Jagadhatri Serial Today January 3rd: ‘జగధాత్రి’ సీరియల్: కూరలో విషం కలిపిన యువరాజ్ – అదే కూరను కేదార్‌కు తినిపించిన ధాత్రి
Jagadhatri Today Episode: కేదార్‌ను చంపేందుకు కూరలో యువరాజ్ విషయం కలుపుతాడు. అదే కూరను ధాత్రి, కేదార్‌కు వడ్డించడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ఎస్సై.. కానిస్టేబుల్‌ను పిలిచి రాత్రికి థర్డ్ డిగ్రీ చేయాలని అన్ని రెడీ చేయమని చెప్తాడు. సరేనని కానిస్టేబుల్ వెళ్తాడు. కేదార్ రాత్రిని భోజనం పెట్టిన తర్వాత థర్డ్ డిగ్రీకి రెడీ ఉండు అంటాడు. మరోవైపు ధాత్రి వంట చేస్తుంటే.. కౌషికి వచ్చి కేదార్ కోసం వంట చేస్తున్నానంటే నేను హెల్ఫ్ చేస్తాను కదా అంటుంది. ఏమీ వద్దులే వదిన అంటుంది ధాత్రి. ఇంతలో నిషిక వచ్చి కౌషికి, ధాత్రిని తిడుతుంది. ఇంతలో యువరాజ్ వచ్చి నిషికను తిడుతాడు. నిషిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. యువరాజ్ కూల్‌గా ధాత్రికి సారీ చెప్పి వెళ్లిపోతాడు. పక్కకు వెళ్లిన యువరాజ్ నేను ఇంత ఫర్మామెన్స్ చేస్తుంది కేదార్ గాడిని లేపేయడానికి అని మనసులో అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి కర్రీస్‌లో విషం కలుపుతాడు యువరాజ్. అదే కర్రీస్ బాక్స్ తీసుకుని ధాత్రి స్టేషన్‌కు బయలుదేరుతుంది.
ధాత్రి: వదిన నేను వెళ్లోస్తాను.
కౌషికి: నేను ఆల్ రెడీ మన లాయర్‌తో మాట్లాడాను. బెయిల్ పేపర్స్ రెడీ చేసి తీసుకొస్తా అన్నారు. కేదార్ ఇంటికి వచ్చాక ఫర్‌దర్‌గా ఎలా మూవ్ కావాలో ఆలోచిద్దాం.
ధాత్రి: అది కాదు వదిన..
కౌషికి: జగధాత్రి ఫ్లీజ్ ఇది నేను చేస్తున్న సాయం కాదు. నా బాధ్యత.
ధాత్రి: సరే వదిన థాంక్యూ..
అని ధాత్రి వెళ్లిపోతుంది. కారు పక్కనుంచి ధాత్రి వెళ్లడం చూసిన యువరాజ్ కారులో ధాత్రిని ఫాలో అవుతాడు. ధాత్రి స్టేషన్‌కు వెళ్లే లోపే లాయర్ అక్కడ ఎదురుచూస్తూ ఉంటాడు.
ధాత్రి: నమస్తే లాయర్ గారు..
లాయర్ : నమస్తే మేడం కౌషికి గారు కేసు డీటెయిల్స్ చెప్పారు. బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాను.
ధాత్రి: అవునా థాంక్యూ సో మచ్ లాయరు గారు.
లాయరు: కేదారే మర్డర్ చేశాడని పోలీసులకు అనుమానం ఉంది కానీ స్ర్టాంగ్ ఎవిడెన్స్ లేదు.
యువరాజ్: వాడి చాప్టర్ ఈరోజుతో క్లోజ్ అవుతుందనుకుంటే లాయరేంటి బెయిల్ అంటున్నాడు. ఇప్పుడేం చేయాలి. అయినా లోపల ఉన్నది మెంటల్ శీను గాడు వాడు బెయిల్ ఇస్తాడా..?
అని యువరాజ్ అనుకుంటాడు. లోపలికి వెళ్లిన ధాత్రిని చూసిన కేదార్ ఎమోషనల్ అవుతాడు. ఒకర్ని ఒకరు చూసుకుని ఏడుస్తుంటారు. వెంటనే ఇక్కడేం ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతుంది ధాత్రి. ఏం లేదని కానీ నా వల్ల అక్క పరువు నాన్నా పరువు పోయింది కదా ధాత్రి అంటాడు కేదార్. అలాంటిదేం లేదని చెప్తుంది ధాత్రి. ఇంతలో ఎస్పై వస్తాడు.
ఎస్సై: మీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయిపోతే నేను నా ఇంటరాగేషన్ మొదలుపెట్టాలి.
ధాత్రి: అవసరం లేదు. మాకు ఇక్కడే ఉండాలనే ఆలోచన లేదు. లాయరు గారు కేదార్‌కు బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారు. అవి తీసుకుని కేదార్‌ను పంపిస్తే మేము వెళ్లిపోతాము.
అని చెప్పగానే లాయరు బెయిల్ పేపర్స్ ఇస్తాడు. అవి చూసిన ఎస్సై వాటిని చింపేస్తాడు. లాయరు, ధాత్రి ఎస్సైని తిడతారు. ఎందుకు చింపేశావని అడుగుతారు. ఈ కేసులో కేవలం కేదార్ ఒక్కడే ఉన్నారని.. అతన్ని వదిలిపెట్టోద్దని హోం సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చింది అని చెప్తాడు ఎస్సై. దీంతో కనీసం నా భర్తకు భోజనం అయినా పెట్టోచ్చా అని ధాత్రి అడుగుతుంది. పెట్టొచ్చని లాయర్ చెప్పగానే ఎస్సై కూడా పెట్టండి కానీ చెక్ చేశాకే పెట్టాలని చెప్పి తాను భోజనం చేస్తానని ఎస్సై భోజనం చేయబోతుంటే ఇంతలో సాధు ఫోన్ చేసి ఎస్సైని తిడతాడు. ఇక ధాత్రి భోజనం తీసుకుని కేదార్ కు వడ్డిస్తుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!