అన్వేషించండి

Jagadhatri Serial Today March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?

Jagadhatri Serial Today Episode March 23th: మీనన్‌ గుట్టు బయటకు తీయడానికి జేడీ వేసిన ప్లాన్ ఏంటి..? కౌషికి షేర్లు నిషక వాళ్ల పేరిట రాసిందా..? లేదా..?

Jagadhatri Serial Today Episode: కౌషికి భూమి అమ్మడానికి ప్రయత్నిస్తుండగా...కమలాకర్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో భూమి కొనుగోలు చేసేవాళ్లు కుదరదని చెబుతారు. ఇంట్లో అందరూ సంతకాలు పెడితేనే ఈ భూమి కొనుగోలు చేస్తామని అంటారు. దీంతో చేసేది లేక కౌషికి వాళ్లను వెళ్లిపొమ్మని చెబుతుంది. దీంతో వైజయంతి,నిషిక, యువరాజు ఆనందంగా తమ గదికి వెళ్లిపోతారు. ఇదంతా నిషిక వాళ్ల ప్లాన్‌ అని అనుమానంగా ఉందని కేదార్ అనగా...ఈ వ్యవహారం నిషికకు తెలియదని ధాత్రి అంటుంది. 
 
తమ రూమ్‌లోకి వెళ్లగానే వైజయంతి అసలు విషయం చెబుతుంది. మీ బాబాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్పింది తానేనని అంటుంది. కమలాకర్‌ను రాత్రి కలిసి నేనే ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని చెప్పానని అంటుంది. నువ్వు లేకుంటే సంతకం పెట్టేవాళ్లు లేక వాళ్లు భూమిని కొనుగోలు చేయరని...అప్పుడు కౌషికి ఓడిపోయి కంపెనీ మన పేరిట వస్తుందని అనడంతో కమలాకర్ ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. తల్లి తెలివితేటలకు యువరాజు ఆమెను మెచ్చుకుంటాడు. ఇక ఈ కంపెనీకి నువ్వు సీఈవో కాకుండా ఆపే దమ్ము ఎవరికీ లేదని వైజయంతి కొడుకుని చూసి మురిసిపోతుంది.
     
మీనన్ బతికే ఉన్నాడన్న విషయం డిపార్ట్‌మెంట్‌లో కూడా ఎవరికీ చెప్పొద్దన్నవ్...ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావని సాధూసార్ జేడీని అడుగుతాడు. మీనన్‌ను కాల్చింది నేనే, చచ్చిపోయాడని ప్రెస్‌కు చెప్పింది కూడా మనమేనని జేడీ అంటుంది. ఇప్పుడు మీనన్ బతికే ఉన్నాడని మనం చెబితే ప్రజలు నమ్మరని...అదే మీనన్ ధైర్యమని జేడీ అంటుంది. మనతోనే వాడు చచ్చిపోయాడని చెప్పించి... ఇప్పుడు చీకటిలో ఉండి తప్పుడు పనులు చేయాలని చూస్తున్నాడని అంటుంది. 
 
కాబట్టి వాడిని చీకటిలో నుంచి వెలుగులోకి వాడంతట వాడే వచ్చేలా చేయాలని అంటుంది. దీనికి ఏం చేద్దామంటే ఆపరేషన్ డ్రాగన్ చేపడదామని చెబుతుంది. ఈ ధనలక్ష్మీ అనే లేడీ దొంగను మనం బయటకు విడుదల చేసి మీనన్ భార్యగా చెలామణి అయ్యేలా చేద్దామని చెబుతుంది. అండర్‌వరల్డ్ డాన్‌ అవుదామని కలలుకని చిన్నచిన్న దొంగతనాలు చేసి పోలీసులకు దొరికిపోవడం ఈ డ్రాగన్‌ స్టైల్‌ అని అంటుంది. ఈవిడను  బయటకు వదిలి మీనన్ భార్యగా ప్రచారం చేస్తే...అది తట్టుకోలేక మీనన్ బయటకు వచ్చేస్తాడని జేడీ చెప్పడంతో సాధూ సరేనంటాడు.
 
అనుకున్న సమయానికి డబ్బులు కట్టకపోవడంతో తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారు ఢీల్‌ క్యాన్సిల్ చేస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పడంతో కౌషికి చాలా బాధపడుతుంది.ఆ ప్రాజెక్ట్‌లో ఇప్పటికే 50కోట్లు పెట్టుబడి పెట్టామని...అలా మధ్యలో ఎలా వదిలేస్తారని కౌషికి అంటుంది.అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక.....నువ్వు కంపెనీ నడిపేస్థితిలో లేవని అనడంతో ధాత్రి అక్కడికి వచ్చి నిషికను మందలిస్తుంది.ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం వదిన కష్టార్జితమని చెబుతుంది. అయినాగానీ ఇలా కంపెనీకి నష్టాలు తెస్తుంటే రేపు మా పరిస్థితి ఏంటని నిషిక నిలదీస్తుంది. అందుకే కంపెనీలో సగం షేర్లు మా పేరిట రాయమని కోరుతుంది. మాకు కూడా ధైర్యంగా ఉంటుందని చెబుతుంది. 
 
ఇంతలో వైజయంతి కలుగజేసుకుని ఈ ఢీల్ క్యాన్సిల్ అయితే కంపెనీలో సగం షేర్లు రాసిస్తానని మాటిచ్చావు కదా అని గుర్తుచేస్తుంది. దీంతో చేసేదిలేక కంపెనీ షేర్లు రాయడానికి కౌషికి ఒప్పుకుంటుంది. వాళ్లు పేపర్లు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో జగధాత్రి కౌషికి వారిస్తుంది. ఇప్పుడు సగం షేర్లు వారి పేరిట రాశామంటే....రేపు సీఈవోను కూడా మార్చాలని పట్టుబడతారని అంటుంది. ఏదీఏమైనా నేను ఇచ్చిన మాట తప్పనని కౌషికి అంటుంది.అయితే ఒక కండీషన్ పెట్టమని జగధాత్రి సూచిస్తుంది. ఈ షేర్లు వాళ్ల భయం పోగొట్టడానికే తప్ప...అమ్మడానికి వీళ్లేదని చెప్పమని చెబుతుంది. దీంతో సగం షేర్లు నిషిక వాళ్ల పేరిట రాసిన కౌషికి....వాటిని అమ్మడానికి వీళ్లేదని మెలిక పెట్టడంతో నిషిక మండిపడుతుంది. ఇదంతా జగధాత్రి కుట్రేనని కోపంతో రగిలిపోతుంది. అమ్మడానికి వీళ్లేని షేర్లు మాకు  ఎందుకని అడగ్గా....ఇది కేవలం మీ సెక్యూరిటీ కోసమేనని చెబుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget