అన్వేషించండి

Ratha Sapthami 2024: ఫిబ్రవరి 16 రథసప్తమి - ఈ రోజు పాలు పొంగించి ఇవి చదువుకోండి!

రథసప్తమి రోజు కొందరు ఆలయాల సమీపంలో పాలు పొంగించి నైవేద్యం సమర్పిస్తారు. ఇంకొందరు ఇంటి ముందే సూర్యకిరణాలు పడేదగ్గర పాలు పొంగిస్తారు. ఆ సమయంలో ప్రత్యేక పూజ చేయలేని వారు ఈ శ్లోకాలు చదువుకున్నా చాలు..

Surya Jayanthi Slokas:  ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి... ఈ రోజు ఆరుబయట సూర్యకాంతిలో పాలుపొంగిస్తారు. శక్తి కొలది పూజించి చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యభగవానుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ సమయంలో పూజావిధానం మొత్తం తెలియకపోయినా..ప్రత్యక్షదైవానికి మనస్ఫూర్తిగా నమస్కరించి కొన్ని శ్లోకాలు చదువుకున్నా సరిపోతుంది...

Also Read: ఫిబ్రవరి 16 శుక్రవారం రథ సప్తమి - ఈ నియమాలు పాటించండి!

రథసప్తమి రోజు స్నానం ఆచరించేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః 
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!! 
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! 
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!! 
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! 
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
 ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! 
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

Also Read: ఆయురారోగ్యాలు ప్రసాదించే రథసప్తమి శుభాకాంక్షలు!

నవగ్రహశ్లోకం

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్య గాయత్రి

ఓం భాస్కరాయ విద్మహే 
మహాధ్యుతికరాయ ధీమహే
తన్నో ఆదిత్యః ప్రచోదయాత్

శ్రీ సూర్యాష్టకమ్ 

ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోఽస్తు తే || 

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ |
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 

లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 

బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ |
ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 

బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితమ్ |
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

తం సూర్యం జగత్కర్తారం మహాతేజఃప్రదీపనమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ||

తం సూర్యం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదమ్ |
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ || 

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడాప్రణాశనమ్ |
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్భవేత్ || 

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా || 

స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి || 

Also Read: విజ్ఞానం, సంపద, ఆహారం, ఆరోగ్యానికి మూలం ఆదిత్యుడే!

