Guppedantha Manasu March 12th Episode: మను విషయంలో వసు మారిపోయిందా , శైలేంద్ర కొత్త ప్లాన్ ఏంటి - గుప్పెడంతమనసు మార్చి 12 ఎపిసోడ్
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Guppedantha Manasu March 12th Episode: (గుప్పెడంతమనసు మార్చి 12th ఎపిసోడ్)
వసుధార బర్త్ డే సెలబ్రేట్ చేసేందుకు మహేంద్ర-మను ఇద్దరూ ఫిక్సవుతారు. అనుపమ మాత్రం వద్దని వారిస్తుంది. మరోవైపు వసుధార... రిషి ఫొటో పట్టుకుని బాధపడుతుంది. మీరు పక్కన లేకుండా బర్త్ డే సెలబ్రేషన్స్ ఏంటి అనుకుంటుంది.
ఫణీంద్రకు కాల్ చేసిన మహేంద్ర... కాలేజీలో వసుధార బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్నాం మీరు తప్పకుండా రావాలి అంటాడు. సరే అందర్నీ తీసుకుని వస్తానని చెప్పి కాల్ కట్ చేసిన ఫణీంద్ర..దేవయాని, శైలేంద్ర, ధరణిని పిలిచి అసలు విషయం చెబుతాడు. రేపు అందరూ ఎర్లీగా రెడీ అవండి మనం కొంచెం ముందుగానే కాలేజీకి వెళ్లాలి అంటాడు. శైలేంద్ర, దేవయాని మాత్రం తాము వచ్చేది లేదంటారు. కాలేజీలో ఫంక్షన్ అనగానే వస్తానని సంబరపడిపోతావ్ కదా మరి ఇప్పుడేంటి అని గట్టిగా అడుగుతాడు. రిషి కోసం మనం బాధపడుతుంటే తను బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుందా అని దొంగ ప్రేమ నటిస్తుంది.
ఫణీంద్ర: ఇంక ఆపుతావా..మీరిద్దరూ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో నాకు అర్థమే కాదు..నువ్వు నీ కొడుక్కి ఏ మాత్రం మంచి చెడు నేర్పించలేదు, వాడు కూడా నేర్చుకోలేదు..పైగా ఒకరికొకరు ఒత్తాసు పలుకుతారు
అదికాదు డాడీ....అన్న శైలేంద్రని ఆపేసిన ఫణీంద్ర...వసు బర్త్ డే సెలబ్రేట్ చేయడానికి మను ఎవరు అని అడుగుతావ్ అంతే కదా...
ఫణీంద్ర: రిషి లేడు..వసుని ఆ బాధనుంచి బయటకు తీసుకురావాలి...అసలు నువ్వు చేయాల్సిన పనులు మను చేస్తుంటే సహకరించాల్సింది పోయి ఇలా బిహేవ్ చేస్తావేంటి?...రేపు మీరిద్దరిలో ఎవరు కాలేజీకి రాకపోయినా ఊరుకోను అనేసి వెళ్లిపోతాడు...
అయినా మావయ్యగారు చెప్పారుకదా ఇక మీరు ఏమీ చేయలేరు అనుకుంటా...కచ్చితంగా కాలేజీకి రావాల్సిందే అంటుంది ధరణి...
దేవయాని ఫైర్ అవుతుంది...
మర్నాడు వసుధార కాలేజీలోకి అడుగుపెట్టగానే ఓ స్టూడెంట్ వచ్చి... క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారని కంగారుగా చెబుతాడు.. తీరా అక్కడకు వెళ్లి వాళ్లను ఆపేసరికి...హ్యాపీ బర్త్ డే చెబుతారు...
వసుధార: నాకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసుకదా..ఇవన్నీ ఎందుకు చేశారు? ఎవరు చేయమన్నారు? అయినా నాకు తెలుసు అంటూ బయటకు వెళుతుంది...
బయట మను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు... మీరేం చేస్తున్నారో అర్థమవుతోందా...మీకు దండం పెడతాను నన్ను వేధించకండి...మీరెందుకు నా సిట్యుయేషన్ అర్థం చేసుకోవడం లేదు..ఎందుకు నాకు బర్త్ డే సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నారు అంటూ అసలు మనుకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫైర్ అవుతుంటుంది...
వసుధార మాటలు వింటుంటారు మహేంద్ర, స్టూడెంట్స్....
అసలు మీరు ఏం ఆశించి మా కాలేజ్ లోకి వచ్చారని నిలదీస్తుంది...నేను మిమ్మల్ని నమ్మను..కచ్చితంగా మీరేదో కుట్ర పన్నుతున్నారని నాకు అర్థంమైంది
మను: మీరు అనుకుంటున్నట్టు ఏమీ లేదు...
వసు: మీ మనసులో ఏదో మర్మం ఉంది నేను కచ్చితంగా చెప్పగలను..నిన్నంటే మీకు నా ఇష్టా ఇష్టాలు తెలియక పోస్టర్స్ వేశారనుకున్నా కానీ ఈ రోజు ఇలా చేశారంటే ఏమనుకోవాలి..మీరు నన్ను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా...మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది.. మీకు కావాల్సింది ఎండీ సీటే కదా...
