అన్వేషించండి

Jagadhatri Serial Today  September 25th: ‘జగధాత్రి’ సీరియల్‌: కంపెనీ సీఈవోగా నిషిక – ధాత్రిని మీటింగ్‌కు రమ్మన్న కౌషికి

Jagadhatri Today Episode:   రాఖీ కట్టించుకుని బయటకు వచ్చిన కేదార్‌తో యువరాజ్‌ గొడవ పడతాడు. కౌషికి రాఖీ తానే కట్టానని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode:  కౌషికి రూంలో రాఖీ కట్టించుకుని బయటకు వచ్చిన కేదార్‌, ధాత్రిలను నిషిక చూస్తుంది. అందర్నీ పిలుస్తుంది. యువరాజ్‌ వస్తాడు. కేదార్‌ను తిడతాడు. ఈ ఇంటి వారసత్వం కోసం చాలా ట్రై చేస్తున్నావా..? అంటూ  కోప్పడతాడు. దీంతో ధాత్రి కోపంగా యువరాజ్‌ కు వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో మేము అడిగిందేంటి? మీరు చెప్తున్నదేంటి? అసలు ఆ రాఖీ ఎవరు కట్టారు అని నిలదీస్తుంది నిషిక. దీంతో నేనే రాఖీ కట్టాను అంటూ కౌషికి వస్తుంది. దీంతో నిషిక, వైజయంతి, యువరాజ్‌ షాక్‌ అవుతారు. కౌషికి, ధాత్రి వెళ్లిపోతారు.

వైజయంతి: ఇందాకటి నుంచి నాకొక అనుమానం. రాఖీ మన అనుమానం ప్రకారం ఇప్పుడే కట్టి ఉంటే.. కడుపు పోయిన బాధలో ఆ అమ్మీ గుండె పగిలి ఏడవాలి కానీ ఇట్టా రాకీ కడుతుందా?

కాచి: అవును పెద్దమ్మా కరెక్టు పాయింట్‌ అడిగావు.

నిషిక: ఇవాళ మనకు తెలియకుండా మన కళ్లు కప్పి ఇక్కడ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అత్తయ్య.

బూచి: అయితే మీ దుర్మార్గపు బుర్రలను ఉపయోగించి ఏమైనా గుట్టు ఉంటే చెప్పండి రట్టు చేసేద్దాం.

వైజయంతి: అవును అమ్మీ ఇది తేల్చాల్సిన యవ్వారమే..

   అని మాట్లాడుకుంటారు. లోపల ఏడుస్తూ కూర్చున కౌషికి యువరాజ్‌ మాటలు గుర్తు చేసుకుంటుంది. రాఖీ పట్టుకుని చూస్తుంటుంది. మరోవైపు ధాత్రి, కేదార్‌ ఆలోచిస్తుంటారు. యువరాజ్‌ ఏడుస్తుంటాడు. మరుసటి రోజు అందరూ హాల్లో  కూర్చుని ఉంటారు. కేదార్‌.. కౌషికికి పాలు తీసుకొస్తాడు. కౌషికి వద్దంటుంది. ధాత్రి వచ్చి కడుపు చూపించగానే పాలు తీసుకుని తాగుతుంది.

కాచి: చూశారా? పెద్దమ్మా వాళ్లిద్దరూ అక్కని ఎలా కాకా పడుతున్నారో..

వైజయంతి: చూస్తున్నా.. అమ్మీ అయినా కౌషికికి నిజమైన ప్రేమకు.. నాటకాలకు తేడా తెలిస్తే కదమ్మా..

బూచి: తెలిసే కదా మనల్ని పక్కన పెట్టి వాళ్లను దగ్గర పెట్టుకుంది.

 అనగానే అందరూ బూచిని గుర్రుగా చూస్తుంటారు. ఇంతలో కంపెనీ  బోర్డు మెంబర్‌ వస్తాడు. మీ కంపెనీస్‌ సీఈవోగా మీ టర్మ్‌ అయిపోవచ్చింది. మళ్లీ ఎవర్ని ఎన్నుకోవాలో షేర్‌ హోల్డర్స్‌ అడుగుతున్నారు అని చెప్పగానే ధాత్రి కొత్తగా ఎన్నుకోవడం ఏంటి..? ప్రతిసారి యునానమస్‌ గా వదినే కదా చైర్మన్‌ అంటుంది.  ఇంతలో కౌషికి సరే అంటుంది. అయితే ఎన్నికలు పెట్టండి కానీ రెండు నెలల తర్వాత పెట్టండి అని చెప్తుంది.

వైజయంతి: పెట్టేసింది ఈ రాక్షసి మళ్లీ మెలిక పెట్టేసింది. మన కష్టం అంతా వృథా చేసింది.

నిషిక: ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావే.. ఇంటి విషయాల్లో జోక్యం చేసుకున్నావు ఊరుకున్నా.. ఆఫీసు విషయాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకోను.

ధాత్రి: నేను కూడా అంతే నిషి. అన్యాయంగా వ్యవహరిస్తాం. అక్రమాలు చేస్తాం అంటే చూస్తూ ఊరుకోను.

వైజయంతి: ఆ అమ్మితో రచ్చ ఏంది అమ్మీ నువ్వు గమ్మునుండు.

అంటుంది. దీంతో కౌషికి బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ ను పిలవండి మాట్లాడుదాం. అంటుంది. దీంతో కరెక్టుగా మాట్లాడావు అని అంతవరకు నా కొడుకు సీఈవో గా ఉంటాడు అంటుంది. ఇంతలో యువరాజ్‌ కూడా రెండు నెలలు నేను సీఈవో గా ఉండనని ప్రేమ లేని బాధ్యత నాకు వద్దు అంటూ వెళ్లిపోతాడు. ధాత్రి, సుధాకర్‌ ను సీఈవో గా ఉండమని చెప్తుంది. కౌషికి ఉండగా నేను సీఈవో గా ఉండనని చెప్తాడు. ఇంతలో నిషిక నేను సీఈవో అవుతానని చెప్తుంది. వైజయంతి కూడా తన మాటలతో కౌషికిని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. దీంతో కౌషికి.. నిషికను సీఈవో గా చేయడానికి మీటింగ్‌ అరెంజ్‌ చేయమని చెప్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లక్కీడ్రాలో అదిరిపోయే గిఫ్ట్‌లు, ఈ యువకుల ఆలోచన అదుర్స్మహారాష్ట్రలో భారీ వర్షాలు, నీట మునిగిన ముంబయి!లెబనాన్‌పై మరింత దూకుడుగా ఇజ్రాయేల్, మరో లెవెల్‌కి వార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
తిరుపతి లడ్డూ వివాదం - నెల రోజుల పాటు ఆంక్షలు అమలు
Devara Ayudha Puja: టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
టికెట్లు తెంచే కంటెంట్ ఇప్పుడా వదిలేది! - ‘దేవర’ ఆయుధ పూజ అదుర్స్!
Digital Health Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ - డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
AI Job : మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
మానేసిన ఉద్యోగికి రూ. 22 వేల 558 కోట్లు ఇచ్చి వెనక్కి తెచ్చుకున్న గూగుల్ - ఆ ఉద్యోగిలో అంత మ్యాటర్ ఉంది మరి !
Nara Lokesh: 'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
'మేం జగన్‌లా పారిపోయే వ్యక్తులం కాదు' - రెడ్ బుక్ పని ప్రారంభమైందంటూ మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
Tanikella Bharani : పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
పిక్ ఆఫ్ ది డే - ఒకే ఫ్రేమ్ లో యష్, తనికెళ్ళ భరణి... ఎక్కడున్నారో తెలుసా? 
India vs Bangladesh 2nd Test: భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
భారత జోరుకు బంగ్లా నిలవగలదా? - రెండో టెస్టుకు పొంచి ఉన్న వరుణుడి ముప్పు
Death Sentence: 21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
21 మంది విద్యార్థులపై దారుణం - హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష
Embed widget