అన్వేషించండి

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు (20/03/2024) - ఈ రాశులవారు గత తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాల్సిన టైమ్ ఇది!

Horoscope Tomorrow's Prediction 20 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 20th 2024   

మేష రాశి

ఈ రోజు వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోండి. కుటుంబం, స్నేహితుల సహకారంతో కెరీర్ పురోగతికి కొత్త అవకాశాలు ఉంటాయి. జీవితంలో వచ్చే సమస్యలు దూరమవుతాయి.  తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కార్యాలయంలో కొత్త బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు ..ఓపిక పట్టండి . (మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

వృషభ రాశి వారికి కుటుంబ సమస్యలు ఉండవచ్చు.ఉద్యోగులు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి.  కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల సలహాలు విస్మరించవద్దు. సంబంధాలలో పరస్పర అవగాహన  సమన్వయాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ( వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

కుటుంబ జీవితంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. వృత్తి జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. సంబంధాలలో ప్రేమ నమ్మకం పెరుగుతుంది. మీ భాగస్వామితో మానసిక బంధం బలంగా ఉంటుంది.  వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు (మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

 కర్కాటక రాశి

జీవితంలో సంతోషం, శ్రేయస్సు  ఉంటుంది.  వ్యాపార సంబంధిత నిర్ణయాలను మరోసారి ఆలోచించి ఫైనల్ చేసుకోవాలి. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాలను పరిష్కారం దిశగా అడుగుపడుతుంది. కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. (కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి

ఈ రోజు ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. సోమరితనానికి దూరంగా ఉండండి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి.  కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు.  అప్పులు తీసుకోవద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

Also Read: ఉగాది నుంచి ఈ రాశివారికి చుక్కలే - మనోధైర్యమే మిమ్మల్ని నడిపించాలి - శ్రీ క్రోధి నామ సంవత్సర వార్షిక ఫలితాలు!

కన్యా రాశి

బంధాలతో అపార్థాలు తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. భాగస్వామితో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల సహకారంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ ఆలోచనలకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కల ఫలిస్తుంది. 

తులా రాశి

రోజు మీకు సాధారణంగానే ఉంటుంది.  అదనపు  బాధ్యతలు పొందుతారు. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదుర్కొంటారు.  న్యాయపరమైన వ్యవహారాల్లో అనవసర చర్చ పెట్టొద్దు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఆలోచనల్లో సానుకూలత ఉండేలా చూసుకోండి. 

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

వృశ్చిక రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. మీరు సంబంధాలలో భావోద్వేగంగా కనిపిస్తారు. ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కెరీర్‌లో కొత్త మార్పులు వస్తాయి. మీరు అన్ని పనులలో ఆశించిన ఫలితాలను పొందుతారు.  ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మదింపు అవకాశాలు పెరుగుతాయి.

ధనుస్సు రాశి

ఈ రోజు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు. పిల్లల ఆరోగ్యం గురించి మనస్సు ఆందోళన చెందుతుంది.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి కొత్త అవకాశాల గురించి ఆలోచిస్తారు. రాజకీయ నాయకులకు ఈరోజు శుభదినం. ఉద్యోగ, వ్యాపారాలలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి.

మకర రాశి
 
ఈ రాశివారికి పని ఒత్తిడి పెరగవచ్చు. కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. మీ పనులపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అప్పులు ఇవ్వొద్దు. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈరోజు మంచిది. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి ఉంటుంది. 

కుంభ రాశి

మీరు వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవలసి రావొచ్చు. ఈ రోజు వ్యాపార సంబంధిత నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండండి. మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజు బదిలీ జరిగే అవకాశం ఉంది. 

Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!

మీన రాశి

మీపట్ల మీకు విశ్వాసం మరింత పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉండేవారు ఎవ్వర్నీ గుడ్డిగా నమ్మేయవద్దు. పనిలో ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి.  విద్యార్థులు పరీక్షలలో సానుకూల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget