిషిక యువరాజ్ ను తిడుతుంది. మీ అక్క ఎప్పుడూ వాళ్లు చెప్పిందే వింటుంది మనల్ని అసలు పట్టించుకోదు అని కోప్పడుతుంది. ఇంతలో యువరాజ్ ఈ బిజినెస్‌లో నువ్వు ఇన్వెస్ట్ చేయడం లేదని నేను ఒక్కడినే చేస్తున్నానని యువరాజ్ చెప్పడంతో కౌషికి షాక్ అవుతుంది.
ధాత్రి: వజ్రపాటి కుటుంబ సభ్యులు విడిపోయారట.. అందుకనే యువరాజ్ సొంతంగా వ్యాపారం చేస్తున్నాడట అని బయట అనుకుంటారు.
కేదార్: అవును యువరాజ్. వజ్రపాటి కుటుంబ సబ్యులందరూ ఐకమత్యంగా ఉంటేనే మార్కెట్లో విలువ గౌరవం. అది కాదని అక్క మనసును బాధపెట్టొద్దు.
యువరాజ్: ఏయ్ నీ బోడి సలహాలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. ఇది మా పర్సనల్ మ్యాటర్. మధ్యలో మీకేంటిరా..
కౌషికి: కేదార్ అన్నదాంట్లో తప్పేం ఉంది యువరాజ్. కావాలంటే నేనే ఇన్వెస్ట్ మెంట్ చేస్తాను. అందులో వచ్చే లాభాలు నువ్వే తీసుకో..
అని కౌషికి చెప్పగానే నిషిక మీ ముష్టి ఎవడికి కావాలని అడుగుతుంది. దీంతో కౌషికి నిషికను నోరు మూయమని చెప్తుంది. దీంతో వైజయంతి కౌషికిని తిడుతుంది. ధాత్రిని కంట్రోల్ లో పెట్టు అంటుంది. ఇంతలో సుధాకర్ కలగజేసుకుని యువరాజ్ ను తిట్టి.. వాళ్ల కర్మకు వాళ్లను వదిలేయ్ అంటాడు. కౌషికి ఎమోషనల్ గా ఫీలవుతుంది. ధాత్రి, కేదార్.. యువరాజ్ ను అనుమానిస్తారు. తర్వాత యువరాజ్ జిమ్స్ ఓపెన్ చేస్తుంటాడు. ఇంట్లో వాళ్లందరూ జిమ్ ఓపెనింగ్ కు వెళ్తారు. టోనీ యువరాజ్ లను కౌషికి ఆశీర్వదిస్తుంది. తెలుగు యంగ్ హీరోతో జిమ్ ఓపెనింగ్ చేయిస్తారు. ధాత్రి, కేదార్ ఆ హీరోను అనుమానిస్తారు.
ధాత్రి: చూశావా? కేదార్ చేతులు వణకడం. మనిషి నీరసంగా ఉండటం. ఇవన్నీ డ్రగ్స్ సిండ్రోమ్స్.
కేదార్: అవును ధాత్రి. ఈ జిమ్ము వాళ్లు చేయబోయే ఇల్లీగల్ పనికి కవరప్ లాగానే ఉంది.
ధాత్రి: కానీ యువరాజ్ మీనన్ కోసం పని చేస్తున్నాడు. మరి టోనీ ఎవరి కోసం పని చేస్తున్నాడు. మీనన్ లిస్టులో ఎప్పుడూ పేరు కనబడలేదు. కొత్తగా వచ్చాడా? మొదటి నుంచే మనకు దొరకకుండా ఉన్నాడా? పద కేదార్ మనం కనిపెట్టాలి.
అని ఇద్దరూ వెళ్లిపోతారు. మరోవైపు హీరోకు జిమ్ మొత్తం చూపిస్తారు యువరాజ్, టోనీ. తర్వాత హీరో యువరాజ్, టోనీ లోపలికి వెళ్తారు. జిమ్ ట్రైనర్ కౌషికి వాళ్లకు జిమ్ చూపిస్తుంటాడు. లోపలికి వెళ్లిన హీరో డ్రగ్స్ తీసుకుని మత్తులోకి వెళ్తాడు. మరోవైపు యవురాజ్, టోనీ, హీరో ఏం చేస్తున్నారో కనిపెట్టడానికి ధాత్రి లోపలకి వెళ్తుంది. ధాత్రిని కనిపెట్టిన నిషిక వెనకాలే వెళ్లి ఏం చేస్తున్నావే ఇక్కడ అని అడుగుతుంది.
ధాత్రి: వాష్ రూం కోసం వెతుకుతున్నాను నిషి.
నిషిక: కళ్లు నెత్తికెక్కితే కళ్లముందు ఉన్నవి కూడా కనిపించవు అంట. అక్కడ అంత పెద్ద బోర్డు ఉంది నీకు కనిపించలేదా?
ధాత్రి: అయ్యో చూసుకోలేదు.
నిషిక: చూసుకోమని చెప్తున్నాను. వెళ్లు..
అని చెప్పగానే ధాత్రి వాష్ రూం వైపు వెళ్తుంది. మరోవైపు లోపల హీరో, టోనీ డ్రగ్స్ తీసుకుంటుంటారు. యువరాజ్ బయటకు వచ్చి కౌషికిని జిమ్ ఎలా ఉందని అడుగుతాడు. కౌషికి బాగానే ఉందని చెప్తుంది. ఇంతలో అక్కడే ఉన్న డ్రగ్స్ డబ్బాను కాచి తీసుకుంటే యువరాజ్ లాక్కుని వద్దని వారిస్తాడు. దీంతో ధాత్రి, కేదార్ అనుమానిస్తారు. ఇంతటితో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: సంధ్యను సేవ్ చేసిన శంకర్ – శంకర్ తన ఫ్రెండేనన్న జెండే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)