అన్వేషించండి

Guppedantha Manasu February 16th Episode: రిషికి థ్యాంక్స్ చెప్పిన వసు - మను పేరెత్తితే అనుపమకు ఎందుకు టెన్షన్!

Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu February 16th Episode:  (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 16 ఎపిసోడ్)

డీబీఎస్‌టీ కాలేజీ త‌న సొంతం అవుతుంద‌ని శైలేంద్ర ఆనందాన్ని ఆవిరిచేసేస్తాడు కొత్తగా వచ్చిన హీరో మను. ఆ తర్వాత ఫ్రస్ట్రేషన్ లో బయటకు వచ్చి చర్చ పెట్టుకుంటారు రాజీవ్- శేలేంద్ర. వాడు వ‌స్తాడ‌ని ముందు నుంచి చెబుతూనే ఉన్నాన‌ు నువ్వే పట్టించుకోలేదని మండిపడతాడు రాజీవ్. 
వ‌సుధార‌కు -వాడికి సంబంధం ఏంటో, వాడు ఎందుకు అంత డబ్బులిచ్చాడో అర్థం కావడం లేదంటాడు. అప్పట్లో మురుగన్ గాడు లాస్ట్ మినిట్లో వచ్చి నా ప్లాన్ ఫెయిల్ చేశాడు, ఇప్పుడు వీడు అని మండిపడతాడు.  ఏం ఆశించ‌కుండా ఎందుకు అంత డ‌బ్బు ఇచ్చాడా అని ఆలోచిస్తుంటాడు. ప్ర‌తిసారి చివ‌రి నిమిషంలో ఎవ‌డో ఒక‌డు వ‌చ్చి త‌న ప్లాన్ చెడ‌గొడుతున్నాడ‌ని కోప్ప‌డ‌తాడు. రిషి లేక‌పోయినా కూడా కాలేజీని సొంతం చేసుకోలేక‌పోతున్నాన‌ని  అరుస్తుంటాడు శైలేంద్ర. ఎండీ సీట్ కోసం ఎన్నో కుట్ర‌లు చేశాను. ఎంతో మంది ప్రాణాలు తీశాను. కానీ ఆ ఆ సీట్ మాత్రం త‌న‌కు ద‌క్క‌డం లేద‌నుకుంటాడు. ఇక బయలుదేరుదాం మరో ప్లాన్ ఆలోచిద్దాం అని రాజీవ్ అంటాడు. ఇంటికి బయలుదేరుదాం అనుకున్న శైలేంద్ర కి...ధరణి మాటలు గుర్తొస్తాయి. తను అన్నట్టుగానే జరిగిందని ముందే ఎలా తెలిసిందని అనుకుంటాడు..

Also Read: 1000 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ - కాలేజ్ లోకి 'మను' ఎంట్రీ మామూలుగా లేదు!

పెద్దమ్మ - మను
ఈ రోజు కాలేజీకి వెళ్లావా? అనుప‌మ‌ను క‌లిశావా? అని మ‌నును అడుగుతుంది పెద్ద‌మ్మ‌. కాలేజీకి వెళ్లాన‌ు కానీ అక్కడ సమస్య సాల్వ్ చేసి వచ్చానంతే అనుపమతో మాట్లాడలేదంటాడు మను.  కాలేజీ కోసం యాభై కోట్లు చెక్ ఇచ్చేంత ఎమోష‌న్‌, ఎఫెక్ష‌న్ ఉండ‌టానికి కార‌ణం ఏంటని పెద్దమ్మ అడిగిన ప్రశ్నకు..డీబీఎస్‌టీ కాలేజీ ప‌ద్ద‌తులు, విధివిధానాలు అంటే త‌న‌కు ఇష్ట‌మ‌ని, డీబీఎస్‌టీ కాలేజీ ఎలాంటి ప్రాబ్లెమ్‌లో ఇరుక్కోకూడ‌ద‌నే సాయ‌ప‌డ్డాన‌ని, గతంల రిషితో చాలా సార్లు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నానని...ఆ కాలేజీ కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేను అంతకు మించి ఎలాంటి స్వార్థం లేదంటాడు. 

