Guppedantha Manasu March 16th Episode: 'వకీల్ సాబ్' సాంగేసుకున్న మను-ఏంజెల్ , అనుపమపై ఫోకస్ పెట్టిన మహేంద్ర-వసు, గుప్పెడంత మనసు మార్చి 16 ఎపిసోడ్
Guppedantha Manasu Serial Today: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Guppedantha Manasu Serial Today Episode: (గుప్పెడంతమనసు మార్చి 16th ఎపిసోడ్)
భోజనం చేద్దుగానివి రా అని మనుని పిలుస్తుంది అనుపమ పెద్దమ్మ...కానీ నాకు ఆకలి లేదు ఓల్డీ అనేస్తాడు మను. ఎదుటివాళ్ల ఆనందంతో కడుపునింపుకున్నావా.. ఎదుటి వాళ్ల ఆనందంలో కూడా సంతోష పడే వాళ్లని నిన్నే చూస్తున్నా అంటుంది. వసుధార బర్త్ డే ఎలా జరిగింది? ఎవరెవరు వచ్చారంటూ వరుస ప్రశ్నలు వేస్తుంది... వచ్చిన వారి లిస్ట్ అంతా చెబుతాడు కానీ అనుపమ పేరు చెప్పడు... అనుపమ వచ్చిందా అని అడిగితే తను కూడా కాలేజీ స్టాఫ్ కదా అని రిప్లై ఇస్తాడు. నీతో ఏమైనా మాట్లాడిందా అని అడిగితే అలాంటిది ఏమీ జరగలేదు నువ్వు అనవసరమై ఆశలు పెట్టుకోకు అనేస్తాడు. అయినా నాకు కావాల్సిన సమాధానం రానంతవరకూ ఎన్ని మాటలు మాట్లాడినా ఎంత సేపు మాట్లాడినా ఉపయోగం లేదు..నేను ఈ జన్మకు ప్రశ్నలతోనే మిగిలిపోవాల్సి ఉంటుందేమో .. నేను బతికి ఉన్నంతవరకూ అది జరగదేమో అని బాధపడతాడు. అనుపమ పెద్దమ్మ కూడా మనుని చూసి చాలా బాధపడుతుంది...
వసుధార ఇంట్లో కూర్చుని ఆలోచనలో పడుతుంది.. తాను ఒంటరిదాన్ని అన్న అనుపమ మాటలు గుర్తుచేసుకుంటుంది. ఇంతలో మహేంద్ర రావడంతో అనుపమ గురించి ఆరాలు మొదలెడుతుంది.. ఇప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నావ్ అంటాడు మహేంద్ర
వసు: ఆమె గురించి మీకు అన్ని విషయాలు తెలుసా
మహేంద్ర: నాకు అన్ని తెలుసు కానీ ఈ మధ్యే అనిపిస్తోంది అన్నీ తెలియదని
వసు: ఆమెలో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తోంది..మనుని చూసినప్పటి నుంచీ ఆమెవో ఏదో మార్పొచ్చింది.. ఆమెను చివరి సారిగా ఎప్పుడు కలిశారు, ఆమె మీకు కాంటాక్ట్ లో ఎందుకు లేదు
మహేంద్ర: జగతి కడుపుతో ఉన్నప్పుడు అనుపమ జాగ్రత్తగా చూసుకుంది..నీ రుణం తీర్చుకోలేనని అన్నాను..మనం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతుండేది. కానీ ఉన్నట్టుండి అనుపమ కనిపించలేదు..తనకోసం చాలా వెతికాం..తను ఎందుకు వెళ్లిపోయిందో తెలియలేదు.. ఆ త ర్వాత మళ్లీ అరకులో అలా సడెన్ గా ప్రత్యక్షమైంది..అప్పటికే జగతి దూరమైంది..జగతి విషయంలో తను నన్ను ఎలా నిలదీసిందో తెలుసు.. ఇప్పుడు రిషి కనపడడం లేదు..నా తలరాత ఏంటో ఇలా ఉంది ...
బాధపడొద్దు మావయ్యా..నేను రిషి సర్ ని తీసుకొస్తానని ఓదార్చుతుంది..
మహేంద్ర: జగతి దూరమైంది, రిషి కనిపించలేదు..అన్నయ్య మాట కాదనలేక రిషికి కర్మకాండలు జరిపించేందుకు సిద్ధమయ్యాను, నిన్ను చాలా బాధపెట్టాను నన్ను క్షమించమ్మా...
వసు: మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో నాకు తెలుసు ఆ విషయం వదిలేయండి అంటుంది..
మీరు డిస్సప్పాయింట్ అవొద్దు మావయ్య అంటుంది..
Also Read: ఈ 3 రాశుల రాజకీయ నాయకులు ఎంత ఖర్చుచేసినా ఓటమి తప్పదు!
అనుపమ గురించి డిస్కషన్
అనుపమ ఏదో దాస్తోంది కానీ అదేంటో తెలియడం లేదని మహేంద్ర అంటే..మీరు అడగండి అంటుంది వసుధార..కానీ సమాధానం చెప్పడం లేదుకదా అంటాడు.. ఆవిడ చెప్పేవరకూ అడగాలి అని మహేంద్రని ప్రోత్సహిస్తుంది. తను ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసుకోండి అంటుంది.. సమయం రావాలి కదా ఇప్పుడు అడిగినా చెప్పదు.. మను-అనుపమ మధ్య గతం ఉంటే కచ్చితంగా ఏదో రోజు తెలుస్తుంది అంటాడు మహేంద్ర...
మను ఓ దగ్గర కారు ఆపుతాడు..అక్కడ ఏంజెల్ ఉంటుంది...మీరేంటి ఇక్కడున్నారు అంటే..నీకోసమే అని చెబుతుంది..
మను: నాకోసం ఎదురుచూసేవారు ఎవ్వరూ ఉండరు..ఉన్నా కానీ నాకు దూరం అయిపోతారు
ఏంజెల్: అంటే నీకు ఏదో గతం ఉందన్నమాట..
మను: మీరు నాకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు
ఏంజెల్: నా ప్రశ్నకి సమాధానం రాలేదు...
మను: అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు...
ఏంజెల్: మీ బర్త్ డే ఎప్పుడు
మను: నేను చెప్పనని చెప్పాను కదా..
ఏంజెల్: ఇప్పుడైనా నాకోసం చెప్పొచ్చు కదా...
ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు...ఇంతలో ఏంజెల్ కి అనుపమ కాల్ చేస్తుంది. ఎక్కడున్నావ్ అని అడిగితే..మీరు చెప్పిన ప్లేస్ లోనే ఉన్నాను , నాతో పాటూ మనుగారూ కూడా ఉన్నారు అని చెబుతుంది. నేను అక్కడకు రావడం లేదు మనం సాయంత్రం కలుద్దాం అంటుంది. ఇప్పుడేమైందని ఏంజెల్ అడుగుతుంది కానీ అనుపమ వేరే వర్క్ ఉందని చెప్పి కాల్ కట్ చేస్తుంది...
Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!
ఏమైందని మను అడిగితే...నాకు అర్థమైతే కదా నీకు చెప్పడానికి అంటుంది. మా అత్తయ్యకి స్క్రూ లూజ్ అయిందేమో అనగానే అలా అంటారేంటి అని మను అంటాడు. మీ ఇద్దరి మధ్యా ఏ బంధం లేదన్నారు కదా అయినా ఆమెని అంటే మీకు కోపం వస్తోందేంటని అడుగుతుంది. పెద్దవాళ్లని అలా అనకూడదు కదా అంటాడు.
ఏంజెల్: నేను మీకు అబద్ధం చెప్పాను...మీకోసం నేను వెయిట్ చేయలేదు..మా అత్తయ్య కోసం వెయిట్ చేశాను..తను రానంది
మను: నేను ఇక్కడ ఉన్నానని చెప్పకుండా ఉండాల్సింది
ఏంజెల్: మీరిక్కడ ఉంటే మా అత్తయ్య ఎందుకు రాదు
మను: నాకు వర్క్ ఉంది వెళతాను...
ఏంజెల్: మళ్లీ ఎప్పుడు కలుస్తారు...
మను: టైమ్ వచ్చినప్పుడు అని చెప్పేసి వెళ్లిపోతాడు...
శైలేంద్ర.. ఎండీ సీటు కోసం ఎంత ప్రయత్నించినా రావడం లేదని..తనను తాను అద్దంలో చూసుకుని తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే దేవయాని వచ్చి ఏం జరిగిందని అడిగితే తన బాధ చెప్పుకుంటాడు. కొంచెం టైమ్ పట్టినా.. నువ్వు అనుకున్నది సాధించి తీరతావు అని మోటివేట్ చేస్తుంది.
ఇవాల్టి ఎపిసోడ్ ముగిసింది
గుప్పెడంత మనసు మార్చి 18 సోమవారం ఎపిసోడ్ లో మనుపై అటాక్ జరగబోతోంది...