ఫిబ్రవరి 24 శనివారం మాఘపూర్ణిమ - ఈ రోజు సముద్ర స్నానం చేస్తే!

సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ'' అత్యంత విశేషమైనది

శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైన మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్రస్నానం చేయాలంటారు

నదీనాం సాగరో గతి... సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి

అందుకే సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది

నిత్యం సూర్యకిరణాలవల్ల, ఎంత నీరు ఆవిరి అవుతున్నా సముద్రం పరిమాణం తగ్గదు

ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు

స్థిరత్వం ఆయన ధర్మం, అఘాది, జడత్వాలు ఆయన తత్త్వం

సంవత్సరంలో ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమ రోజు సముద్రస్నానం చేయాలి

ఈ 4 రోజుల్లో సముద్రస్నానం ఆచరిస్తే సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాల్లో ఉంది