అన్వేషించండి

Guppedantha Manasu March 19th Episode: రిషి-జగతి లానే మనుని కాపాడబోయి బలైన అనుపమ, బయటపడిన బంధం - గుప్పెడంత మనసు మార్చి 19 ఎపిసోడ్!

Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

Guppedantha Manasu Serial Today Episode:  (గుప్పెడంతమనసు మార్చి 19th ఎపిసోడ్)

 మను టేబుల్ పై కొత్తజంట పోస్టర్స్ చూసి అనుపమ-వసుధార ఇద్దరూ అపార్థం చేసుకుంటారు. మను చెప్పాలనుకున్నది కూడా వినరు. కాలేజీ నుంచి వెళ్లిపోమని ఆర్డర్ వేస్తారు. మను ఏమీ మాట్లాడలేక ఆగిపోతాడు. అయితే ఇదంతా చూసి సంతోషించిన శైలేంద్ర... రాజీవ్ కి కాల్ చేసి గుడ్ న్యూస్ చెబుదాం అనుకుంటే..అప్పటికే రాజీవ్ కి సమాచారం చేరిపోతుంది...

శైలేంద్ర: కాలేజీకి లేని అప్పు నేను సృష్టిస్తే వాడు అది తీర్చినట్టు బిల్డప్ ఇచ్చి దేవుడు అయిపోయాడు
రాజీవ్: బోర్డ్ మెంబర్ గా జాయిన్ అయ్యాడు.. వసు బర్త్ డే కూడా చేశాడు కదా
శైలేంద్ర: వాడు గట్టిగానే ప్రయత్నించాడు కానీ ఇలాంటిది జరుగుతుందని ఊహించి ఉండడు
రాజీవ్: కాలేజీలోకి ఎంత తొందరగా ఎంటరయ్యాడో..వసు మనసులోకి కూడా అంతే త్వరగా వచ్చాడు..ఎట్టకేలకు వెళ్లిపోతున్నాడు చాలు.. లేదంటే ప్రతి దానికీ అడ్డుపడుతున్నాడు.ఇక వాడు అడ్డు తొలగింది..
శైలేంద్ర: నేను ఎవడికి అయితే టాస్క్ ఇచ్చానో వాడికి కాల్ చేసి ఆపేయమని చెబుతానంటూ...మనుని చంపమన్న రౌడీకి కాల్ చేసి వాడిని వదిలేమంటాడు
రౌడీ: నేను కమిటయ్యాడ మిడిల్ డ్రాప్ ఉండదు... వాడిని వేసేసి మీకు కాల్ చేస్తానని చెప్పి కట్ చేస్తాడు...

Also Read: 

అనుపమ కొట్టిన చెంపదెబ్బలు, అనుపమ-వసు అన్న మాటలు గుర్తుచేసుకుంటూ కాలేజీ నుంచి బయటకు దీనంగా నడుస్తూ వెళుతుంటాడు.. అప్పుడే మహేంద్ర ఎంట్రీ ఇస్తాడు...
మహేంద్ర: ఎక్కడికి వెళుతున్నావ్... ఏంటి డల్ గా ఉన్నావ్..మా అందర్నీ హ్యాపీగా ఉంచి నువ్వుడల్ గా కనిపిస్తున్నావ్ ఏంటి..
మను: అదేం లేదుసర్
మహేంద్ర: నేను రిషి కోసం చేయించిన కంకణం ఇది..సరైన సమయం చూసి తనకి ఈ కంకణం తొడగాలి అనుకున్నాను. రిషి లేని సమయంలో మాకోసం మా సంతోషం కోసం ప్రయత్నిస్తున్న నీకు ఈ కంకణం తొడగాలి అనుకుంటున్నాను 
మను ఏమోషనల్ గా నిల్చుంటాడు..అనుపమ, వసుధార వాళ్ల మాటలు వింటుంటారు
మను; వద్దు సర్..నాకు ఇలాంటివి ఇష్టం లేదు..
మహేంద్ర: నీ మాటల్లో ఇష్టం లేదని వినిపించినంతమాత్రాన నీ మనసుకి ఇష్టం లేదనుకోను..నువ్వు ఇష్టం లేదన్నంతమాత్రాన నేను వదిలిపెట్టను.. వసుధార బర్త్ డే సెలబ్రేషన్ ఇష్టం లేదంది..కానీ నువ్వు సెలబ్రేషన్ చేసి నువ్వు మెప్పించావ్ కదా...
మను: అది వేరు ఇది వేరు ఏమీ అనుకోకండి సర్..మీరు నాపై చూపిస్తున్న ప్రేమకి థ్యాంక్స్ సర్..
శైలేంద్ర కూడా చాటుగా వింటుంటాడు...
మను: మీరు నన్ను కొడుకుగా ఎలా ఫీలవుతున్నారో నేను కూడా మిమ్మల్ని ఫాదర్ లా, గురువులా ఫీలవుతున్నాను...
మహేంద్ర: నేను మాట్లాడుతుంటే వస్తువులు ప్యాక్ చేయమంటున్నావ్..ఎక్కడికి వెళుతున్నావ్
మను: నేను ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది...నేను వెళ్లిపోతున్నా
మహేంద్ర: వెళ్లొస్తా అనాలి కదా
మను: మళ్లీ వచ్చే ఉద్దేశం లేదు..నేను వచ్చినా కానీ చాలామందికి ఇక్కడ నచ్చదు..వెళ్లిపోతున్నా సర్..థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్..
అసలు ఏం జరిగిందని మహేంద్ర అడుగుతాడు కానీ మను చెప్పడు...

Also Read: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మనుని కాలేజ్‌ నుంచి వెళ్లగొట్టిన అనుపమ – కొత్తజంట అంటూ కాలేజీలో మను, వసుల ఫోటోలు

మను వెళ్లిపోయిన తర్వాత..అనుపమ దగ్గరకు వెళ్లి నిలదీస్తాడు మహేంద్ర...
అనుపమ: తనే వచ్చాడు వెళ్లాలి అనుకున్నాడు వెళుతున్నాడు
మహేంద్ర: సడెన్ గా వెళ్లిపోతున్నా అని ఎందుకు అంటున్నాడు
నీకేమైనా తెలుసా వసుధారా అని ప్రశ్నిస్తాడు...

కాలేజీ నుంచి దీనంగా బయటకు వచ్చిన మనుని...శైలేంద్ర పురమాయించిన రౌడీ చూస్తాడు..అటాక్ చేసేందుకు ఇదే మంచి సమయం అని ఫిక్సవుతాడు.. శైలేంద్ర చెట్టుచాటు నుంచి గమనిస్తుంటాడు... రౌడీ కత్తి తీసుకుని అటాక్ చేసేందుకు పరిగెత్తుతూ వస్తుంటాడు... ఆ రౌడీని గమనిస్తుంది అనుపమ...( గతంలో వసుధార-రిషిపై అరకులో దాడి చేసిన వాడే)..మనుని తప్పించబోయి ఆ కత్తిపోటు అనుపమై పడుతుంది...
 అది చూసి మను వెంటనే అమ్మా అని అరుస్తాడు...
అప్పుడే అక్కడకు  వచ్చిన మహేంద్ర-వసుధార అమ్మా అనే పిలుపువిని షాక్ అవుతారు... వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తారు...
అదే మాట విన్న శైలేంద్ర కూడా అంటే వీడు అనుపమ కొడుకా అనుకుంటాడు...

Also Read: 'వకీల్ సాబ్' సాంగేసుకున్న మను-ఏంజెల్ , అనుపమపై ఫోకస్ పెట్టిన మహేంద్ర-వసు, గుప్పెడంత మనసు మార్చి 16 ఎపిసోడ్

మను గతంలో జరిగిన సంఘటన గుర్తుచేసుకుంటాడు..
నువ్వు నన్ను అమ్మా అని పిలవొద్దు - మనమధ్య ఏం బంధం లేదు - నాకంటూ ఎవరూ లేరు..నీకూ ఎవరూ లేరు అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది
మను: నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను..పొరపాటు జరిగింది నన్ను క్షమించమ్మా 
అనుపమ: మను చేయి తీసి తలపై ఒట్టువేయించుకుంటుంది..మరోసారి నన్ను అమ్మా అని పిలిచావంటే నేను చచ్చినంత ఒట్టు అంటుంది
మను ఏమీ మాట్లాడలేక ఆగిపోతాడు... అది గుర్తుచేసుకుంటాడు మను... ఐసీయూలో ఉన్న అనుపమని చూసి బాధపడతాడు...
( ఇంతకీ మను అంత పెద్ద తప్పు ఏం చేశాడో ..వీళ్ల గతం ఏంటో ఇంకా రివీల్ కాలేదు)

గుప్పెడంత మనసు మార్చి 19 ఎపిసోడ్ ముగిసింది....

గుప్పెడంత మనసు మార్చి 20 ఎపిసోడ్ లో మను-అనుపమ గతం రివీల్ కానుంది....

Also Read: నేటి రాశి ఫలాలు (19/03/2024) - ఈ రాశులవారు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మంచిది!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 15th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీనే సిరి..సంధ్యకి తెలిసిపోయిన నిజం! ముఖం చూసి కుప్పకూలిపోయిన లక్ష్మీ!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget