అన్వేషించండి

Guppedantha Manasu March 20th Episode: కేజీఎఫ్ BGM తో పిండేశారు - అనుపమ గతం గురించి చెప్పనున్న మను , గుప్పెడంత మనసు మార్చి 20 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 21st ఎపిసోడ్)

కత్తిపోటు నుంచి మనుని కాపాడబోయి అనుపమ బలవుతుంది... ఆసమయంలో మను...అమ్మా అని అరవడంతో అక్కడే ఉన్న మహేంద్ర, వసు షాక్ అవుతారు. అనుపమని హాస్పిటల్ కి తీసుకెళ్తారు..మను గతాన్ని గుర్తుచేసుకుంటాడు, అమ్మా అని పిలవొద్దన్న మాట తలుచుకుని బాధపడతాడు. మరోవైపు మహేంద్ర, వసుధార...మనుకి అనపమ అమ్మా? మరి అనుపమ భర్త ఎవరు? ఈ బంధం ఇన్నాళ్లు ఎందుకు బయటపెట్టలేదు? అని ఆలోచనలోపడతారు. మను మాత్రం అనుపమ కోసం కంగారుగా డాక్టర్ ని ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు...

Also Read: రిషి-జగతి లానే మనుని కాపాడబోయి బలైన అనుపమ, బయటపడిన బంధం - గుప్పెడంత మనసు మార్చి 19 ఎపిసోడ్!

మరోవైపు రౌడీపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. నీకేం చెప్పాను నువ్వేం చేశావ్ అని ఆగకుండా క్లాస్ వేస్తూనే ఉంటాడు. 
రాజీవ్: వాడు పోటుగాడు అది ఇది అన్నావ్ ఇప్పుడు వీడు ఏం చేశాడో చూడు..నీకెందుకురా ఇంత బిల్డప్
రౌడీ: తను నాకు పనిచ్చాడు, డబ్బులిచ్చాడు..ఎవడు పడితే వాడు బెదిరిస్తే ఊరుకునేది లేదు...
శైలేంద్ర: చెప్పిన పని చేయడం రాదుకానీ వెధవ బిల్డప్ లు ఎందుకు? మిడిల్ డ్రాప్ ఉండదన్నావ్...చివరకు ఏమైంది...
రౌడీ: నేను కథలోనకి ఎంటరైన ప్రతిసారీ మీకు ఏదో ఒక కొత్త విషయం మీకు తెలుస్తోంది కదా...
( గతంలో రిషిపై అటాక్ చేసిన టైమ్ లో అనుపమని చూపిస్తాడు...ఇప్పుడు మను- అనుపమ కొడుకు అని తేలింది)...
ఇప్పుడు మిస్సైనా నా టార్గెట్ మరోసారి మిస్సవదు అని చెప్పేసి వెళ్లిపోతాడు...
అనుపమను మను అమ్మా అని పిలిచిన విషయం రాజీవ్ కి చెబుతాడు శైలేంద్ర...
రాజీవ్: ఇన్నాళ్లీ బంధం ఎందుకు దాచిపెట్టారు? ఆమెకు పెళ్లి కాలేదు అన్నారు కదా ఈ కొడుకు ఎలా వచ్చాడు?
శైలేంద్ర: ఆ రౌడీ చేసిన పనికి నా మైండ్ పనిచేయడం లేదు...నువ్వు బుర్రతినకు
రాజీవ్: అయినా వాడి గురించి నాకు అవసరం లేదు..నాకు నా మరదలే ముఖ్యం...నువ్వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్పేసి రాజీవ్ వెళ్లిపోతాడు...

Also Read: మను కూడా రిషిలానే జగతి-మహేంద్ర కొడుకేనా, అనుపమ ఇవ్వబోయే టిస్ట్ ఇదేనా!

ఇంతలో అనుపమ పెద్దమ్మ అక్కడకు వచ్చి మనుని ఓదార్చుతుంది... అనుపమకు ఎలా ఉంది? ఇదెలా జరిగింది? అని అడుగుతుంది
మను: నా ప్రాణం కాపాడేందుకు తన ప్రాణం అడ్డువేసింది...
ఇంతలో డాక్టర్ రావడంతో ఎలా ఉందని అడుగుతారు..రక్తం ఎక్కువ పోయింది..ప్రాణాలకు ప్రమాదం లేదని చెప్పడంతో మను హమ్మయ్య అనుకుంటాడు..
మను: ఓల్డీ ( అనుపమ పెద్దమ్మ)..నేను ఆవిడకు ఇచ్చిన మాట తప్పాను ( అమ్మా అని పిలిచాడు) ఆవిడ వద్దన్న పని చేశాను
ఓల్డీ: ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్నా...
మను: నువ్వు ఎక్కువ సేపు ఇక్కడ ఉండలేవు..నేను చూసుకుంటానులే..
ఓల్డీ: నేను వెళ్లలేను ఇక్కడే ఉంటాను..
మను: నేను తనని నీ దగ్గరకు తీసుకొస్తాను.. నాకు వీళ్లందరూ తోడుగా ఉన్నారు..
మహేంద్ర: మనుకి మేం తోడుగా ఉంటాం మీరు బయలుదేరండి..

మహేంద్ర-వసుధారకి అస్సలేమీ అర్థంకాక మొహాలు చూసుకుంటారు.... మళ్లీ ఆలోచనలో పడతారు...

Also Read: హోలీ రోజు చంద్రగ్రహణం - మరి హోలీ జరుపుకోవచ్చా!

మను పీఏ వచ్చి వసుధారని కలుస్తాడు. మీరు మా సర్ ని అపార్థం చేసుకున్నారు అంటాడు
వసు: మేం ప్రాజెక్ట్ పనిపై వెళ్లిన విషయం నాకు-ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు, లేదంటే మీరు తీసి ఉండాలి...
అప్పుడు మను పీఏ ...రాజీవ్ పోస్టర్స్ అంటిస్తున్న వీడియో వసుధారకి చూపిస్తాడు...అది చూసి వసుధార షాక్ అవుతుంది...
మను పీఏ: ఈయన ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్నప్పుడే మేం చూశాం...తనకి బుద్ధి చెప్పాలనే తను అంటించిన పోస్టర్స్ విషయంలో మీకుబర్త్ డే విశెష్ పోస్టర్స్ అంటించాం..ఆ విషయంలోనూ మీరు సర్ పై సీరియస్ అయ్యారు..జరిగింది అది...కానీ సర్ నోరుతెరిచి మాట్లాడలేదు. ఆయన చేసిన మంచిపని గురించి చెప్పరు...అందుకే ఆయన్ని దోషి అనుకుంటారు...మనల్ని నమ్మేవారు మనల్ని అర్థం చేసుకుంటే చాలని అనుకుంటారు. ఓ పెద్ద తప్పు జరగబోతుంటే ఆ తప్పు జరగకుండా ఆపారు అని క్లారిటీ ఇచ్చేసి వెళ్లిపోతాడు...

దేవయాని -శైలేంద్ర
మను అనుపమ కొడుకా? తనకి అసలు పెళ్లి కాలేదు అంటుంది. నీకు తెలియకుండా జరిగి ఉంటుందేమో అనుకుంటారు. వందశాతం చెబుతున్నా అనుపమకి పెళ్లికాలేదంటుంది దేవయాని. అసలు వాడు నిజంగానే పిలిచాడా, ఏమోషన్లో పిలిచాడా అని దేవయాని లాజిక్ లాగుతుంది. అసలు అనుపమకి కొడుకు ఎలా వచ్చాడు? వాడు నిజంగా తనకి పుట్టిన కొడుకేనా? దత్తత తీసుకుందా? మరేదైనా కారణం ఉందా?... దాని గురించి ఎందుకింత ఆలోచిస్తున్నావ్ అంటాడు శైలేంద్ర... ఒకవేళ తను అనుపమ కొడుకే అయితే ఎక్కడుంటాడు, తనకి మనకు ఏమైనా సంబంధం ఉందా? అనుపమ నిజం దాచిందంటే ఏదో రహస్యం ఉండే ఉంటుంది అంటుంది దేవయాని. అది తెలుసుకోవాలని ఫిక్సవుతారు....

Also Read: నేటి రాశి ఫలాలు (20/03/2024) - ఈ రాశులవారు గత తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన టైమ్ ఇది!

వసుధారకి నిజం తెలిసినప్పటి నుంచీ తనలో తానే బాధపడుతుంది...ఇంతలో ఏంజెల్ వస్తుంది. డాక్టర్ పర్వాలేదని చెప్పారు అని చెబుతుంది.  మను గారు అనుపమ మేడం కొడుకు అని ఏంజెల్ కి చెబుతుంది వసుధార. షాక్ అవుతుంది...
ఏంజెల్: మా అత్తయ్య కొడుకా..మా అత్తయ్యకి పెళ్లికాలేదు కదా, మా తాతయ్య కూడా ఎప్పుడూ చెప్పలేదు, అసలు నాకేం అర్థం కావడం లేదు
వసు: మాక్కూడా అదే అర్థం కావడం లేదు...అసలు తను అనుపమ మేడం కొడుకేంటి...మేం కూడా అదే ఆలోచనలో ఉన్నాం...కానీ మొదట్నుంచీ మనం అనుకుంటున్న అనుమానం క్లియర్ అయింది. ఇద్దరి మధ్యా ఏదో రిలేషన్ ఉందని....
ఏంజెల్: నేను అత్తయ్యని అడిగాను, మనుని కూడా అడిగాను కానీ చెప్పలేదు...
వసు: ఎందుకు పరిచయం లేనివాళ్లలా ఉన్నారో అర్థం కావడం లేదు...
అంటే మను నాకు బావ అవుతాడా...అనుకుంటుంది ఏంజెల్... అసలు ఏం జరిగింది మను అని మహేంద్ర అడుగుతాడు... మను మాత్రం సైలెంట్ గా ఉండిపోతాడు... తను కూడా ఏదీ చెప్పదు, అన్నీ దాస్తుంది నువ్వు కూడా అలాగే దాస్తున్నావా? అని అడుగుతాడు.. చెప్పు మను ఈ విషయం ఎందుకు చెప్పలేదని ఏంజెల్ కూడా అడుగుతుంది...
 
గుప్పెడంత మనసు ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది...

గుప్పెడంత మనసు మార్చి 21 ఎపిసోడ్ (Guppedantha Manasu March 20th Episode)లో అనుపమ-మను ఫ్లాష్ బ్యాక్ గురించి స్టోరీ ఉండబోతోంది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP DesamAus vs Ind Sydney Test Day 3 Highlights | సిడ్నీ టెస్టులో భారత్ కు పరాభవం | ABP DesmISRO CROPS Cowpea Sprouted in Space | స్పేడెక్స్ ప్రయోగంతో భారత్ అద్భుతం | ABP DesamGuntur Municipal Commissioner Throw Mic | మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మైక్ విసిరేసిన కమిషనర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Police Notice To Allu Arjun: అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు, ఏదైనా జరిగితే బాధ్యత ఆయనదేనన్న పోలీసులు
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Human Metapneumovirus : శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
శ్వాసకోస వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనాలో పరిస్థితి సాధారణమేనన్న కేంద్రం
Daaku Maharaaj Ticket Price Hike: ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
ఏపీలో డాకు మహారాజ్‌ మూవీ టికెట్ల ధర పెంపు, లేటెస్ట్ రేట్లు ఇలా
Ind Vs Aus Sydney Test Live Updates: టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
టీమిండియాను కంగారూలు కొట్టేశారు, బీజీటీని కైవసం చేసుకున్న ఆసీస్- ఐదో టెస్టులో 6 వికెట్లతో గెలుపు
Maha Kumbh Mela 2025 : మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
మహా కుంభమేళా కోసం ప్రత్యేక రైళ్లు, 40 కోట్ల మంది వస్తారని అంచనా- సీపీఆర్వో
Daaku Maharaaj Trailer: 'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
'డాకు మహారాజ్' ట్రైలర్ వచ్చేసింది... బాలయ్య ఒక్క డైలాగ్ చెప్పలేదు కానీ మామూలు మాసీగా లేదు
Embed widget