Guppedantha Manasu February 14th Episode: వచ్చాడయ్యో సామి - వసుధార నమ్మకమే నిజమైంది కాలేజ్ సేఫ్!
Guppedantha Manasu Today Episode: వసుధార శైలేంద్ర కుట్రలను ఎదుర్కొంటూ దూసుకెళుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu February 14th Episode: (గుప్పెడంతమనసు ఫిబ్రవరి 14 ఎపిసోడ్)
కాలేజీ చేజారిపోతుంటే చూడలేను నేను కాలేజీకి రాలేను..ఇట్నుంచి ఇటే ఎక్కడికైనా వెళ్లిపోదాం అంటాడు మహేంద్ర. కానీ వసుధార మాత్రం వెనక్కు తగ్గదు. ఇది రిషి సర్ బ్రాస్ లెట్...తనే నన్ను కాపాడతారు అని నమ్మకంగా చెబుతుంది...మహేంద్ర, అనుపమ కూడా వసుని అనుసరిస్తారు..
దేవయాని- శైలేంద్ర
మనం అనుకున్నది జరుగుతుందా అని దేవయాని సందేహపడుతుంది. అంతా అయ్యాక ఇలా మాట్లాడతావేంటి మమ్మీ అన్న శైలేంద్ర...ఎప్పుడైతే వసుధార సంతకాలు పెట్టి కాలేజీని నా మనుషులకు రాసిస్తారో అప్పుడే కాలేజీ నాచేతిలోకి వచ్చినట్టు...ఎండీ సీట్ తో పాటూ కాలేజీ మొత్తం నా గుప్పిట్లో ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఎండీ సీట్ నా కాళ్ల దగ్గరకే వస్తుంది. ఈ ధరణి ఏదైనా జరగొచ్చు అంటోంది కదా ఉండు దానికి కూడా ఓసారి చెప్పేద్దాం అని ధరణిని పిలిచి...మేం అనుకున్నది అవదు అన్నావ్ కదా చూడు...కాసేపట్లో నిజం అవుతుంది చూడు అంటాడు
ధరణి: మీరు ఏం అనుకున్నా మీ ప్లాన్ మాత్రం ఫెయిల్ అవుతుంది..
శైలేంద్ర: కలగంటున్నావా
ధరణి: అది నా పని కాదు...
శైలేంద్ర: నువ్వు ఎదురురా..నాకు మంచి జరగాలని కోరుకో
ధరణి: మంచో చెడో నేను అనుకున్నదే జరుగుతుందంటూ ధరణి ఎదురొస్తుంది...
శైలేంద్ర వెళ్లిపోతాడు... లోపలకు వచ్చిన ధరణిని పిలుస్తుంది దేవయాని...నువ్వు ఎన్ని అనుకున్నా చేతిలోకి వచ్చిన పావురం ఎగిరిపోతుందా ఏంటి
ధరణి: పావురం ఎగరొచ్చు ఎగరకపోవచ్చు కానీ పావురం తప్పించుకునేందుకు ఛాన్స్ ఉంది కదా అంటుంది
Also Read: వాలంటైన్స్ డే ఎపిసోడ్ మామూలుగా ఉండదు - శైలేంద్ర, రాజీవ్ కి బిగ్ షాక్!
కాలేజీలో స్టూడెంట్స్ ని కూడగట్టి ఎవరో మన కాలేజీని స్వాధీనం చేసుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు కదా అని రెచ్చగొడతాడు. అసలు రిషి సార్ కాలేజీని తాకట్టు పెట్టడం ఏంటి సార్ అని స్టూడెంట్స్ అడిగితే.నాక్కూడా అదే అర్థం కావడం లేదు అయినా మీరు వసుధారని నిలదీయండి అని రెచ్చగొడతాడు..ఇంతలో వసుధార ఎంట్రీ ఇస్తుంది..స్టూడెంట్స్ అంతా వసుధార దగ్గరకు వెళ్లి క్వశ్చన్ చేస్తారు...
వసుధార: ఇదంతా శైలేంద్ర స్కెచ్ అని అర్థమైన వసుధార...అదంతా అబద్ధం...ఎవరో వచ్చి చూపించనవి ఫేక్ డాక్యుమెంట్స్ అని చెబుతుంది
స్టూడెంట్స్: డబ్బు కట్టకపోతే కాలేజీ తీసుకుంటామని అన్నారట కదా...
వసుధార: అదంతా మీకెందుకు..కాలేజీకి, మీకు ఎలాంటి సమస్యా రాకుండా చూసే బాధ్యత నాది..పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కదా మీరు హ్యపీగా చదువుకోండి..అసలు ఇలాంటి విషయాలు మిమ్మల్ని పక్కదారి పట్టించాలని చెబుతున్నట్టున్నారు
స్టూడెంట్స్: కాలేజీని వేరేవాళ్లు తీసుకుంటే మా పరిస్థితి ఏంటి..
వసుధార: నేను మాటిస్తున్నా మీకేం కాదు..కాలేజీ ఎక్కడికీ పోదు..మీరు ధైర్యంగా ఉండండి..శ్రద్ధగా క్లాసులు వినండి అని పంపించేస్తుంది...
స్టూడెంట్స్ వెళ్లిపోతారు... స్టూడెంట్స్ ని బాగానే మ్యానేజ్ చేశారు..మరి వాళ్లని ఎలా మ్యానేజ్ చేస్తావ్ అని క్లాస్ వేసి వెళ్లిపోతాడు..
ఏం చేసైనా కానీ కాలేజీ దూరం కాకుండా చూసుకోవాలి అనుకుంటుంది వసుధార...
Also Read: ఫిబ్రవరి 14 వసంతపంచమి - శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి!
ఆ తర్వాత అందరూ బోర్డ్ మీటింగ్ లో కూర్చుంటారు...
నీకు ఇదే లాస్ట్ బోర్డ్ మీటింగ్ అనుకుంటాడు శైలేంద్ర...మరోవైపు బయట వెయిట్ చేస్తున్న రాజీవ్... ఈ రోజుతో నా మరదలు దిక్కులేనిది అవుతుంది దానికి నేనే దిక్కు అనుకుంటాడు...ఇంతలో కాలేజీలోకి మినిస్టర్ ఎంట్రీ ఇస్తాడు. తప్పదమ్మా కాలేజీ వదులుకోవాల్సిందే అని మహేంద్ర అంటే వదలను మావయ్య అంటుంది వసుధార. నువ్వు ఏం చేసినా ఈ కాలేజీని దక్కించుకోలేం అంటాడు..ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుందమ్మా అని బాధపడతాడు...
డబ్బులు చెల్లిస్తారా కాలేజ్ హ్యాండోవర్ చేస్తారా అని వచ్చిన వాళ్లు అడుగుతారు...మా దగ్గర అంత డబ్బు లేదు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అంటాడు మహేంద్ర
వసుధార: నేను ఈ డాంక్యుమెంట్స్ ని నమ్మడం లేదు..ఇవన్నీ దొంగ డాక్యుమెంట్స్
కొత్తగా వచ్చినవారు: దీని గురించి నిన్నే మాట్లాడుకున్నాం...కావాలంటే కోర్టుకు వెళతాం..
శైలేంద్ర: అలా అనకండి సార్..కోర్టు అంటే స్టూడెంట్స్ భవిష్యత్ పాడైపోతుంది మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు... మినిస్టర్ గారు వస్తున్నారు కదా ఆయన ఏం చెబుతారో చూద్దాం...
ఇంతలో మినిస్టర్ బోర్డ్ మీటింగ్ లోకి ఎంట్రీ ఇస్తాడు....
మినిస్టర్: ఆ డాంక్యుమెంట్స్ ఇవ్వండి అని అడిగి పరిశీలిస్తాడు..
( చూసినంత మాత్రాన ఏం చేస్తాడులే అనుకుంటాడు శైలేంద్ర)
( మినిస్టర్ వస్తే ఏం కాదులే కానీ ఆరోజు వచ్చిన వాడు ఇక్కడకు రాకపోతే చాలు అనుకుంటాడు రాజీవ్..భయ్యా పనైందా అని మెసేజ్ చేస్తాడు)
( అయిపోతుంది నువ్వు కంగారు పడకు అని రిప్లై ఇస్తాడు శైలేంద్ర)
మినిస్టర్: డాంక్యుమెంట్స్ కరెక్టుగానే ఉన్నాయి
వసుధార: రిషి సార్ అలా చేయరు..ఎవరో క్రియేట్ చేశారని అనిపిస్తోంది
మినిస్టర్: తను తలుచుకుంటే ఈజీగా డబ్బు సేకరించగలడు కానీ కాలేజీని తాకట్టు పెట్టి ఎందుకు తీసుకుంటాడు...
శైలేంద్ర: డాంక్యుమెంట్స్ కరెక్టుగా ఉన్నాయి కదా..మన నమ్మకాలు కోర్టులో చెల్లవు కదా
కొత్తగా వచ్చినవారు: మా డబ్బు ఇవ్వండి..లేదంటే కాలేజీ హ్యాండోవర్ చేయండి
వసుధార: నేను దీని గురించి కోర్టుకు వెళదాం అనుకుంటున్నా...
ఎగ్జామ్స్ అయ్యేవరకూ ఆగండి అని మినిస్టర్ చెప్పినా కానీ వాళ్లు ఒప్పుకోరు...కాలేజీ హ్యాండోవర్ చేయండని అడుగుతారు... అమ్మా వసుధారా మన చేతిలో ఏం లేదు అనేస్తాడు మినిస్టర్... 24 గంటలు టైమ్ అయిపోయింది బోర్డ్ మెంబర్స్ సంతకం చేస్తే మేం కాలేజీ హ్యాండోవర్ చేసుకుంటాం అంటారు...అందరూ సంతకాలు పెట్టడం ప్రారంభిస్తారు...
Also Read: ఈ రోజు ఈ రాశులవారి ప్రయత్నాలు ఫలిస్తాయి, ఫిబ్రవరి 14 రాశిఫలాలు
ఇంతలో కాలేజీలోకి ఓ కారు ఎంటరవుతుంది...ఆ కారు చూసి అసలు వీడెందుకు వచ్చాడు కాలేజీలోకి అనుకుంటాడు...
ఎపిసోడ్ ముగిసింది...