Jagadhatri Serial Today February 27th: ‘జగధాత్రి’ సీరియల్: మినష్టర్ భార్యను కొడుకుని పట్టుకున్న ధాత్రి – వైజయంతి మాటతో ఆగిపోయిన నిషిక
Jagadhatri Today Episode: మినిష్టర్ హత్య కేసులో కొనసాగుతున్న సస్పెన్స్ దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ మరింత ఆసక్తిగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ఆవిడ దృష్టిలో అందరూ బానిసలే మార్పు రాదని తెలిసే ఈ ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను. లేదంటే ఆయన పేరు మీద ఆస్థులు రాసి ఆయనను సీఈవో స్థానంలో కూర్చోబెడితేనే ఈ ఇంట్లో ఉంటాను అని నిషిక చెప్పడంతో వైజయంతి, యువరాజ్ షాక్ అవుతారు. సుధాకర్ రాగానే యువరాజ్‌ను కౌషికితో సమానంగా ఆఫీసులో కూర్చోబెట్టే బాధ్యత నాది అంతవరకు నువ్వు కొంచెం ఓర్చుకుని ఉండు అని వైజయంతి మాట ఇవ్వడంతో నిషిక సరే అత్తయ్యా నీ మాట మీద నమ్మకంతో నేను ఇక్కడే ఉండిపోతున్నాను అని చెప్పి ఆగిపోతుంది నిషిక. మరోవైపు కేదార్, ధాత్రి మినిస్టర్ పెళ్లాం కొడుకు అడ్రస్ ఉన్న చోటికి వెళ్తారు.
కేదార్: ప్రియా ఇచ్చిన అడ్రస్ ఇదే ధాత్రి.
ధాత్రి: తల్లీ కొడుకులు ఇద్దరూ ఇంట్లో ఉంటే బాగుండు.
లోపల మినిస్టర్ కొడుకు పెళ్లాం ఉంటారు. శివ తాగుతుంటాడు. వాళ్ల అమ్మా ఈ కేసు గొడవ సర్దుమనిగే వరకు కామ్‌గా ఉండమని చెప్తుంది. ఇంతలో కేదార్, ధాత్రి వచ్చి డోర్ కొడతారు. లోపలి నుంచి చూసిన శివ పోలీసుల్లా ఉన్నారు. జాగ్రత్తగా మాట్లాడి ఎలాగైనా పంపించేయ్ అని చెప్పి లోపలికి వెళ్లి దాక్కుంటాడు. కేదార్, ధాత్రి లోపలికి వస్తారు.
ధాత్రి: మీరు మినిస్టర్ గారు విడిపోయి చాలా రోజులైంది కదా?
మినిస్టర్ భార్య: రోజులు కాదమ్మా ఏండ్లు అవుతుంది. అయినా అది ఇప్పుడెందుకు అడుగుతున్నారు.
ధాత్రి: ఊరికే తెలుసుకుందామని..?
మినిష్టర్ భార్య: సరే ఏదో మాట్లాడాలని వచ్చారు కదా ఎంటి చెప్పండి.
ధాత్రి: మాట్లాడాల్సింది మీతో కాదండి. మీ అబ్బాయి శివతోటి
మినిష్టర్ భార్య: శివనా శివ ఇక్కడ లేడు దుబాయ్ వెళ్లాడు. రావడానికి ఇంకో సంవత్సరం పడుతుంది.
అని మినిష్టర్ భార్య చెప్పగానే టీపాయ్ మీద ఉన్న సిగరెట్ చూసి ఇదేంటి అని అడగ్గానే అది మా తమ్ముడు తాగుతాడు అని చెప్తుంది. వెంటనే కంగారుగా మీరు ఇక వెళ్లండి అని చెప్పడంతో ధాత్రి అయితే శివ పేరు మీద ఉన్న ఆస్థి పేపర్లు లాకర్ లో పెట్టమని లాయర్ గారికి చెప్తాము అని వెళ్తుంటే శివ బయటకు వచ్చి ఆగండి అని పిలుస్తాడు. దీంతో కేదార్ ఇప్పటివరకు మినిష్టర్ గారి హత్యకు నీకు సంబంధం ఉందా లేదా అని అనుమానం ఉండేది. ఇప్పుడు నువ్వే హత్య చేశావని క్లారిటీ వచ్చింది అని నిజం చెప్పు అని గద్దించగానే శివ వాళ్ల అమ్మ కారంపొడి కళ్లలోకి వేసి తప్పించుకుని పారిపోతుంటారు. ధాత్రి, కేదార్ వారిని చేజ్ చేసి పట్టుకుంటారు.
కేదార్: తప్పించుకోలేరు శివ లొంగిపోండి.
ధాత్రి: కారు దిగండి లేదంటే ఇక్కడే షూట్ చేస్తా .. కొంగులో కారం అదిరిందమ్మా అనంతమ్మా! పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? పెద్దావిడే కదా అని పద్దతిగా మాట్లాడితే మా నుంచే తప్పించుకోవాలని చూస్తావా?
మినిష్టర్ భార్య: ఇప్పుడు పట్టుకున్నావు ఏం చేస్తావు. ఏం చేయగలవు? మాజీ మినిస్టర్ కూతురుని, మినిస్టర్ భార్యని కాబోయే మినిష్టర్ తల్లిని నన్ను అరెస్ట్ చేసి ఏం చేస్తావు.
కేదార్: అరెస్ట్ ఎంటీ? మేము అరెస్ట్ చేస్తామని చెప్పలేదే
డైరెక్టుగా ఎన్‌కౌంటర్ చేస్తాం అని బెదిరించగానే మినిష్టర్ ను తాము చంపలేదని జరిగిన విషయం శివ, వాళ్ల అమ్మ చెప్తారు. అయితే మరి ఎవరు చంపారు? అని అడుగుతుంది ధాత్రి. పెంపుడు కొడుకు చంపి ఉండొచ్చని చెప్పడంతో ఎవరు పెంపుడు కొడుకు అని అడుగుతారు. ఎప్పుడూ ఆయన పక్కన ఉండే రాఘవే పెంపుడు కొడుకు. వాడే సొంత కొడుకైపోయాడు అని చెప్పగానే ధాత్రి, కేదార్ ఆలోచనలో పడిపోతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందా? అధికారుల వివరణ ఏంటంటే!