Horoscope Today 9th March 2024: ఈ రాశులవారికి మంచిరోజులు ముందున్నాయ్ - మార్చి 09 రాశిఫలాలు
Horoscope Today: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....
Today Horoscope 9th March 2024
మేష రాశి
ఈ రోజు నూతన అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి..ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరంగా మంచి రోజు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు శుభఫలితాలు పొందుతారు.
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. ఇప్పుడు చేసే కృషికి ఫలితం త్వరలోనే పొందుతారు. మీ లక్ష్యాలను పక్కనపెట్టేయవద్దు..నిరంతరం వాటి గురించి ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకోవాల్సిందే
Also Read: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!
మిథున రాశి
మిథున రాశివారికి శుభధినం. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. ఉద్యోగులు పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. మీ ఆర్థిక స్థితి బలపడవచ్చు. కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విమర్శనాత్మకంగా మాట్లాడొద్దు. మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఆర్థికంగా అనుకూలమైన రోజు. కుటుంబానికి సంపూర్ణంగా సమయం కేటాయిస్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అనవసర చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ రాశివారు కెరీర్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. నిజాయితీగా మాట్లాడండి.
సింహ రాశి
ఈ రోజు మీ ప్లాన్లు సక్సెస్ అవుతాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో మీ వ్యూహాలకు మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనిలో పురోగతి ఉంటుంది. అనారోగ్య సమస్యలని నిర్లక్ష్యం చేయవద్దు. వివాహేతర సంబంధాలవైపు ఆసక్తి చూపించవద్దు
Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!
కన్యా రాశి
ఆర్థిక సంబంధిత విషయాలకు ఈ రోజు మంచిరోజు. వ్యాపారంలో ఆర్థిక వృద్ధి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎదుటివారు చెప్పింది పూర్తిగా విన్నతర్వాతే మాట్లాడండి. సంభాషణ ద్వారా మీ బంధంలో ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి
తులా రాశి
నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు మీకు మంచి రోజు. చేపట్టిన పనిని శ్రద్ధగా చేయాలి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో మంచి ఫలితాలను ఇస్తాయి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి
వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండవచ్చు. సురక్షితమైన పెట్టుబడులు పెట్టాలి. కుటుంబంతో సమయం గడపడానికి ఇది మంచి అవకాశం. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వృత్తి జీవితంలో మీ భావాలు మిమ్మల్ని ఆధిపత్యం చేయనివ్వవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు
Also Read: తాళి,మెట్టెలు తీసేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారేమో - ఈ విషయాలు తెలుసా మరి!
ధనస్సు రాశి
ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. అవివాహితులకు వివాహం నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ బంధాలు బలపడతాయి.
మకర రాశి
ప్లాన్ ప్రకారం పనులు పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టొచ్చు. ఆలోచనా విధానం మెరుగుపర్చుకోవాలి. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు భయపడొద్దు.
కుంభ రాశి
గత కొంత కాలంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యాయామం చేయాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. భాగస్వామి సహాయంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చర్చించి పరిష్కరించుకునేందుకు ఇదే మంచి సమయం.
Also Read: పెళ్లిలో వధూవరులకు అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా!
మీన రాశి
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొందరు రాజకీయ లబ్ది పొందుతారు. న్యాయసంబంధిత వ్యవహారాల్లో మీకు అనుకూల ఫలితం వస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం