Jagadhatri Serial Today October 29th: ‘జగధాత్రి’ సీరియల్: సుధాకర్ కిడ్నీలు బాగానే ఉన్నాయన్న డాక్టర్ – నిషికను తిట్టిన యువరాజ్
Jagadhatri Today Episode: సుధాకర్ కు కిడ్నీలు ఇవ్వడానికి రెడీ అయిన కేదార్‌ను కమలాకర్ తన మాటలతో బెదిరించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: అదంతా నేను మీనన్‌కు ఫోన్ చేసి చెప్పాను. మీనన్ ప్రొఫెసర్ ను చంపేద్దామని బయలుదేరాడు. అని చెప్తాడు డ్రైవర్. తర్వాత ఏం జరిగిందని ధాత్రి కేదార్ అడగ్గానే మీనన్ వచ్చి తన కారుతో ప్రొఫెసర్ ను గుద్ది చంపేసాడని చెప్తాడు. తర్వాత కావ్య మేడంకు ఆ జర్నలిస్ట్ ఫ్రూప్స్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు అని చెప్పగానే ఆ తర్వాత ఏం జరిగిందని ధాత్రి అడగ్గానే డ్రైవర్ నాకు తెలియదు అంటూ చనిపోతాడు. డాక్టర్ వచ్చి డ్రైవర్ చనిపోయాడని చెప్తాడు. కోపంగా ధాత్రి కేదార్ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ధాత్రి: అంటే పెద్ద మామయ్య గారిని యాక్సిడెంట్ చేసి చంపింది మీనన్. మీనన్ దొంగిలించిన బలమైన సాక్ష్యం మామయ్య గారికి దొరికింది. మామయ్య నుంచి అమ్మ తీసుకుంది. ఆ రాగి రేకు గురించి ఇంత మంది ప్రాణాలు తీశారంటే ఇందులో అంత విలువైన మ్యాటర్ ఏముంటుంది కేదార్.
కేదార్: అందులో ఉన్న మ్యాటర్ కచ్చితంగా నిధులు దొరికినప్పుడు దాని మీద ఉన్న మ్యాటర్ అయ్యుండొచ్చు. ఆ ప్రొఫెసరే రాసి ఉండవచ్చు. ఆ మ్యాటర్ బయటపడటం ఇష్టం లేని వాళ్లు ఇదంతా చేసి ఉంటారు.
ధాత్రి: సో మనం ఆ రాగి రేకు మీద ఏముందో తెలుసుకోవాలి.
అనుకుని ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లగానే కౌషికి ఎదురు వచ్చి నీ కిడ్నీ బాబాయ్ కు సరిపోతుందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు. అంతే కాదు రేపు నిన్ను, బాబాయ్ ని హాస్పిటల్ కు తీసుకు రమ్మని చెప్పారు అనగానే కేదార్ హ్యాపీగా ఫీలవుతుంటాడు.
కౌషికి: ఏమైంది తమ్ముడు..
కేదార్: అక్కా ఇంట్లో ఇంత మంది ఉండగా నాన్నను కాపాడుకునే అవకాశం నాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది అక్క.
సుధాకర్: కేదార్‌ను నేను బిడ్డగా చేరదీయకపోయినా.. సంతోషంగా స్వీకరిస్తున్నాడు. ( అని మనసులో అనుకుంటాడు. )
బూచి: కాచి కిడ్నీ ఇవ్వడం అంటే వాడు ఇడ్లీ ఇవ్వడం అంత సులువు అనుకుంటుంన్నాడు.
కాచి: అవును బూచి నా ఫీలింగ్ కూడా అంతే..
వైజయంతి: కేదార్ నీ రక్తము.. మా బావ రక్తము ఒక్కటే అని తెలిసి అందరం చాలా సంతోషగా ఫీలయ్యాము. కానీ మాకు ప్రాణం పోసే ఇరకాటంలో నీ ప్రాణాలు పణంగా పెడుతున్నావేమో ఓ తూరి ఆలోచించు నాయన.
ధాత్రి: అదేం పర్వాలేదు అత్తయ్య గారు. నాకు కేదార్ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మామయ్య గారి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
యువరాజ్: చూడు జగధాత్రిని చూసి నేర్చుకో.. ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంత మాట్లాడాలో కరెక్టుగా మీటర్ పెట్టుకుని మాట్లాడుతుంది.
కేదార్: అవును పిన్ని నాన్నను కాపాడుకోవడానికి నా కిడ్నీ ఉపయోగ పడుతుంది అంటే ఇడ్లీ ఇచ్చేసినంత ఈజీగా ఇచ్చేస్తాను.
బూచి: కొంపదీసి మన మాటలు వినిపించాయంటావా? ఏంటి..?
కమలాకర్: కేదార్ రేపు ఒకసారి డాక్టర్ ను కలువు.. కిడ్నీ ఇవ్వడంలో అవగాహన తెచ్చుకో..
కేదార్: నేను ఆల్ రెడీ డాక్టర్ ను కలిసాను. అన్ని విషయాలు తెలుసుకున్నాను.
అని చెప్పగానే కౌషికి మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండని చెప్పగానే ధాత్రి, కేదార్ వెళ్లబోతుంటే డాక్టర్ వస్తాడు. మీరందరూ నన్ను క్షమించాలి అని సుధాకర్ గారి కిడ్నీలు పాడవలేదు. ఆయనకు ఆపరేషన్ అవసరమే లేదు అంటూ నిన్న మీరొచ్చిన టైంకే ఇంకొకరు వచ్చారని రిఫోర్ట్ మారాయని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. యువరాజ్ వెళ్లి డాక్టర్‌ను కొట్టబోయి ఆగిపోతాడు. తర్వాత డాక్టర్ వెళ్లిపోతాడు. తర్వాత సుధాకర్ ఒక్కడే కూర్చుని యువరాజ్, కేదార్ మాటలు గుర్తు చేసుకుంటుంటాడు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!