రాశి ఆధారంగా స్త్రీ మనస్తత్వం ఇదే ! మేషరాశి స్త్రీలు చాలా శక్తివంతులు. స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. వృషభ రాశి స్త్రీల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మొండితనం ప్రదర్శించినా అందులో ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. మిథునరాశి స్త్రీలు బహుముఖ ప్రజ్ఞాశాలురు. సాహసాలు చేయడానికి, కొత్త విషయాలను కనుగొనడానికి అస్సలు వెనుకడుగు వేయరు. కర్కాటక రాశి స్త్రీలకు ..తమ ప్రియమైన వారిని చూసుకోవడం కన్నా ముఖ్యమైనది ఏమీ ఉండదు సింహ రాశి స్త్రీలు చాలా శక్తివంతులు. ప్రేమించే వ్యక్తికి వీరిచ్చే ప్రయార్టీనే వేరు. కన్యారాశి స్త్రీలు చాలా నిజాయితీపరులు. అది వారి సహజసిద్ధమైన సామర్ధ్యం కూడా. తులా రాశి స్త్రీలు వాదనలు, భావోద్వేగ ప్రదర్శనలకు దూరంగా ఉంటారు. జీవితం పట్ల వీరి ప్లానింగే వేరు వృశ్చిక రాశి స్త్రీలకు పనిపట్ల చాలా శ్రద్ధ. ఏ విషయంలో అయినా దృఢ సంకల్పం, దృఢమైన మనస్సు కలిగి ఉంటారు. ధనస్సు రాశి స్త్రీలు ప్రేమ, వ్యక్తిగతం జీవితంలో తొందరగా మునిగిపోతారు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తారు. మకర రాశి స్త్రీలు రహస్య స్వభావాన్ని ప్రదర్శిస్తారు..వీరి మనసులో ఏముందో ఇతరులు అస్సలు గ్రహించలేనంతగా వ్యవహరిస్తారు. కుంభ రాశి స్త్రీలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా కష్టాలు పడతారు.స్వేచ్ఛా ప్రపంచంలో ఉండాలి అనుకుంటారు. మీన రాశి స్త్రీలు చాలా సృజనాత్మకంగా, సున్నితంగా ఉంటారు. ఇతరుల పట్ల దయగల స్వభావాన్ని కలిగి ఉంటారు.