Guppedantha Manasu February 17th Episode: శైలేంద్ర కుట్రను ఆధారాలతో బయటపెట్టిన మను - వసుధార ప్రశ్నలకు అనుపమ ఉక్కిరిబిక్కిరి!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. మను ఎంట్రీతో మరో మలుపు తిరిగింది. రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 17th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 17 ఎపిసోడ్)
మను ఎవరని మహేంద్ర, వసుధార మాట్లాడుతుంటే అనుపమ సైలెంట్ గా ఉండిపోతుంది. తను ఎవరు కన్నబిడ్డో అని మహేంద్ర అంటే అనుపమ దిక్కులు చూస్తుంటుంది. అయితే మను చేసే సాయం వెనుక ఏ కుట్ర ఉందో ఎవరికి తెలుసు అంటుంది వసుధార. ఇలానే చాలామందిని నమ్మి మోసపోయాం. ఈ మధ్యే భద్ర కూడా సాయం పేరుతో మన పంచన చేరి మన నాశనం కోరుకున్నాడంటుంది.
మహేంద్ర: అందరూ అలానే ఉంటారని అనుకోకూడదు ...మనును చెడ్డవాడు అని ఫిక్స్ కావడం కరెక్ట్ కాదు.. ఏమంటావ్ అనుపమ అంటే అవును అవును అంటుంది
వసుధార: అతను ఇచ్చింది యాభై కోట్లు. ఈ రోజుల్లో అయినవాళ్లకి అవసరానికి డబ్బు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు అలాంటి ఏ సంబంధం లేకుండా ముక్కుమొహం తెలియని వారికి యాభై కోట్లు ఎందుకు ఇచ్చారు. అది కూడా సాయం అనుకోవద్దు అప్పు అనుకోమని చెప్పాడు. డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వమని అన్నాడు. దేవుడు కూడా అడిగితేనే వరాలు ఇస్తాడు. కానీ మను మాత్రం ఏం అడగకుండానే వరాలు ఇచ్చాడు
మహేంద్ర: తన మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడంటావా
వసు: అనడం లేదు అనుమానిస్తున్నాను...అసలు తను ఎవరు? ఇక్కడికి ఎవరు పంపించారు? తన అమ్మనాన్నలు ఎవరు అని అడిగితే అవసరం వచ్చినప్పుడు అన్ని మీకే తెలుస్తాయన్నాడు. రిషినే నన్ను ఇక్కడికి పంపించాడని అనుకోమని అన్నాడంటే రిషితో ఇంతకుముందు నుంచే పరిచయం ఉండి ఉంటుందని, అదే నిజమైతే మను విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి
మహేంద్ర: తను మంచివాడే అనిపిస్తోంది. తను నిజంగా ఫ్రాడ్ అయితే కాలేజ్ లో షేర్ అడిగేవాడు కదా
ఏంటి మేడం అలా ఉన్నారని వసుధార అడిగితే...మను వచ్చినప్పటి నుంచీ అనుపమలో ఏదో తెడా వచ్చిందంటాడు మహేంద్ర. ప్రతివిషయంలో సలహాలు ఇచ్చే మీరు మను విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..ఏదైనా ప్రాబ్లెమా... అసలు మను గురించి మీరు ఏమనుకుంటున్నారు..మంచివాడనా చెడ్డవాడనా
అనుపమ: నేను ఏమీ చెప్పలేకపోతున్నాను...మీరు ఏదంటే అదే. మను గురించి ఎట్టి పరిస్థితుల్లో మహేంద్ర, వసుధారలకు నిజం తెలియకూడదని మనసులో నిశ్చయించుకుంటుంది.
Also Read: రిషికి థ్యాంక్స్ చెప్పిన వసు - మను పేరెత్తితే అనుపమకు ఎందుకు టెన్షన్!
రిషి కాలేజీని తాకట్టు పెట్టాడని వచ్చిన వాళ్లు మోసగాళ్లని మను పీఏ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇంత్లో వాళ్లు కాల్ చేసి మను ఇచ్చిన చెక్ బ్యాంకులో వేసుకోలాని అడుగుతారు...రేపు వేసుకోమని చెప్పు అని రిప్లై ఇస్తాడు మను పీఎం.
