అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శ్రీవల్లి నిజస్వరూపం వేదవతి భర్తతో చెప్పేస్తుందా! ధీరజ్ వెంట పడుతున్న ప్రేమ!

 Illu Illalu Pillalu Serial Today Episode March 24th వేదవతి రామరాజుకి వల్లీ గురించి చెప్పాలని ప్రయత్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode ప్రేమ కడుపు నొప్పి అని కూర్చొండిపోతుంది. ఏమైంది అని నర్మద అడిగితే రెండు రోజుల నుంచి తినలేదు అక్క అందుకే ఇలా అయింది అని అంటుంది. ఎందుకు అని నర్మద అడిగితే ధీరజ్ నాతో మాట్లాడటం లేదు కదా అని అంటుంది. ధీరజ్ ఈ రోజు కాకపోతే రేపు మాట్లాడుతాడు కదా దానికే తినకపోతే ఎలా అంటుంది. వేదవతి ఆ మాటలు వింటుంది. అప్పుడే ధీరజ్ అటు వెళ్తే నర్మద అడుగుతుంది. కనీసం తను తిన్నాదో లేదో పట్టించుకోవా అంటే నా చెల్లి విషయంలో తను చేసిన పనికి తన ముఖం చూడటానికి కూడా ఇష్టం లేదు అని ధీరజ్ అంటాడు. తను మంచిది కాదు వదిన.. తన సాయం వెనక వాళ్ల అన్నయ్యకి సాయం చేయాలి అన్న ఆలోచన అని అంటాడు.

వేదవతి అన్నం తీసుకొని వెళ్తుంటే ధీరజ్ తల్లిని చూసి ఆ మొసలి కన్నీళ్లు చూసి జాలి పడకు అని అంటాడు. నువ్వు ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్‌రా అని అంటుంది. ఇక వేదవతి అన్నం తీసుకొని ప్రేమ దగ్గరకు వెళ్తుంది. ప్రేమ భోజనం చేయ్ అని అంటే ప్రేమ ఏడుస్తూ అత్త భుజం మీద వాలిపోతుంది. వేదవతి మనసులో ఆ వల్లీ వల్లీ మీ కాపురం ఇలా మారిపోయింది. దాన్ని వదలను అని అనుకుంటుంది. ప్రేమతో వాడి కోపం నీకు తెలుసు కదా తర్వాత వాడికి అంతా తెలిస్తే నిన్ను వదలడు అని అంటుంది. నువ్వు అయినా నన్ను అర్థం చేసుకున్నావ్ అత్త అది చాలు అని ప్రేమ అంటే అమ్మనే అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను.

అర్థం చేసుకోవడంతో పాటు ఎవరు ఎలాంటి వాళ్లో అని తెలుసుకున్నాను అని అంటుంది. నర్మద, ప్రేమ షాక్ అయి ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోవడం ఏంటి అని అడుగుతుంది నర్మద. నీది ఎంత గవర్నమెంట్ ఉద్యోగం అయితే మాత్రం అత్తగారినే ప్రశ్నిస్తావా అని వేదవతి నిజం చెప్పకుండా దాచేస్తుంది. ప్రేమ తినిపిస్తాను రావే అని తినిపిస్తుంది. తర్వాత నర్మదని కూడా పిలిచి నీకు తినిపిస్తాను రామ్మా లేదంటే మా అత్తయ్యకి మేనకోడలు అంటే ప్రేమ ఎక్కువ అని లేనిపోనివి అంటావ్ నీతో ఎందుకు ఈ గొడవ రామ్మా అంటుంది. ఇద్దరు కోడళ్లకి వేదవతి తినిపిస్తుంది.

ధీరజ్ హాల్‌లో చాప దిండు వేస్తే తిరుపతి వచ్చి ఏంట్రా అల్లుడు నువ్వు నా సామ్రాజ్యంలోకి వచ్చావ్ అంటే.. ఏంటి నీ సామ్రాజ్యం ఆస్తి పంపకాల్లో నీకు ఈ అరుగు మీ నాన్న రాసిచ్చాడా ఏంటి అని అడుగుతాడు. అవును ఇది నా అరుగే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడి నుంచి వెళ్లను అని   తిరుపతి కూడా అక్కడే పడుకుంటాడు. వేదవతికి శ్రీవల్లి చేసిన మోసం గుర్తొచ్చి నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది. రామరాజు లేచి ఏమైంది బుజ్జమ్మా ఏదైనా పీడకలా అని లేచి వేదవతికి మంచి నీరు ఇస్తాడు.

శ్రీవల్లి గురించి ఎలా చెప్పాలా అని అనుకుంటుంది. వేదవతి శ్రీవల్లి అనగానే రామరాజు భార్యతో మనం తెచ్చుకున్న కోడలు శ్రీవల్లి చాలా మంచిది.. మిగతా కోడళ్లలా కాదు.. తను మనల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని వల్లీని పొగుడుతుంది. వేదవతి ఇక భర్తని నిజం చెప్పకుండా మనసులో ఇక ఎప్పటికీ మీకు నిజం చెప్పలేను అని అర్థమైంది.. నిజం తెలిస్తే మీరు పెద్దోడు ఎలా తట్టుకుంటారా అర్థం కావడం లేదని బాధ పడుతుంది. 

ప్రేమ ధీరజ్‌ని ఎలా అయినా గదిలోకి రప్పించాలని ముసుగు వేసుకున్న ధీరజ్ తిరుపతిల దగ్గరకు వెళ్తుంది. తిరుపతినే 
ధీరజ్ అనుకొని బిందెలు ఇచ్చి కొడుతుంది. దాంతో తిరుపతి కుయ్యోముర్రో అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రేమ ధీరజ్‌ని గదిలోకి పిలుస్తుంది. ధీరజ్ రాను అనడంతో నేను ఇక్కడే పడుకుంటా అని అంటుంది. ధీరజ్ అక్కడి నుంచి వెళ్లిపోతుంటే వెంట పడుతుంది. ఇద్దరూ కోపమా నా పైనా అని డ్యూయెట్ వేసుకుంటారు. తర్వాత ధీరజ్ పడుకుంటే ప్రేమ వచ్చి పక్కనే పడుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget