అన్వేషించండి

Horoscope 16th February 2024: ఈ రాశులవారికి ఆస్తుల నుంచి అనుకోని ఆదాయం వస్తుంది, ఫిబ్రవరి 16 రాశిఫలాలు

Horoscope 16 February 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ఓ రాశివారి ఫలితాలని అంచనా వేస్తారు జ్యోతిష్యులు. ఈ రోజు రాశిఫలాలు ఇక్కడ తెలుసుకోండి....

Horoscope Today 16th February 2024  - ఫిబ్రవరి 16 రాశిఫలాలు

మేష రాశి (Aries Horoscope Today) 
 
ఈ రోజు మీ ఆలోచనలు, నిర్ణయాలలో వేగం, స్పష్టత ఉంటాయి. అనుకున్న ప్రణాళికలు అమలుచేయడం, చేపట్టిన పని పూర్తిచేయడంపై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెడతారు. అందుకు ప్రతిఫలంగా మంచి ఫలితాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనసులో నిరుత్సాహ భావాలు కలగవచ్చు. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

వృషభ రాశి (Taurus  Horoscope Today)

ఈ రోజు మీరు ఆర్థిక విషయాలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు.  అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగులు పనిలో ఉత్సాహంగా, అంకితభావంతో పనిచేయాలి. మీ లక్ష్యాలపై దృష్టి సారించండి..ప్రశాంతంగా ఉండండి.  మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. విద్యా , మేధోపరమైన పని ద్వారా  గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది.  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కానీ మితిమీరిన కోపం కూడా ఉంటుంది. 

Also Read: ఆయురారోగ్యాలు ప్రసాదించే రథసప్తమి శుభాకాంక్షలు!


మిథున రాశి (Gemini Horoscope Today) 

ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.  ఉత్తేజకరమైన పనులను ప్లాన్ చేసుకుంటారు కానీ వాటిని పూర్తిచేసేందుకు కష్టపడాల్సి రావొచ్చు. మీ ఆలోచనలను వ్యక్తం చేయండి.  వ్యక్తిగత , వృత్తిపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోండి.  స్వభావంలో చికాకులు ఉండవచ్చు . ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో పనిభారంతో పాటూ ఆదాయం పెరుగుతుంది. 


కర్కాటక రాశి (Cancer Horoscope Today)  

ఈ రోజు మీకు సాధారణ రోజు కావొచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది కానీ సక్సెస్ అవుతారు.  కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ప్రశాంతంగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ మనసులో ఏదో అసంతృప్తి వెంటాడుతుంది. ప్రణాళికేతర ఖర్చులు పెరుగుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఆర్థిక సహకారం పొందుతారు. 

సింహ రాశి (Leo Horoscope Today)

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మీ ఆలోచనలను వ్యక్తీకరించాలి. మీ బంధాలను మరింత దృఢంగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఉన్నత విద్య, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కార్యాలయంలో మార్పులకు అవకాశం ఉంది.   ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు కానీ అతిగా ఉత్సాహంగా ఉండకండి.  

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

కన్యా రాశి  (Virgo Horoscope Today) 
 
ఈ రోజు మీకు సాధారణమైన రోజు కావొచ్చు. కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కానీ మంచి ఫలితాలు సాధిస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకోగలగుతారు.  ఆదాయం పెరుగుతుంది.  కళలు ,  సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు సాధ్యమవుతుంది.  కార్యాలయంలో  శ్రమ పెరుగుతుంది. ఆస్తి ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం ఉంటుంది.

తులా రాశి (Libra Horoscope Today) 

తులారాశి వారికి వ్యాపార విషయాలలో విజయం సాధించేందుకు ఈ రోజు మంచి అవకాశం. మీరు కొత్త వ్యాపార అవకాశాలను కలిగి ఉంటారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది.  తల్లిదండ్రుల నుంచి మద్దతు పొందుతారు.  చదువులపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉండవచ్చు.  ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.  

Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!

వృశ్చిక రాశి (Scorpio Horoscope Today) 

వృశ్చిక రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది . మీ తల్లి నుంచి డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య సంతోషం పెరుగుతుంది. స్నేహితుని సహాయంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మనసులో ఆశ  నిరాశ మిశ్రమ భావాలు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఉద్యోగులకు గుడ్ టైమ్

ధనుస్సు రాశి  (Sagittarius Horoscope Today) 

ధనుస్సు రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో మీ కృషి- అంకితభావం మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.  సంభాషణలో ప్రశాంతంగా ఉండండి.   పోటీ పరీక్షలు , ఇంటర్వ్యూలు మొదలైన వాటిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు.  వాహన సౌఖ్యం పెరుగుతుంది. రచనా కార్యక్రమాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మకర రాశి (Capricorn Horoscope Today) 

మకర రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు కానీ వాటిని అధిగమిస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ అసంతృప్తి కూడా ఉంటుంది. కుటుంబంలో  ఆనందం ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబంలో స్త్రీ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సోదరులతో విభేదాలు ఉండవచ్చు. సంభాషణలో సంయమనం పాటించండి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 

కుంభ రాశి  (Aquarius Horoscope Today) 

ఈ రోజు కుంభ రాశివారు ఆనందంగా ఉంటారు. నూతన స్నేహాలు మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి.  కానీ సంభాషణలో మితంగా ఉండండి. అనవసరంగా కోపం పెంచుకోవద్దు. విద్యార్థులి మంచి ఫలితాలు పొందుతారు. పరిశోధనా రంగంలో ఉండేవారు వేరే ప్రదేశానికి వెళ్లాల్సి రావొచ్చు.  ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి - ఈ నియమాలు పాటించండి!
 
మీన రాశి (Pisces Horoscope Today) 

మీనరాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. ఖర్చులు తగ్గించడం మంచిది. ఉద్యోగులు కష్టపడితేనే మంచి ఫలితం సాధిస్తారు.  ఉద్యోగంలో స్థలం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. కార్యాలయంలో అదనపు బాధ్యతలు పొందుతారు, పని ఒత్తిడి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
PV Narasimha Rao: తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
తెలంగాణ ఠీవి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీకి ప్రముఖుల నివాళులు
YS Jagan News: రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
రేపు బెంగళూరు నుంచి రానున్న జగన్, 4 రోజులపాటు పులివెందులలో పర్యటన వివరాలివే
They Call Him OG : 'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
'ఓజీ' కోసం రంగంలోకి 'పుష్ప' కొరియోగ్రాఫర్... ఆ స్పెషల్ సాంగ్​తో మెగా ఫ్యాన్స్​కు పూనకాలే
Allu Arjun House Attack Case: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్
అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం, ఆరుగురు నిందితులకు బెయిల్ మంజూరు
Unstoppable 4 : వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద... నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌ రిలీజ్ డేట్
Embed widget