మను: నాకు ఏ పదవుల మీదా ఆశలేదు...
వసు: ఇలా మాట్లాడే మా అందరి మనసులలో మంచి వాడిలా పేరు సంపాదించుకుంటున్నారు...కానీ మీ మనసులో ఉన్న విషయాన్ని ఎవ్వరూ పసిగట్టడం లేదు... మీవల్ల మా మావయ్య కూడా నేను చేస్తున్నది తప్పు అంటున్నారు.. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ నాకు ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం ఇష్టం లేదు...మీకు నిజంగా ఎండీ పదవి కావాలంటే సూటిగా అడగండి ఇచ్చేస్తాను...ఇలా నన్ను ఇబ్బంది పెట్టాలని చూడొద్దు...
మను ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతాడు...
అయితే ఇదంతా స్టూడెంట్స్ ప్లాన్... మనం చేసిన దానికి సార్ తిట్లు తింటున్నారు అనుకుంటారు ...
మహేంద్ర-అనుపమ
ముందే చెప్పాను ఇదంతా వద్దని అని అనుపమ తెగ బాధపడిపోతుంటుంది... మను బాధపడుతుంటే నువ్వెందుకు పర్సనల్ గా తీసుకుంటున్నావ్ అంటాడు మహేంద్ర. పర్సనల్ ఏమీ లేదని కవర్ చేస్తుంది కానీ నీ మనసులో కంగారు, నీ కళ్లలో బాధ కనిపిస్తోంది మను విషయంలో నువ్వు ఎందుకిలా ఉంటున్నావ్ అని అడుగుతాడు. ఎప్పటిలా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అనుపమ. మేం వసుధారని బాధ పెట్టాలని అలా చేయలేదు కదా..బాధలోంచి బయటకు తీసుకురావాలని కదా చేశాం అంటాడు. ఆ బాధ ఎంత పెయిన్ ఫుల్ గా ఉంటుందో తెలుసా అని అనుపమ అంటుంది. జగతి పోయిన బాధలో ఉన్నప్పుడు నా బాధను దూరం చేసేందుకు రిషి-వసుధార ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేశారు.. ఇప్పుడు నేను చేసింది తప్పు అయితే అప్పుడు వాళ్లు చేసిందీ తప్పే అంటాడు మహేంద్ర...
Also Read: శ్రీ క్రోధి నామ సంవత్సరంలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు- సున్నాలుంటే మొత్తం శూన్యమే!
వసుధార దగ్గరకు వెళ్లిన స్టూడెంట్స్..మను సర్ కి దీనికి సంబంధం లేదని అసలు విషయం చెబుతారు. తనకి సారీ చెప్పాలి అనుకుంటూ బయటకు వెళుతుంది వసుధార.
మను బయట నిల్చుని వసుధార మాటలు గుర్తుచేసుకుని బాధపడతాడు...ఇంతలో వసుధార అక్కడకు వస్తుంది
వసు: ఆ సెలబ్రేషన్స్ కి మీకు సంబంధం లేదని నాకు ఎందుకు చెప్పలేదు..నిన్న మీరు పోస్టర్స్ వేశారని కోపంగా ఉన్నాను ఇప్పుడు ఆ కేకు ఆ సెలబ్రేషన్స్ చూడగానే మీరే చేశారు అనుకుని అలా మాట్లాడాను
మను: పర్వాలేదండీ మీరు కావాలని చేయలేదు కదా..పొరపాటు జరిగింది వదిలేయండి...
వసు: నేను అనవసరంగా తప్పుపట్టాను మీపై అరిచాను..నిజం తెలిసాక నాకు గిల్టీగా ఉంది
మను: మీకు రిషి సర్ అంటే ప్రాణం అని నాకు తెలుసు..తను చేయాల్సిన పనులు నేను చేస్తుంటే మీకు కోపం రావడం సహజం..ఆ సిట్యుయేషన్స్ లో ఎవ్వరున్నా అలాగే ప్రవర్తిస్తారు
వసు: మీరెంత బాధపడుతున్నారో అర్థమవుతోంది..మిమ్మల్ని మొదట్నుంచీ ప్రతి విషయంలోనూ అపార్థం చేసుకుంటున్నాను.. గతంలో మేం ఎదుర్కొన్న పరిస్థితుల ప్రభావం మాపై ఉంది..ఎవరు సహాయం చేస్తున్నా వారి మనసులో కుట్ర ఉందనిపిస్తోంది
మను: నేను ఏం చేయాలో ఏం చేయకూడదో క్లారిటీ ఉంది... నా విషయంలో మీకు భయాలు అవసరం లేదు...
గుప్పెడంత మనసు మార్చి 12 ఎపిసోడ్ ముగిసింది
గుప్పెడంత మనసు మార్చి 13 ఎపిసోడ్ లో అసలైన సెలబ్రేషన్స్ ఉండబోతోంది....