ఆలయంలోకి వెళ్లేముందు కాళ్లు కడుక్కోవాలా!

ఆలయానికి వెళ్లేముందు స్నానమాచరించి , శుభ్రమైన దుస్తులు ధరించి వెళతారు

పవిత్రంగా ఇంటినుంచి వెళ్లాక కూడా గుడిలోకి అడుగుపెట్టేముందు కాళ్లెందుకు కడుక్కోవాలి

కాళ్లు, చేతులు కడుక్కోకుండా లోపలకు వెళితే ఏమవుతుందనే సందేహం చాలా మందిలో ఉంది

ఇంటి నుంచి ఎంత శుచిగా ఆలయానికి వెళ్లినా కాళ్లకు చెప్పులు వేసుకుంటారు

అందుకే ఆలయానికి వెళ్లగానే చెప్పులు విడిచి కాళ్లు కడుక్కోవాలి

పంచభూతాల్లో ఒకటైన నేలపై కాళ్లు పెట్టి పంచభూతాధిపతి దగ్గరకు వస్తున్నామని అనుకోవాలి

ఆపాదమస్తకం శుభ్రం చేసుకోవడంలో భాగంగా కాళ్లు, కళ్లు కడుక్కోవాలి

ఆ తర్వాత వాక్కుకు ప్రధాన కారణం అయిన నోటిని శుభ్రం చేసుకోవాలి

గుడిలో అడుగుపెట్టేముందు ప్రధాన ద్వారానికి నమస్కరించి లోపలకు అడుగుపెట్టాలి