అన్వేషించండి

Jagadhatri Serial Today March 4th: ‘జగధాత్రి’ సీరియల్‌: మినిష్టర్ మర్డర్ కేసులో నిజం ఒప్పుకున్న రాఘవ - కౌషికికి మీనన్ వార్నింగ్

Jagadhatri Today Episode: మినిష్టర్ తానే హత్య చేయించానని రాఘవ ఒప్పుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: మినిష్టర్‌ ఇంటికి వెళ్లి రాఘవను ఇంటరాగేషన్‌ చేస్తారు కేదార్‌, ధాత్రి. ఇంట్లోని సీసీటీపీ ఫుటేజీ పరిశీలిస్తారు. అందులో ఏదో అనుమానం రావడంతో ధాత్రి ప్రిజ్‌ గురించి రాఘవను అడుగుతుంది. అయితే రాఘవ భయపడుతూ సమాధానం చెప్పడంతో కేదార్‌, ధాత్రి రాఘవను అనుమానిస్తారు. వెంటనే మినిష్టర్ ను ఎందుకు చంపావని నిలదీయడంతో రాఘవ నేను ఎం చేయలేదని అంతా మల్లయ్యకే తెలుసని అంటాడు. మల్లయ్య ఎవరని కేదార్‌, ధాత్రి అడగ్గానే నాన్నగారిని ఎప్పుడూ సీక్రెట్‌గా కలుస్తాడని రాఘవ చెప్తాడు. అయితే ఆ మల్లయ్య డీటెయిల్స్‌ చెప్పమని ధాత్రి అడుగుతుంది. దీంతో మల్లయ్య డీటెయిల్స్‌ తనకు తెలియవని కానీ ఆయన నెంబర్‌ డాడీ ఫోన్‌లో ఉందని.. నంబర్‌ తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు రాఘవ.

కేదార్‌: ఎంటి ధాత్రి ఇది ఈ కేసు ఇన్ని మలుపులు తిరుగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తున్నారు. ఏం అర్థం కావడం లేదు.

ధాత్రి: కేడీ వాడు కచ్చితంగా మనల్ని కన్పీజ్‌ చేసి ఇప్పుడు పారిపోయాడు.

రాఘవ: నేనెక్కడికి పారిపోతా మేడం..

అంటూ రౌడీలను తీసుకుని వస్తాడు రాఘవ.

ధాత్రి: నిన్ను ఫస్ట్‌  టైం నేను చూసినప్పుడే నీమీద నాకు డౌట్‌  వచ్చిందిరా? నా గెస్‌  కరెక్టే కేడీ.

అనగానే కేదార్‌ రాఘవను కొడతాడు. రౌడీలు కేదార్‌, ధాత్రిల మీదకు వస్తారు. రౌడీలను  చితక్కొట్టిన తర్వాత కేదార్‌ రివాల్వర్‌ తీసి రాఘవకు ఎయిమ్‌ చేసి నిజం చెప్పమని అడుగుతారు. దీంతో రాఘవ మినిస్టర్‌ను ఎలా చంపింది మొత్తం క్లియర్‌గా వివరిస్తాడు. ఒక కిల్లర్‌ తో మినిష్టర్‌ను పొడిపించి ఆ నేరం సుధాకర్‌ మీద పడేటట్లు  చేశానని ఒప్పుకుంటాడు రాఘవ.  ఇంతలో పోలీసులు వస్తారు. రౌడీలను రాఘవను అరెస్ట్‌  చేస్తారు. పోలీసులు మీరెవరని కేదార్‌, ధాత్రిని అడగ్గానే  తాము సాదు టీం అని చెప్తారు. మినిస్టర్‌ గారిని తామే చంపానని రాఘవే ఒప్పుకున్నాడు అని ధాత్రి చెప్పగానే పోలీసులు సరే మిగతాది తాము చూసుకుంటామని చెప్తారు.  మరోవైపు కౌషికికి మీనన్‌ ఫోన్‌ చేస్తాడు.

మీనన్‌: కౌషికి నీ భయం చూసి మీ బాబాయ్‌ మీద ప్రేమ ఉందనుకున్నా? కానీ లేదని అర్థం అయ్యింది. అందుకే మా మనుషులకు మీ బాబాయ్‌ ని చంపేయమని చెప్పా

కౌషికి: చంపేయమని చెప్పడం ఏంటి? నాకిచ్చిన టైం లోపు పెన్‌డ్రైవ్‌ నీకు ఇస్తానని చెప్పాను కదా?

మీనన్‌: ఈ మీనన్‌ అంటే ఎవరనుకున్నావు  కౌషికి నాతోనే గేమ్స్‌ ఆడాలని చూస్తున్నావా? పెన్‌డ్రైవ్‌  చేతికి రాగానే మొదటి కాల్‌  నాకే వస్తుందనుకున్నా? కానీ అలా జరగలేదు ఎందుకు?

కౌషికి: సారీ పెన్‌డ్రైవ్‌ నీకిచ్చేస్తాను. ఇంకోసారి ఇలా జరగదు. నన్ను నమ్ము.

మీనన్‌: మీ బాబాయ్‌ ప్రాణాలతో కావాలంటే గంటలో పెన్‌డ్రైవ్‌ తీసుకుని జైలుకు వచ్చేయ్‌.

అని చెప్పగానే సరే అని ఫోన్‌ పెట్టేస్తుంది కౌషికి. సురేష్‌ కష్టం, ధాత్రి నమ్మకం అలాగని నాన్న ప్రాణాలు ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తూ ధాత్రికి ఫోన్‌ చేసి తనకు మీనన్‌ ఫోన్‌ చేశాడని జరిగిన విషయం చెప్తుంది కౌషికి. దీంతో సరే మీరు జైలు దగ్గరకు రండి నేను కేదార్‌ అక్కడికి వస్తాము.

కౌషికి: వద్దు మీరు అక్కడికి వచ్చారని తెలిస్తే బాబాయ్‌ని ఏమైనా చేస్తాడు. ఆ పెన్‌డ్రైవ వాడికి ఇచ్చేస్తే సురేష్‌ పడిన కష్టం అంతా వృథా అయిపోతుంది. నువ్వేమైనా ఐడియా ఇస్తావని నీకు కాల్‌ చేశాను.

ధాత్రి: మీరేం భయపడకండి వదిన నేను కేదార్‌ లోపలికి రాము. మీరు ధైర్యంగా జైలుకు వెళ్లండి.

అని ధాత్రి చెప్పగానే కౌషికి సరే అని పెన్‌డ్రైవ్‌ తీసుకుని వెళ్లిపోతుంది. చాటు నుంచి కౌషికి మాటలు విన్న యువరాజ్‌ జైలులో ఏమి జరగబోతుంది అని వెనకే వెళ్లి గమనించాలి అని వెళ్లిపోతాడు. మరోవైపు ధాత్రి కోపంగా అల్లుణ్ని అత్తారింటికి పంపిచే టైం వచ్చింది అని మా అమ్మ చావుత సమాధి చేసిన నిజాలను బయటకు తీసుకొచ్చి మా అమ్మ నిజాయితీని నిరూపిస్తాను అని జైలుకు బయలుదేరుతారు. మరోవైపు మీనన్‌ సింగ్‌  గెటప్‌ వేసుకుని జైలులోకి వెళ్లి సుధాకర్‌ షెల్‌లో కూర్చుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: అంబానీ పెళ్లి వేడుకల్లో మోడ్రన్ ఔట్​ఫిట్స్​లో సందడి చేసిన జాన్వీ కపూర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget