Jagadhatri Serial Today January 6th: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్‌ను బయటకు తీసుకొచ్చిన ధాత్రి – భయంతో హడలిపోయిన హోంమంత్రి
Jagadhatri Today Episode: హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన ధాత్రి సాక్ష్యాల తీసుకురావడంతో కేదార్ జైలు నుంచి బయటకు వస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: కిరణ్ తాగినట్టు బైక్ మీద వెళ్లి శ్రీనివాస్‌తో గొడవ పెట్టుకుంటాడు. మిగతా పోలీసులు వచ్చి కిరణ్‌ను పట్టుకుంటారు. వెంటనే కిరణ్ శ్రీనివాస్‌ను తోసేసి పారిపోతాడు. పోలీసులు అందరూ కిరణ్ వెనకాల పరుగెడతాడు. ఇంతలో జగధాత్రి వచ్చి శ్రీనివాస్‌కు ముసుగేసి పిచ్చకొట్టుడు కొట్టి లోపలికి వెళ్తుంది. పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చిన శ్రీనివాస్ లోపలికి వెళ్లి ధాత్రికి గ్లౌజుల, ఫోన్ ఇచ్చి డోర్ బయట లాక్ చేసుకుని పక్కకు వెళ్లి దాక్కుంటాడు. ఇంతలో కానిస్టేబుల్స్ రావడంతో శ్రీనివాస్ లోపలికి ఎవరైనా వెళ్లారేమో చూద్దాం పదండి అంటూ లోపలికి వస్తారు.
శ్రీనివాస్: వేసిన లాక్ వేసినట్టే ఉంది. నాకెందుకో ఇది జేడీ పనిలా ఉంది. ఎందుకైనా మంచిది ఇంటి చుట్టు చూడండి ఎవరైనా ఉన్నారేమో
లోపల సెర్చింగ్ చేస్తున్న ధాత్రికి ఒక విగ్ దొరుకుతుంది.
ధాత్రి: హీరోయిన్ జుట్టు బాగానే ఉంది కదా.? తను విగ్గు పెట్టుకోదు. ఇది ఎవరిదై ఉంటుంది ఆరు వేళ్లు ఉన్నాయి. ఎవరిది ఇది ఆరు వేళ్లు ఉన్న కాలు.
అనుకుంటూ ఫోటోలు తీస్తుంది ధాత్రి. ఫోన్ ప్లాస్ లైట్ వెలగడం ఎస్సై శ్రీనివాస్ చూసి లోపలికి వెళ్తుంటాడు. కిరణ్, దాత్రికి ఫోన్ చేసి వాళ్లకు మీ మీద డౌటు వచ్చింది మేడం మీరు దాక్కోండి అని చెప్తాడు. పోలీసులు లోపలికి వెళ్తారు.
శ్రీనివాస్: లోపల ఎవరున్నారో నాకు తెలుసు. మర్యాదగా వచ్చి లొంగి పోతే సరి. లేదంటే షూట్ చేసేస్తా…
ధాత్రి: బయటకు వెళ్లడానికి వేరే దారి కూడా లేదు. వెళ్లాలంటే ఆ శ్రీనివాస్‌ను దాటుకునే వెళ్లాలి. ఎలా..?
శ్రీనివాస్: వన్.. టూ.. త్రీ..
కానిస్టేబుల్: సార్ లోపల ఉన్నది ఎవరో నాకు తెలుసు సార్.
శ్రీనివాస్: లోపల ఎవరున్నది నువ్వు చూశావా..? ఎవరున్నారు.
కానిస్టేబుల్: ఈ ఇంట్లో ఉన్నది. ఈ ఇంట్లో ఉన్న హీరోయిన్ సార్. అవును సార్ ఇలా అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు దెయ్యాలు అవుతారని మా బామ్మ చెప్పింది సార్.
శ్రీనివాస్: ఏయ్ నానెన్స్ ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటయ్యా..లోపలికి వెళ్లి మొత్తం వెతకండి.
అని మట్లాడుకోవడం విన్న ధాత్రి..బయట ఉన్న కిరణ్‌కు ఫోన్ చేసి కరెంట్ ఆఫ్ చేయమని చెప్తుంది. కిరణ్ కరెంట్ ఆఫ్ చేయగానే.. ధాత్రి దెయ్యంలా పోలీసులను బెదిరిస్తుంది. శ్రీనివాస్ తో సహా పోలీసులందరూ పారిపోతారు. తర్వాత సాధుకు ఫోన్ చేసిన ధాత్రి హీరోయిన్ ఇంట్లో దొరికిన ఫ్రూప్స్ గురించి చెప్తుంది. తర్వాత శ్రీనివాస్‌ను లైన్‌లోకి తీసుకుని మాట్లాడతాడు సాధు. వెంటనే కేదార్ కండీషన్ బెయిల్‌ను యాక్సెప్ట్ చేసి వెంటనే అతన్ని వదిలిపెట్టు అని చెప్తాడు సాధు. సరేనని కేదార్‌ను వదిలిపెడతాడు శ్రీనివాస్.
కేదార్: నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు..?
శ్రీనివాస్: మీ కండీషన్ బెయిల్ ను యాక్సెప్ట్ చేస్తున్నాను. అక్కడ సంతకాలు చేయ్. అంత ఆనంద పడకు మళ్లీ నిన్ను ఈ సెల్ వేస్తాను
కేదార్: థాంక్యూ సార్..
అంటూ కేదార్ బయటకు వస్తాడు.
కేదార్: థాంక్యూ సో మచ్ జగధాత్రి..
ధాత్రి: మనకు సాధు సార్ కూడా హెల్ప్ చేశారు. ముందు సార్‌కు థాంక్స్ కు చెప్పు.
అంటూ ఫోన్ చేసి ఇస్తుంది. కేదార్, సాధుకు థాంక్స్ చెప్తాడు. మరోవైపు హోంమంత్రికి ఎవరో ఫోన్ చేసి కేదార్ జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్తాడు. దీంతో హోంమంత్రి ఆలోచిస్తుంటాడు. మరోవైపు ఇంటికి వచ్చిన కేదార్‌ను చూసి నిషిక షాక్ అవుతుంది. అందరినీ పిలస్తుంది. కేదార్ ను చూసి కౌషికి హ్యాపీగా ఫీలవుతుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!