అన్వేషించండి

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు (19/03/2024) - ఈ రాశులవారు ఉచిత సలహాలు ఇవ్వడం మానేస్తే మంచిది!

Horoscope Tomorrow's Prediction 19 March 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Daily Horoscope for March 19th 2024  

మేష రాశి

మీరు అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.  మీ నిర్ణయాలను వ్యతిరేకించిన వ్యక్తులు ఈ రోజు మీకు మద్దతునిస్తారు..మీ తరపున నిలబడతారు. పోలీసు, పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు మంచిది. కెరీర్‌లో బావుంటుంది.  (మేష రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

వృషభ రాశి

ఈ రాశివారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. విద్యార్థులు చదువుల పట్ల అధిక ఆసక్తిని కనబరుస్తారు. కొత్త వ్యాపార ప్రణాళికపై పని చేస్తారు, ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఇంటి పనిలో కొంత జాప్యం ఉండవచ్చు. ( వృషభ రాశి వార్షిక  ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

మిథున రాశి

ఎక్కువ పని ఒత్తిడి తీసుకోవద్దు. అడగకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యమైన పనులను సాయంత్రంలోగా పూర్తిచేయడం శ్రేయస్కరం. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోతారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండవచ్చు  (మిథున రాశి వార్షిక ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)

కర్కాటక రాశి

మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో పరిస్థితులు మీకు అననుకూలంగా ఉండవచ్చు. అధికంగా శ్రమిస్తే కానీ మంచి ఫలితాలు పొందలేరు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన చర్చలు జరుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని పనుల్లో తప్పులను సరిచేసుకుంటారు (కర్కాటక రాశి వార్షిక ఫలితాల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి)

సింహ రాశి

ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.  విదేశాలకు వెళ్లే ప్రణాళికలను వాయిదా వేసుకోవడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. అతి తొందరపాటు నిర్ణయాలు హాని కలిగిస్తాయి. శత్రువుల చర్యలు ఇబ్బందులను పెంచుతాయి. మీ తల్లిదండ్రులు చెప్పేది వినండి. శారీరక శక్తి తగ్గుతుంది. 

కన్యా రాశి

మీ గౌరవం  పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన పట్ల సంతోషిస్తారు. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచండి.కుటుంబానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులను కలుస్తారు.

Also Read:  Ugadi Panchangam in Telugu (2024-2025) : క్రోధినామ సంవత్సరంలో మీ రాశి ఆదాయ - వ్యయాలు , గౌరవ అవమానాలు!

తులా రాశి

ఈ రాశివారు తమ బాధ్యతలను పూర్తి భక్తితో నిర్వర్తిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఈరోజు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సన్నిహితుల మాటలు చెడుగా అనిపించవచ్చు. పాత తప్పులు పునరావృతం చేస్తే నష్టపోతారు. అడగకుండా సలహా ఇవ్వడం మానుకోండి. 

వృశ్చిక రాశి

ఈ రాశివారు ప్రయాణంలో అసౌకర్యంగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోగలరు. కుటుంబ సభ్యుల సలహాల వల్ల ప్రయోజనం పొందుతారు.స్నేహితునితో కలసి షికారుకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి 

ధనుస్సు రాశి

ఈ రాశివారు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలి. పాత పరిచయస్తుడిని కలిసిన తర్వాత మంచి అనుభూతి కలుగుతుంది. గృహ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు తమ లక్ష్యాల నుంచి పక్కదారి పట్టకూడదు. కొత్త పనుల పట్ల ఆసక్తి ఉంటుంది. 

Also Read: హోలీ రోజు ఎవరు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలో తెలుసా!

మకర రాశి

భాగస్వామ్యానికి సంబంధించిన పనులు లాభాలను అందిస్తాయి. కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. అద్భుతమైన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఇతరుల సలహాలు కాదు మీకు మీరుగా నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. మీరు మీ పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

కుంభ రాశి

ఈ రాశి ఉద్యోగులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అధికారులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మీ స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించండి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. సృజనాత్మక పనుల్లో నిమగ్నమై ఉంటారు.

Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!

మీన రాశి

కొత్తగా ప్రారంభించే ప్రాజెక్టులో మంచి విజయం సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో సమన్వయ లోపం ఉంటుంది. ఏదో విషయంలో మనసు బాధపడుతుంది. అశుభవార్త వినాల్సి రావొచ్చు. 

మీ నక్షత్రం, రాశి ఏంటో తెలియకపోతే...మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ నక్షత్రం తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి...

Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Unstoppable With NBK Suriya Episode : అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Unstoppable With NBK Suriya Episode : అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
అన్​స్టాపబుల్ షోలో కంగువ టీమ్.. కార్తీతో కలిసి సూర్యని టీజ్ చేసిన బాలయ్య, ప్రోమో నెక్స్ట్ లెవెల్ ఉందిగా
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
Picnic Safety Tips: పిక్‌నిక్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి 
పిక్‌నిక్‌కు ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Embed widget