Jagadhatri Serial Today November 14th: ‘జగధాత్రి’ సీరియల్: ఆదిలక్ష్మీకి శిక్ష వేసిన జడ్జి – కౌషిని తిట్టిన సురేష్
Jagadhatri Today Episode: కౌషికి వాళ్లు కోర్టుకు వెల్లే లోపే నిషిక వెళ్లి సాక్ష్యం చెప్పడంతో ఆదిలక్ష్మీకి శిక్ష పడుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగ జరిగింది.
Jagadhatri Serial Today Episode: కేదార్, ధాత్రి, కౌషికి, సురేష్ పోలీస్ స్టేషన్ కు వెళ్తుంటారు. మరోవైపు పోలీసులు ఆదిలక్ష్మీని అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొస్తారు. ఎస్సై యువరాజ్ కు ఫోన్ చేసి మీరు చెప్పినట్టే ఆదిలక్ష్మీని అరెస్ట్ చేసి తీసుకొచ్చామని చెప్తాడు. ఆ కంప్లైట్ లెటర్ మాకు ఇవ్వండి అని చెప్తాడు. సరే అంటాడు యువరాజ్ ఇంతలో యువరాజ్‌కు కమలాకర్ ఫోన్ చేసి ఆ సాక్ష్యం వాళ్లకు దొరక్కుండా చేశామని కౌషికి, సురేష్ స్టేషన్‌కు వస్తున్నారని చెప్పగానే వాళ్లు స్టేషన్‌కు వచ్చేలోపు ఆదిలక్ష్మీని కోర్టులో ప్రొడ్యూస్ చేసేలా చేస్తాను అంటాడు. అక్క స్టేషన్ కు వస్తే కేసు క్లోజ్ చేయిస్తుంది. అలా జరగనివ్వను అంటుంది. మరోవైపు అందరూ కంగారుగా స్టేషన్ కు వెళ్తుంటారు.
ధాత్రి: వదిన పిన్ని గారిని కోర్టులో సబ్మిట్ చేస్తే ఏదైనా జరగొచ్చు. రిమాండ్ కు పంపించొచ్చు. జైలు శిక్ష కూడా వేయోచ్చు. అలా జరగకుండా ఉండాలంటే పిన్ని గారిని కోర్టుకు తీసుకెళ్లకుండా ఆపాలి.
కౌషికి: ఎలా..?
కేదార్: అక్కా మీకు ఎస్సై గారు తెలుసు కదా..? ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. కనీసం మనం వెళ్లే వరకైనా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పండి అక్క.
కౌషికి ఎస్సైకి ఫోన్ చేస్తుంది. ఎస్సై ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే. యువరాజ్ ఎస్సైకి డబ్బులు ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేయోద్దని చెప్తాడు. ఇవి అడ్వాన్స్ మాత్రమే.. మీ అక్క రాజీకి వచ్చే లోపు ఆవిడను కోర్టుకు తీసుకెళ్లి శిక్ష పడేలా చేయ్.. నువ్వు ఊహించనంత డబ్బు ఇస్తాను అని యువరాజ్ చెప్పగానే.. ఎస్సై ఫోన్ స్విచ్చాప్ చేస్తాడు. కేదార్ ఎందుకైనా మంచిది మనం లాయర్ ను తీసుకుని స్టేషన్ కు వెళ్దామని చెప్తాడు. కౌషికి లాయర్‌కు ఫోన్ చేస్తుంది. మరోవైపు ఎస్సై ఎఫ్‌ఐఆర్ రెడీ చేసి కోర్టుకు తీసుకెళ్తుంటే.. ఆదిలక్ష్మీ నా కొడలు గురించి మీకు తెలియదు తనో పెద్ద జర్నలిస్టు అని చెప్పగానే అసలు మీ మీద కేసు పెట్టిందే మీ కోడలు అని ఎస్సై చెప్పగానే ఆదిలక్ష్మీ కౌషికిని తిడుతుంది. యువరాజ్ నిషికను ఫోన్ చేసి మన ప్లాన్ వర్కౌట్ అయింది. అక్క కోర్టుకు వెళ్లలోపే నువ్వు కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పు అని చెప్తాడు. సరేనని నిషిక అంటుంది. మరోవైపు ఆదిలక్ష్మీని కోర్టుకు తీసుకెళ్తారు.
ఆదిలక్ష్మీ: ఎస్సై గారు అసలు నన్ను నా కొడుకుతోనైనా మాట్లాడనివ్వండి.
మరోవైపు ధాత్రి, కేదార్ ను కొంచెం త్వరగా వెళ్లమని చెప్తుంది.
కౌషికి: ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య గారికి శిక్ష పడకూడదు.
ధాత్రి: మీరు కంగారు పడకండి వదిన పిన్ని గారికి ఎటువంటి శిక్ష పడదు. అయినా ఇప్పుడు మనం అందరం వెళ్తున్నాము కదా
కేదార్: ఒకవేల సాక్ష్యం చెప్పినా.. మన ఫ్యామిలీలోనే ఎవరైనా చెప్పాలి అక్క. వాళ్లను ఎవ్వరినీ రానివ్వనని యువరాజ్ చెప్పారు కదా..? మీరు కూల్ గా ఉండండి.
ధాత్రి: ఆదిలక్ష్మీ పిన్ని కిడ్నాప్ చేశారు అని ఎవరైనా సాక్ష్యం చెప్పనంత వరకు ఎలాంటి సమస్య ఉండదు వదిన.
అని ధైర్యం చెప్తుంది. మరోవైపు కోర్టులో ఆదిలక్ష్మని జడ్జి ముందు ప్రవేశపెడతారు. అక్కడ లాయరు ఆదిలక్ష్మీ సొంత మనవరాలినే కిడ్నాప్ చేయాలని చూసింది. అప్పుడే ఇద్దరు వ్యక్తులు కాపాడారు. అంటూ వాదించడంతో.. ఆదిలక్ష్మీ నేను ఏ తప్పు చేయలేదని ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతుంది. జడ్జి పోలీసులను పిలిచి ఈవిడ కిడ్నాప్ చేసిందని సాక్ష్యం ఉందా..? అని అడగ్గానే లేదని పోలీసులు చెప్తారు. ఇంతలో నేను సాక్ష్యం ఉన్నాను అని నిషిక వచ్చి సాక్ష్యం చెప్తుంది. దీంతో జడ్జి ఆదిలక్ష్మీని 14 రోజులు రిమాండ్ విధిస్తాడు. ఇంతలో కౌషికి వాళ్లు కోర్టులోకి వస్తారు. అక్కడ నిషిక, వైజయంతి, కమలాకర్ ఉండటం చూసి షాక్ అవుతారు. ఇంతటితో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!