రిషి ఆలోచనలో వసుధార
అందరూ మీ గురించి ఏవేవో మాట్లాడుతున్నారు...మీగురించి ఎదురుచూస్తున్నా సర్ తొందరగా రండి...లేజీ చేజారిపోతున్న స‌మ‌యంలో ఓ వ్య‌క్తి వ‌చ్చి తిరిగి కాలేజీని త‌న చేతుల్లో పెట్టాడ‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మీరే త‌న రూపంలో వ‌చ్చి ఈ స‌మ‌స్య‌ను గ‌ట్టెక్కించిన‌ట్లు అనిపించింది.. మీరే నాకు తోడుగా ఉంటార‌ని, ఏదో ఒక శ‌క్తి రూపంలో మీరు వ‌చ్చి స‌మ‌స్య‌ను తీరుస్తార‌ని ముంద‌డుగు వేశాన‌ని నా న‌మ్మ‌కం నిజ‌మైంద‌ని వ‌సుధార అనుకుంటుంది. 

Also Read: వచ్చాడయ్యో సామి - వసుధార నమ్మకమే నిజమైంది కాలేజ్ సేఫ్!

ఆలోచనలో అనుపమ
మ‌ను కాలేజీకి వ‌చ్చి స‌మ‌స్య‌ను సాల్వ్ చేయ‌డం అనుప‌మ‌కు ప‌దే ప‌దే గుర్తొస్తుంది. ఈ స‌మ‌స్య గురించి పెద్ద‌మ్మ‌కు చెప్పి త‌ప్పు చేశాన‌ని అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన మహేంద్ర...ఏమైందని అడిగితే ఏమీలేదనేస్తుంది. వ‌సుధార స‌మ‌స్య సాల్వ్ కావ‌డం ఆనందంగా ఉంద‌ని అంటుంది.
మ‌ను నీకు తెలుసా అని అనుప‌మ‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌. మ‌ను కాలేజీకి వ‌చ్చిన‌ప్పుడు నువ్వు టెన్ష‌న్‌గా క‌నిపించడం గమనించాను...మీ ఇద్దరి మధ్యా పరిచయం ఉందా అని ప్రశ్నిస్తాడు...కానీ అనుపమ సమాధానం చెప్పదు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడగడంతో సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది..

Also Read: ఈ రాశులవారికి ఆస్తుల నుంచి అనుకోని ఆదాయం వస్తుంది, ఫిబ్రవరి 16 రాశిఫలాలు

శైలేంద్ర‌ - ధరణి
ఎండీ సీట్ త‌న‌కే ద‌క్కుతుంద‌ని ధ‌ర‌ణితో చేసిన ఛాలెంజ్‌లో ఓడిపోవ‌డంతో కంగారు ప‌డ‌తాడు శైలేంద్ర.... ధ‌ర‌ణి త‌న‌కు ఎలాంటి ప‌నిష్‌మెంట్ విధిస్తుందో అనే ఆలోచనతో ఇంట్లో అడుగుపెడతాడు. హాల్‌లో సోఫాలో అన్నీ తీసేసి ఉంటాయి. ఓ చిన్న చైర్ మాత్ర‌మే క‌నిపిస్తుంది. సోఫాల‌న్నీ తానే తీసేశాన‌ని, మీకు కుర్చీ పిచ్చి త‌గ్గే వ‌ర‌కు మీరు ఇందులోనే కూర్చోవాల‌ని చిన్న కుర్చీ చూపించి శైలేంద్ర‌తో అంటుంది ధ‌ర‌ణి. త‌న‌తో శైలేంద్ర చేసిన ఛాలెంజ్ ను గుర్తుచేస్తుంది. ఆ ఛాలెంజ్‌లో ఓడిపోతే నేను ఏం చెప్పినా చేస్తాన‌ని అన్నారు క‌దా అని అడుగుతుంది. ఛాలెంజ్‌లో ఓడిపోతే నీకు బానిస‌లా ఉంటాన‌ని, ఇంటీ ప‌నుల‌న్నీ చేస్తాన‌ని తాను పొగ‌రుగా అన్న మాట‌లు గుర్తొచ్చి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. మీరు చెప్పిన ప‌నుల‌న్నీ చేయాలి లేదంటే ఈ కుర్చీలో లైనా కూర్చోవాలి అని ధ‌ర‌ణి ప‌ట్టుప‌డుతుంది. బ‌ల‌వంతంగా ఆ కుర్చీలో శైలేంద్ర‌ను కూర్చ‌బెడుతుంది. ఈ కుర్చీ మీకు బాగా సూటైంద‌ని, ఇందులో రాజులా ఉన్నార‌ని అంటుంది. ఇంతలో ధరణి పిలవడంతో కలలోంచి బయటకొస్తాడు శైలేంద్ర. ధ‌ర‌ణి కాఫీ ఇస్తాన‌ని అన్న వ‌ద్ద‌ని చెప్పి కంగారుగా అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.   

Also Read: ఫిబ్రవరి 16 రథసప్తమి - ఈ రోజు పాలు పొంగించి ఇవి చదువుకోండి!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget