![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedantha Manasu March 9th Episode: మళ్లీ అపార్థం చేసుకుంటున్న వసు, మను రివర్స్ పంచ్ కి శైలేంద్ర రాజీవ్ విలవిల - గుప్పెడంతమనసు మార్చి 09 ఎపిసోడ్
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
![Guppedantha Manasu March 9th Episode: మళ్లీ అపార్థం చేసుకుంటున్న వసు, మను రివర్స్ పంచ్ కి శైలేంద్ర రాజీవ్ విలవిల - గుప్పెడంతమనసు మార్చి 09 ఎపిసోడ్ Guppedantha Manasu Serial March 9th Episode 1020 Written Update Today Episode Guppedantha Manasu March 9th Episode: మళ్లీ అపార్థం చేసుకుంటున్న వసు, మను రివర్స్ పంచ్ కి శైలేంద్ర రాజీవ్ విలవిల - గుప్పెడంతమనసు మార్చి 09 ఎపిసోడ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/09/fc1437d30792cafcc0222b7aa52ddf711709950961086217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedantha Manasu March 9th Episode: (గుప్పెడంతమనసు మార్చి 9th ఎపిసోడ్)
కాలేజీ గోడలపై మను-వసు పోస్టర్స్ రాజీవ్ అతికిస్తాడు. ఇక ఇవాల్టితో తన ఎండీ కల నెరవేరుతుందనే ఆనందంలో ధరణిని తీసుకుని కాలేజ్ కి వస్తాడు శైలేంద్ర. అయితే ఆ గోడలపై మను-వసు ఫొటోస్ కి బదులు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే వసుధార అనే పోస్టర్స్ ఉంటాయి. అయితే ఆ విషయం తెలియని శైలేంద్ర...ధరణి నీకివ్వబోయే సర్ ప్రైజ్ ఇదే వెళ్లి చూడు అంటాడు. అసలు మీరేం చేశారని ధరణి కంగారుగా అడుగుతుంది కానీ నువ్వెళ్లి చూడు అంటాడు కానీ చెప్పడు. ముందు నువ్వెళ్లి చూడు ఆ తర్వాత నేను వచ్చి చూస్తాను అంటాడు.అదో జరగబోతోందనే కంగారుతో ధరణి వెళ్లి చూస్తుంది...అక్కడ వసు బర్త్ డే పోస్టర్స్ చూసి అలా నిల్చుని ఉంటుంది... ధరణిని గమనించిన శైలేంద్ర..పోస్టర్స్ చూసి కూడా కూల్ గా కనిపిస్తోంది ఏంటి అని వెళ్లి చూసి శైలేంద్ర షాక్ అవుతాడు...అందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అని చెబుతారు...
మహేంద్ర: వసుధారా నీకు ఇలాంటివి ఇష్టం ఉండవని తెలుసు ఎవరు అంటించారో నేను కనుక్కుంటా అంటాడు మహేంద్ర
అసలు ఈ పోస్టర్స్ అంటించాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో అనుకుంటూ వెళ్లిపోతుంది వసుధార...
సర్ ప్రైజ్ చాలా బావుందండీ అంటుంది ధరణి... శైలేంద్ర మాత్రం అవాక్కవుతాడు...వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చి రాజీవ్ కి కాల్ చేస్తాడు.
రాజీవ్: అంతా మనం అనుకున్నట్టే జరిగిందా...ఇక నీకు తిరుగులేదు..ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు..నీకు ఎండీ సీట్ దక్కినట్టే... నా వసు బయటకు వచ్చేస్తుందా...అక్కడే కూర్చుని ఏడుస్తోందా
శైలేంద్ర: నీ అంతట నువ్వే ఊహించుకుని వాగేస్తుంటావా...
రాజీవ్: ఏం జరిగింది
శైలేంద్ర: ఇక్కడ నువ్వు వేసిన పోస్టర్స్ కాదు..వేరే పోస్టర్స్ ఉన్నాయంటూ అసలు విషయం చెబుతాడు..
రాజీవ్: నీకు ఫోన్లో కూడా చూపించాను కదా
శైలేంద్ర: వసుధారకి హ్యాపీ బర్త్ డే చెబుతూ పోస్టర్స్ అంటించారు
రాజీవ్: అసలు నువ్వు సరిగ్గా చూశావో లేదో..
శైలేంద్ర: నాకు సైట్ వచ్చిందనుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా వసుధారకి హ్యాపీ బర్త్ డే చెబుతున్నారు...
సరే లోపలకు వస్తున్నాను ఆగు అంటూ కాలేజీ బయట ఉన్న సంగతి చెబుతాడు... లోపలకు ఎంట్రీ ఇస్తాడు...
Also Read: ఫస్ట్ నైట్ కి ముహూర్తం ఎందుకు నిర్ణయిస్తారో తెలుసా!
వసుధార మేడం ఆ పోస్టర్స్ చూసి చాలా సీరియస్ అయ్యారంట మీరే ఇలా చేశారని తెలిస్తే ఏమనుకుంటారో అంటాడు మను పీఏ. ఈ మాటలు వసుధార విని...మనుని నిలదీస్తుంది.
వసుధార: అసలు ఆ పోస్టర్స్ ఎందుకు అంటించారు...ఎవర్ని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారు
మను:మంచి చేయడానికి కూడా పర్మిషన్ ఎందుకు
వసు: నా పర్మిషన్ లేకుండా నా పోస్టర్స్ అంటించడం తప్పు ..లీగల్‌గా యాక్షన్ తీసుకుంటాను
మను: మీరు నిజంగా బాధపడి ఉంటే కంప్లైంట్ ఇవ్వండి..పరిణామాలు ఎదుర్కొంటాను...
వసు: పోస్టర్స్ అంటించి బర్త్‌డేలు జరుపుకోవడానికి నేనేం సెలబ్రిటీ కాదు.
మను: మీరు అందరికి సెలబ్రిటీ కాకపోవచ్చు. కానీ కాలేజీ స్టూడెంట్స్‌కు, మాకు మీరే సెలబ్రిటీ, మీ గొప్పతనం, మంచిఅందరికి తెలియాలనే అలా చేశాను
వసు: గోడల మీద పోస్టర్స్ అంటించి నేను చేసిన మంచిని ప్రచారం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు
మను: ఇదంతా రిషి కోసమే చేశాను తన ఆశయాల్ని ముందుకు తీసుకెళుతున్న మీరు సంతోషంగా ఉండాలని పోస్టర్స్ అంటించాను
వసు: రిషి పేరుతో మీరు ఇలా చొరవ తీసుకోవడం బాగాలేదు. మీరు చేసిన ప్రతి పనికి రిషిని అడ్డం పెట్టుకోవడం బాగాలేదు ..ఆ పోస్టర్స్ అన్నీ తీసేయండి...
Also Read: ఈ రాశులవారికి మంచిరోజులు ముందున్నాయ్ - మార్చి 09 రాశిఫలాలు
రాజీవ్-శైలేంద్ర
ఆ పోస్టర్ ఎలా మారాయో తెలుసుకోవడానికి కాలేజీకి వస్తాడు రాజీవ్. బర్త్‌డే పోస్టర్స్ చూసి రాజీవ్ కూడా షాకవుతాడు. ట్రైలర్ ఒకటేసి సినిమా ఇంకోటి చూపించావని రాజీవ్‌పై సీరియస్ అవుతాడు శైలేంద్ర. ఎవరు ఇదంతా చేశారో అర్థం కావడం లేదు అదృశ్య శక్తి ఏమైనా ఉందా అంటాడు రాజీవ్. నేనే చేశానంటూ ఎంట్రీ ఇస్తాడు మను
శైలేంద్ర: మీరు దేని గురించి మాట్లాడుతున్నారు
మను: ఏం తెలియనట్లు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు. మీ వెధవ వేషాలు అన్ని నాకు తెలుసు. ఇంత నీచంగా ఆలోచిస్తారా అంటూ ఆ ప్లాన్ కి ఎలా చెక్ పెట్టాడో వివరిస్తాడు మను...మీరు ఎన్నికుట్రలు పన్నాలి అనుకున్నా దేవుడు చివరికి మంచివైపే నిలబడతాడు... నేను వసుధార గారికి బర్త్ డే పోస్టర్స్ రెడీ చేయిద్దామని షాప్ కి వస్తే ఆ సమయానికి నువ్వు అక్కడ కనిపించావ్ అంటూ...రాజీవ్ చేస్తోన్న కుట్ర గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత రాజీవ్ కాలేజీలో పోస్టర్స్ అంటించడం కూడా మను చూస్తాడు. ఫొటోలు అంటిస్తోండగా వీడియో కూడా తీస్తాడు. వీడియో గురించి చెప్పగానే రాజీవ్ భయపడతాడు.
ఇవాల్టి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది...
గుప్పెడంతమనసు మార్చి 11 సోమవారం ఎపిసోడ్ లో రాజీవ్ బండారం మను బయటపెడతాడా? వసుధారకి నిజం తెలుస్తుందా లేదంటే మళ్లీ మనుని ఆపార్థం చేసుకుంటుందా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)