అన్వేషించండి

Guppedantha Manasu December1st Episode: డైలమాలో రిషి - క్లారిటీ ఇచ్చేందుకు వసు ప్రయత్నం - మొత్తం మార్చేసిన శైలేంద్ర!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu December 1st Episode (గుప్పెడంతమనసు డిసెంబరు 1 ఎపిసోడ్)

జగతి, రిషిని చంపేయమని చెప్పిన శైలేంద్ర ఆడియోలు బయటకు రావడంతో దేవయాని కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఫణీంద్ర, మహేంద్ర ఇద్దరూ కూడా ఆ వాయిస్ శైలేంద్రదే అని చెబుతారు. దేవయాని మాత్రం అదంతా ఎవరో మిమిక్రీ చేశారని మాటమారుస్తుంది. రిషి మాత్రం అక్కడి నుంచి వెళ్లిపోతాడు...కాసేపు ఒంటరిగా వదిలేయమంటాడు. దేవయాని కాల్ చేస్తుంది కానీ శైలేంద్ర లిఫ్ట్ చేయడు..ఫణీంద్ర చేస్తే కాల్ కలవదు... ముకుల్ ట్రై చేస్తాడు.... 
శైలేంద్ర: డాడ్ కాల్ చేశారు, మమ్మీ కాల్ చేసింది..ఇప్పుడు మూడో నంబర్ నుంచి కాల్ వచ్చిందంటే ఇది కచ్చితంగా ముకుల్ దే అయి ఉంటుంది అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర కాల్ చూసి...తను అన్ని నిజాలు చెప్పేస్తే పరిస్థితేంటి..ఇలా జరిగిందేంటి అనుకుంటాడు..
మొత్తానికి ఎవ్వరి కాల్ లిఫ్ట్ చేయడు..మళ్లీ దేవయాని కాల్ చేస్తూనే ఉంటుంది...ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కాల్ లిఫ్ట్ చేయలేను అనుకుంటాడు. ఇంతలో ధరణి స్వీట్స్ తీసుకొచ్చి ఇస్తుంది...శైలేంద్రకి రగిలిపోతుంటుంది.
ధరణి-శైలేంద్ర
ఎందుకలా ఉన్నారు..ఎందుకు చెమట్లు పడుతున్నాయి..ఏదైనా ప్రాబ్లెమా అని అడుగుతుంది..అదేం లేదని చెప్పేస్తాడు శైలేంద్ర...

Also Read: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - శైలేంద్ర నిజస్వరూపం మొత్తం రిషికి తెలిసిపోయింది

రిషి మాత్రం రూమ్ లోపలకు వెళ్లి ఆలోచలో పడతాడు..ఆవెనుకే వెళుతుంది వసుధార...
రిషి: ఏంటి వసుధార ఇది..అది అన్నయ్య వాయిసే కదా..
వసు: అవును సర్ అది శైలేంద్ర సార్ వాయిసే...
రిషి: అంటే ఇదంతా అన్నయ్యే చేశాడా..నేను నమ్మలేకపోతున్నాను వసుధార నిజంగా అన్నయ్యే చేశాడా..ఇక్కడ జరుగుతున్నది మనం విన్నది అంతా నిజమేనా..నాకు అంతా షాకింగ్ గా ఉంది...
వసు: మీ అన్నయ్య గురించి తెలిస్తే తట్టుకోలేరు..మేం చెబితే మీరు నమ్మరని చెప్పలేదు..ఎలాగైనా ఈ విషయాలు బయటపడాలి...
రిషి: అయినా అన్నయ్య వాయిస్ రావడం ఏంటి..అన్నయ్య నాతో ఎంత మంచిగా ఉండేవాడు..నన్ను సొంత తమ్ముడిలా చూసుకునేవాడు..అమ్మని చాలా గౌరవించేవాడు..వసుధారా నీకు గుర్తుందా..నేను మేడం అని పిలిస్తే పిన్నిని అమ్మా అని పిలువు అని చెప్పాడు కదా..అని శైలేంద్ర చెప్పిన మాటలన్నీ గుర్తుచేసుకుంటాడు( అదంతా డ్రామా అని రిషికి తెలియదు కదా)..అన్నయ్య అలా ఎలా చేస్తాడు వసుధారా... అన్నయ్య అమ్మని చంపేశాడా..అమ్మ దూరం అవడానికి కారణం అన్నయ్యేనా...లేదు అన్నయ్య కాదు..అన్నయ్య అలా చేయడు.. కానీ ఆ వాయిస్ అన్నయ్యదే..అని తలపట్టుకుంటాడు...నా మైండ్ పనిచేయడం లేదు..నాకేం తోచడం లేదు.. అసలు అలా చేయాల్సిన అవసరం అన్నయ్యకి ఏముంది..లేదు ఆ అవసరం తనకి ఉండదు..అందరం కలసి ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనుకునేవ్యక్తి ఇలా చేశాడంటే నేను నమ్మలేను..కానీ వాయిస్ మాత్రం అన్నయ్యదే...ఛ..ఇదేంటి..నేనిప్పుడు నాకు తెలిసిన అన్నయ్యని నమ్మాలా? కళ్లముందున్న సాక్ష్యాన్ని నమ్మాలా? ఏం చేయాలి...వసుధారా మాట్లాడు...ఇది నిజమా కాదా...?
వసుధార: సర్ మీ అన్నయ్య అని చెప్పాలి అనుకుంటుంది...
ముకుల్ పిలవడంతో...అంతా హాల్లోకి వెళతారు....

Also Read: ఇంకేం కావాలి ఇది చాలదా - రిషిధార స్పెషల్ సెలబ్రేషన్స్, షాకిచ్చిన అనుపమ!

శైలేంద్ర కాల్ కలవడం లేదని చెప్పిన ముకుల్..దేవయానిని ట్రై చేయమంటాడు...దేవయాని ఆలోచనలో పడడంతో ముకుల్ ఆ ఫోన్ తీసుకుని శైలేంద్రకి కాల్ ట్రై చేస్తాడు... ఆల్రెడీ చాలాసార్లు చేశారు కదా అని అడుగుతాడు...
దేవయాని: వాడిని పిలుద్దామని చేశాను కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు 
ముకుల్: మీ నంబర్ కూడా లిఫ్ట్ చేయలేదంటే తనకి విషయం తెలిసిపోయి ఉండొచ్చు...ఓసారి మీ అందరి ఫోన్లు ఇక్కడ పెట్టండి అంటాడు..
అందరూ ఫోన్లు అక్కడ పెడతారు.. ( శైలేంద్రకి కాల్ చేసింది డ్రైవర్ అని ఊహించడు ముకుల్)
ఫణీంద్ర: మావాడే ఇదంతా చేశాడంటే మాత్రం నేను నమ్మలేకపోతున్నా...కానీ వాడు చేశాడంటే మాత్రం మీరు జైల్లో వేసేముందే నేనే గొయ్యితీసి పాతేస్తాను...
రిషి: అసలు అన్నయ్య అలా చేస్తాడు అంటారా పెదనాన్నా
వసు: మనం నమ్మినా నమ్మకపోయినా కనిపిస్తున్న సాక్ష్యాలను అబద్ధం అనుకోలేం కదా
మహేంద్ర: శైలేంద్ర దుర్మార్గుడు అని తెలిసినా సాక్ష్యం దొరకలేదనే కదా ఇన్నాళ్లూ ఆగాం 
ఇంతలో దేవయాని ఫోన్ రింగ్ అవుతుంది... దేవయాని టెన్షన్ పడుతుంది...లిఫ్ట్ చేయండి వదినగారూ అంటాడు మహేంద్ర... ఫోన్ తియ్ దేవయాని అంటాడు ఫణీంద్ర...స్పీకర్ ఆన్ చేయండి అంటాడు ముకుల్....
కానీ అట్నుంచి శైలేంద్ర వాయిస్ కి బదులు మరో వాయిస్ వినిపిస్తుంది...ఇక్కడ ఈ ఫోన్ గల వ్యక్తి తన భార్య హాస్పిటల్లో ఉన్నారు...ఇద్దరికీ గాయాలయ్యాయి అని చెబుతాడు.... ఇద్దరికీ ట్రీట్మెంట్ జరుగుతోంది రండి అని చెప్పి హాస్పిటల్ పేరు చెబుతారు....అందరూ అక్కడకు బయలుదేరుతారు...

Also Read: ఇచ్చిపడేసిన రిషి - దేవయానిలో మొదలైన భయం

ఏంజరిగిందని ధరణి అడిగితే.. మాపై అటాక్ జరిగిందని చెబుతుంది. నా కళ్లముందే నేను చూస్తుండగానే ఆయన్ని పొడిచేశారని చెప్పి ధరణి ఏడుస్తుంది ( ఇదంతా శైలేంద్ర డ్రామా అని మహేంద్ర అనుకుంటాడు)
మహేంద్ర: అయినా శైలేంద్ర మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది
దేవయాని: ధరణి ఇలా చెబుతుందేంటి అసలేం జరిగింది...
ధరణి: వాళ్లు వెళుతూ వెళుతూ మీ ఫ్యామిలీలో ఎవ్వర్నీ వదిలిపట్టమని చెప్పేసి వెళ్లారు..
ఫణీంద్ర: మన ఫ్యామిలీపై పగ తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది...మీరు రిసార్ట్ కి వెళ్లిన విషయం వాళ్లకి ఎలా తెలిసి ఉంటుంది
దేవయాని: వాళ్లు మన ఫ్యామిలీపై పగబట్టి ఉంటారు..అందుకే మన శైలేంద్రని టార్గెట్ చేసారంటూ డ్రామా మొదలెడుతుంది... ఇదే అవకాశంగా శైలేంద్రని మంచివాడిగా చిత్రీకరించే ప్లాన్ చేస్తుంది...
మహేంద్రకి మాత్రం ఈ మొత్తం అనుమానంగానే ఉంటుంది... రిషి ఏడమ్మా అని మహేంద్ర అడిగితే చూసి వస్తాను ఆగండి అంటుంది...
రిషి సార్ నాతోపాటే వచ్చారు కదా ఎక్కడికి వెళ్లారు అనుకుంటూ కాల్ చేస్తుంది... ఇంతలో రిషి నుంచి మెసేజ్ వస్తుంది...నాకు పనుండి బయటకు వెళుతున్నా పని పూర్తిచేసుకుని వచ్చేస్తాను కంగారు పడకు అని ఉంటుంది..
ఎపిసోడ్ ముగిసింది....

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget