Jagadhatri Serial Today September 20th: ‘జగధాత్రి’ సీరియల్: సీమంతం ఆపేందుకు వైజయంతి కుట్ర – ఆదిలక్ష్మీని రంగంలోకి దింపిన నిషిక
Jagadhatri Today Episode: ధాత్రి, కేదార్ కలిసి కౌషికికి సీమంతం చేస్తుంటే దాన్ని ఎలాగైనా ఆపాలని వైజయంతి, నిషిక ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Jagadhatri Serial Today September 20th: ‘జగధాత్రి’ సీరియల్: సీమంతం ఆపేందుకు వైజయంతి కుట్ర – ఆదిలక్ష్మీని రంగంలోకి దింపిన నిషిక Jagadhatri serial today episode September 20th written update Jagadhatri Serial Today September 20th: ‘జగధాత్రి’ సీరియల్: సీమంతం ఆపేందుకు వైజయంతి కుట్ర – ఆదిలక్ష్మీని రంగంలోకి దింపిన నిషిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/20/680e50d429e6f2c1de7bb4065792b0af1726801113883879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagadhatri Serial Today Episode: ఇంట్లో కౌషికి సీమంతం పంక్షన్‌కు ఏర్పాట్లు చేస్తుంటారు. నిషిక, వైజయంతి, కాచి వచ్చి ఏం చేస్తున్నారు అని అడగ్గానే సీమంతం ఫంక్షన్ కోసం రెడీ చేస్తున్నాము అని చెప్పగానే నిషిక సీమంతం ఇక్కడ కాదు పక్కింట్లో అంటారు. ఇంతలో ధాత్రి, కేదార్ వచ్చి సీమంతం ఇక్కడే అంటారు. ఇంతలో యువరాజ్ వచ్చి మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండని వార్నింగ్ ఇస్తాడు. అనాథవు అనాథలాగే ఉండు అంటాడు. నేను అనాథను కాదు. నేనంటే ప్రాణం ఇచ్చే నా భార్య పక్కన ఉండగా నేను అనాథను కాదు అంటాడు కేదార్. ఇంతలో కౌషికి వస్తుంది.
కౌషికి: ఏమైంది. ఎందుకు గొడవ పడుతున్నారు.
ధాత్రి: సీమంతం ఆపమని గొడవ చేస్తున్నారు. ఏంటే మేము ఏదో తప్పు చేసినట్టు చెప్తున్నావు. అయినా వదినే వద్దని చెప్పి వెళ్లిపోయింది కదా? మీరెలా ఫంక్షన్ జరిపిస్తారు.
వైజయంతి: ఇంట్లో పెద్దవాళ్లము ఉన్నాము. నిర్ణయాలు తీసుకునే ముందు మీది కాని ఇంట్లో మీరెట్లా ఏర్పాట్లు చేస్తారు.
కాచి: ఎప్పుడైనా మనల్ని లెక్క చేశారా? పెద్దమ్మ
సుధాకర్: వాళ్లేమీ వాళ్ల సొంత నిర్ణయాలు తీసుకోలేదు. నన్ను అడిగి నేను ఒప్పుకున్నాకే చేస్తున్నారు.
యువరాజ్: అంటే వాళ్లు అడిగి మీరు ఒప్పుకుంటే సరిపోతుందా? నాన్నా ఇంట్లో మా నిర్ణయాలు అడగాల్సిన అవసరం లేదా?
ధాత్రి: మంచికి అభిప్రాయాలు తీసుకోవాలా? యువరాజ్. అవును నిన్ను అడిగితే నువ్వు కాదనేవాడివా?
అనగానే యువరాజ్ పలకకుండా ఉండిపోతాడు. మంచి పని చేయడానికి కూడా ఇంత రాధాంతం చేయాలా? అంటూ కోప్పడతాడు సుధాకర్. అంటే అత్తింటి నుంచి ఎవరైనా వచ్చి గొడవ చేస్తే ఎవరు చేస్తే ఎవరు బాధ్యులు అంటూ వైజయంతి అడగ్గానే ఇంతలో సురేష్ వచ్చి నాది బాధ్యత అంటాడు. మా ఇంటి నుంచి ఎవరు వచ్చినా నేను చూసుకుంటాను అంటాడు. దీంతో ధాత్రి హ్యాపీగా నిషికను రెడీ అవ్వమంటుంది. తర్వాత అందరూ కలిసి సీమంతం ఆపడానికి ప్లాన్ చేస్తుంటారు. సీమంతం గురించి ఆదిలక్ష్మీకి ఫోన్ చేసి చెప్పాలని డిసైడ్ అవుతారు. నిషిక ఫోన్ చేసి ఆదిలక్ష్మీకి సీమంతం గురించి చెప్తారు. దీంతో ఆదిలక్ష్మీ కోపంగా కౌషికిని తిట్టి ఫోన్ కట్ చేస్తుంది. తర్వాత ఫంక్షన్ మొదలవ్వగానే ఆదిలక్ష్మీ వస్తుంది.
ఆదిలక్ష్మీ: కట్టిన తోరణాలు తీసేయండి. వచ్చిన ముత్తైదువులందరూ వెళ్లండి. ఇక్కడ ఏ సీమంతం జరగడం లేదు.
ధాత్రి: పిన్ని గారు ఫ్లీజ్.. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన గొడవను నలుగురిలోకి తీసుకురాకండి. లోపలికి రండి మనం మాట్లాడుకుందాం.
ఆదిలక్ష్మీ: నలుగురిని పిలిచి సీమంతం చేసుకోవాలిన సంబరపడ్డారు కదా? నలుగురిలో మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు.
కేదార్: అత్తయ్యా ఫ్లీజ్ ఇందులో అక్క తప్పేమీ లేదు. మేము బలవంతం పెడితేనే అక్క ఒప్పుకుంది.
ఆదిలక్ష్మీ: అసలు బలవంతం చేయడానికి. ఏర్పాట్లు చేయడానికి మీరెవరు?
సురేష్: అమ్మా జరిగిన గొడవలకు మనం నష్ట పోయింది చాలు. ఇకనైనా కోపాలతో పంతాలతో కాకుండా మనుషులతో సంతోషంగా ఉందాం అమ్మా
అంటూ సురేష్ బతిమాలినా.. ఆదిలక్ష్మీ, సురేష్‌ను తిడుతుంది. యువరాజ్, నిషిక, వైజయంతి సంబరపడుతుంటారు. మీకు ఫంక్షన్ గురించి మీకు చెప్పమని సురేష్ అన్నయ్యకు చెప్పాము మీకు చెప్పలేదా? అంటే నేను చెప్పడానికి ఫోన్ చేస్తే.. అమ్మే ఫోన్ ఎత్తలేదు అంటాడు సురేష్. ఇంతలో కౌషికి వచ్చి ఆదిలక్ష్మీని బతిమాలుతుంది. దీంతో ఆదిలక్ష్మీ మెత్తబడిపోతుంటే.. వైజయంతి బయటకు తీసుకెళ్లి మరింత రెచ్చగొడుతుంది. దీంతో ఒక్క క్షణం ఆ కౌషికి మాటలు నమ్మి మారిపోదామనుకున్నాను. కానీ ఇప్పుడు చూడు కౌషికి ఎలా గుణపాఠం చెప్తానో అని ఆదిలక్ష్మీ అనడంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)