శ్రీ సూర్య అష్టోత్తరశతనామావళి - Sri Surya Ashtottara Shatanamavali  

ఓం అరుణాయ నమః , ఓం శరణ్యాయ నమః , ఓం కరుణారససింధవే నమః , ఓం అసమానబలాయ నమః , ఓం ఆర్తరక్షకాయ నమః , ఓం ఆదిత్యాయ నమః , ఓం ఆదిభూతాయ నమః , ఓం అఖిలాగమవేదినే నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం అఖిలజ్ఞాయ నమః , ఓం అనంతాయ నమః ,  ఓం ఇనాయ నమః , ఓం విశ్వరూపాయ నమః , ఓం ఇజ్యాయ నమః , ఓం ఇంద్రాయ నమః , ఓం భానవే నమః, ఓం ఇందిరామందిరాప్తాయ నమః , ఓం వందనీయాయ నమః , ఓం ఈశాయ నమః , ఓం సుప్రసన్నాయ నమః ,ఓం సుశీలాయ నమః ,ఓం సువర్చసే నమః, ఓం వసుప్రదాయ నమః |
ఓం వసవే నమః , ఓం వాసుదేవాయ నమః ,ఓం ఉజ్జ్వలాయ నమః , ఓం ఉగ్రరూపాయ నమః , ఓం ఊర్ధ్వగాయ నమః , ఓం వివస్వతే నమః , ఓం ఉద్యత్కిరణజాలాయ నమః , ఓం హృషీకేశాయ నమః , ఓం ఊర్జస్వలాయ నమః , ఓం వీరాయ నమః , ఓం నిర్జరాయ నమః , ఓం జయాయ నమః , ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః , ఓం ఋషివంద్యాయ నమః , ఓం రుగ్ఘంత్రే నమః , ఓం ఋక్షచక్రచరాయ నమః , ఓం ఋజుస్వభావచిత్తాయ నమః , ఓం నిత్యస్తుత్యాయ నమః , ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః , ఓం ఉజ్జ్వలతేజసే నమః , ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః , ఓం పుష్కరాక్షాయ నమః , ఓం లుప్తదంతాయ నమః , ఓం శాంతాయ నమః , ఓం కాంతిదాయ నమః  , ఓం ఘనాయ నమః  , ఓం కనత్కనకభూషాయ నమః , ఓం ఖద్యోతాయ నమః , ఓం లూనితాఖిలదైత్యాయ నమః , ఓం సత్యానందస్వరూపిణే నమః , ఓం అపవర్గప్రదాయ నమః , ఓం ఆర్తశరణ్యాయ నమః , ఓం ఏకాకినే నమః , ఓం భగవతే నమః ,  ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః, ఓం గుణాత్మనే నమః , ఓం ఘృణిభృతే నమః, ఓం బృహతే నమః, ఓం బ్రహ్మణే నమః , ఓం ఐశ్వర్యదాయ నమః , ఓం శర్వాయ నమః , ఓం హరిదశ్వాయ నమః , ఓం శౌరయే నమః , ఓం దశదిక్సంప్రకాశాయ నమః , ఓం భక్తవశ్యాయ నమః , ఓం ఓజస్కరాయ నమః , ఓం జయినే నమః , ఓం జగదానందహేతవే నమః , ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః , ఓం ఔచ్చ్యస్థానసమారూఢరథస్థాయ నమః , ఓం అసురారయే నమః , ఓం కమనీయకరాయ నమః , ఓం అబ్జవల్లభాయ నమః , ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః , ఓం అచింత్యాయ నమః , ఓం ఆత్మరూపిణే నమః , ఓం అచ్యుతాయ నమః , ఓం అమరేశాయ నమః , ఓం పరస్మై జ్యోతిషే నమః , ఓం అహస్కరాయ నమః , ఓం రవయే నమః ,  ఓం హరయే నమః ,ఓం పరమాత్మనే నమః , ఓం తరుణాయ నమః , ఓం వరేణ్యాయ నమః , ఓం గ్రహాణాం పతయే నమః , ఓం భాస్కరాయ నమః , ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః , ఓం సౌఖ్యప్రదాయ నమః , ఓం సకలజగతాం పతయే నమః , ఓం సూర్యాయ నమః , ఓం కవయే నమః , ఓం నారాయణాయ నమః , ఓం పరేశాయ నమః , ఓం తేజోరూపాయ నమః , ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః , ఓం హ్రీం సంపత్కరాయ నమః , ఓం ఐం ఇష్టార్థదాయ నమః , ఓం అనుప్రసన్నాయ నమః , ఓం శ్రీమతే నమః , ఓం శ్రేయసే నమః , ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః , ఓం నిఖిలాగమవేద్యాయ నమః , ఓం నిత్యానందాయ నమః , ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః.

సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. అందుకే సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని చెబుతారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ 'డి' లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం.. సంధ్యావందనం, సూర్యనమస్కారాలు,అర్ఘ్యం అనే ప్రక్రియలు ప్రవేశపెట్టారు. 

Also Read: మనిషి లోపలున్న చీకటిని కూడా తొలిగించే సూర్య భగవానుడు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?

వీడియోలు

Prashant Veer Kartik Sharma CSK IPL 2026 Auction | ఎవరీ ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ | ABP Desam
Auqib Nabi IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలంలో భారీ ధర పలికిన అనామక ప్లేయర్ | ABP Desam
Matheesha Pathirana IPL 2026 Auction | భారీ ధరకు వేలంలో అమ్ముడుపోయిన పతిరానా | ABP Desam
Quinton de Kock IPL 2026 Auction Surprise | సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ కు అంత తక్కువ రేటా.? | ABP Desam
Cameron Green IPL Auction 2026 | ఆసీస్ ఆల్ రౌండర్ కు ఐపీఎల్ వేలంలో ఊహించని జాక్ పాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP government employees: ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు - చెల్డ్ కేర్ లీవ్స్ విషయంలో కీలక ఉత్తర్వులు
Australia terror attack: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడిన తండ్రీ కొడుకులు హైదరాబాద్ వాళ్లే - పాకిస్తాన్ వాళ్లు కాదు !
BRS Party Key Meeting: ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
ఈ 19న జరగాల్సిన బీఆర్‌ఎస్ కీలక సమావేశం వాయిదా వేసిన కేసీఆర్
YSRCP Kukatpalli: కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
కూకట్‌పల్లిలో ధర్నాలు, రాజకీయ ప్రదర్శనలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు హద్దులు చెరిపేస్తున్నారా?
Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!
Bride Viral video: రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
రెండు గంటల్లో పెళ్లీ -ఎక్స్‌తో పెళ్లికూతురు కిస్సింగ్ - జెన్‌జీ ఇంతేనా? వైరల్ వీడియో
Pawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?
Lionel Messi: మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
మరోసారి భారత్‌కు లియోనెల్ మెస్సీ! టీ20 ప్రపంచ కప్‌లో భారత్-అమెరికా మ్యాచ్‌కు వచ్చే అవకాశం!
Embed widget