శైలేంద్ర - దేవయాని
ఎండీ సీట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. రూమ్‌లో ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ సీన్ చూసి దేవయాని షాక్ అవుతుంది...నువ్వు ఏడుస్తున్నావా? మనం ఏడిపించాలి కానీ ఏడవకూడదంటుంది. కాలేజీ నా సొంతమవుతుందని అనుకున్న ప్రతిసారి చివరి నిమిషంలో ఎవడో ఒకడు వస్తున్నాడని, కాలేజీని తనకు కాకుండా చేస్తున్నాడంటాడు. బాండ్ పేపర్‌పై బోర్డ్ మెంబర్స్ మొత్తం సంతకాలు పెట్టాడని, వసుధార సంతకం పెట్టబోతుండగా వాయుగుండంలా వచ్చి వసుధార సంతకం పెట్టకుండా ఆపేసి యాభైకోట్లు ఇచ్చాడంటాడు. వాడు ఎవడని దేవయాని అడిగితే..అదే తెలియక పిచ్చెక్కిపోతోంది అంటాడు. వాడు డబ్బులివ్వడం చూసి వసు, మహేంద్ర, అనుపమ అందరూ షాకయ్యారు. డబ్బులివ్వడమే కాదు...కాలేజీ కూడా తనకు అవసరం లేదని, వసుధారనే రన్ చేయమన్నాడని చెబుతాడు. ధరణి అన్నట్లుగా ఆ ఎండీ సీట్ నాకు రాసిపెట్టి లేదోమో అంటాడు. ధరణిని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదని, కళ్లతోనే భయపెడుతోందని అంటాడు. ధరణిని అంత సీన్ లేదని, నువ్వు భయపడవద్దనొ కొడుకుకు ధైర్యం చెబుతుంది దేవయాని. అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తుంది ధరణి... కాఫీ కాఫీ అంటూ హడావుడి చేసి క్లాస్ వేస్తుంది. నువ్వు ఇక్కడినుంచి వెళ్లిపో అంటాడు శైలేంద్ర..
Also Read: 1000 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ - కాలేజ్ లోకి 'మను' ఎంట్రీ మామూలుగా లేదు!
మనుని కలుస్తానన్న వసుధార
మనును కలిసి అతడు ఎందుకు డబ్బు ఇచ్చాడో తెలుసుకోవాలని అనుకుంటుంది వసుధార. అతడిని నేరుగా కలిసి నిజాలు రాబట్టాలని అనుకుంటుంది. మనుకు ఫోన్ చేసి కలవాలని అంటుంది. ఏ విషయంలో నన్ను కలవాలని అనుకుంటున్నారని వసుధారను అడుగుతాడు మను. కలిసిన తర్వాతే ఆ విషయం గురించి చెబుతానని మనుతో అంటుంది వసుధార. అందుకు మను ఒప్పుకుంటాడు.
బినామీలతో శైలేంద్ర డిస్కషన్
మను దగ్గర తీసుకన్న యాభై కోట్ల చెక్ తీసుకొని శైలేంద్ర దగ్గరకు వస్తారు బినామీ మనుషులు. వారి వాటాగా కోటి రూపాయలు ఇస్తానని శైలేంద్ర అంటాడు. యాభై కోట్లు వచ్చేలా చేస్తే కోటి ఇస్తానని అంటున్నారని, కరెక్ట్‌గా సెట్ చేయమని వాళ్లు శైలేంద్రను రిక్వెస్ట్ చేస్తుంటారు. నేను సెట్ చేయనా అని మను అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి ముగ్గురు షాకవుతారు. కాలేజీని సొంతం చేసుకునే వాళ్లతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారని శైలేంద్రను అడుగుతాడు మను. మరోసారి కాలేజీ వైపు రావద్దని వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నానని మనుతో అబద్ధం చెబుతాడు శైలేంద్ర.
Also Read: ఈ రోజే భీష్మాష్టమి - అంత మంచి భీష్ముడు కౌరవుల పక్షాన ఎందుకు యుద్ధం చేశాడు!
చెక్ చింపేసిన మను
శైలేంద్ర చేతిలో తాను ఇచ్చిన చెక్ ఉండటం చూసి...వాళ్ల చేతిలో ఉండాల్సిన చెక్ నీ చేతులో ఎందుకు ఉందని శైలేంద్రను నిలదీస్తాడు మను. డేట్, ఎమౌంట్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నానని శైలేంద్ర అంటాడు. తాను కూడా ఓసారి చెక్ చేస్తానని చెప్పి శైలేంద్ర చేతిలోని చెక్‌ను తీసుకొని చింపేసి వారి మోసాన్ని బయటపెడతాడు. వీళ్ల వెనుక ఉన్నది నువ్వేనని నా నిఘాలో తెలిందని శైలేంద్రతో అంటాడు మను. నాకు వీళ్లతో ఎలాంటి సంబంధం లేదని మనుతో వాదిస్తాడు శైలేంద్ర.
బినామీలు: మాకు ఇవ్వాల్సిన అప్పు కోసం కోర్టుకు వెళతాం
మను: పదండి నేను కూడా వస్తానంటాడు మను. మా ఇన్వేస్టిగేషన్‌లో మీ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ అని తేలాయని, అందులో ఉన్న రిషి సంతకాలు ఫోర్జరీ చేశారని తెలిసిపోయిందని మను పీఏ చెబుతాడు. డీబీఎస్‌టీ కాలేజీ మీద ఎలాంటి అప్పు, లోను లేదని మా ఎంక్వైరీలో తేలిందని అంటాడు. మీ బండారం మొత్తం బయటపెడతానని మను అనడంతో షాక్ అవుతారు.
గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది
Also Read: ఈ రాశులవారికి ఇది రైజింగ్ టైమ్, ఫిబ్రవరి 17 రాశిఫలాలు