Guppedantha Manasu November 30th Episode: బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ - శైలేంద్ర నిజస్వరూపం మొత్తం రిషికి తెలిసిపోయింది
Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలకు పాల్పడుతున్నాడని ఆడియో టేప్ విని రిషికి క్లారిటీ వచ్చేసింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Guppedantha Manasu November 30th Episode (గుప్పెడంతమనసు నవంబరు 30 ఎపిసోడ్)
దేవయాని టెన్షన్ గా శైలేంద్రకు ఫోన్ చేస్తే ధరణి ఫోన్ లిఫ్ట్ చేసి యోగక్షేమాలు అడుగుతుంది. ముందు శైలేంద్రకు ఫోన్ ఇవ్వు అని అన్నా...ధరణి మాత్రం పనిమనిషి రోజు వస్తోందా, మీకు కాఫీ టీలు ఇస్తుందా , భోజనం మీకు నచ్చేలానే వండుతోందా, ఏంటి అత్తయ్య గారు నేను ఎన్ని ప్రశ్నలు వేసినా మీరేం మాట్లాడరు అని అంటుంది ధరణి. నాకేం రోగం లేదు బాగానే ఉన్నానని విసుగు దాచుకుని మాట్లాడుతుంది దేవాయని. ఇంతలో శైలేంద్ర అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుని ధరణిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఏమైపోయావ్ అని ఫైర్ అవుతుంది దేవాయని...MSR పేరు కదా బయటకు వచ్చిందని అంటాడు. నీకెలా తెలుసు అంటే..ఈ కథను అల్లింది, అక్కడ ఎప్పుడు ఏం జరగాలో డిసైడ్ చేసింది నేనే నువ్వు కూల్ గా ఉండు అని ధైర్యం చెప్తాడు. MSR పేరు చెప్పమని చెప్పి చాలా మంచి పని చేశావు లేదంటే ఈ పాటికి మన పనులు అయిపోయేవి అని భయపడుతూ మాట్లాడుతుంది దేవయాని. నువ్వేం టెన్షన్ పడకు ధైర్యంగా ఉండు అక్కడ ఎప్పుడెప్పుడు ఏమేం జరగాలో నేను ప్లాన్ చేసి వచ్చాను అని అంటాడు శైలేంద్ర.
Also Read: ఇంకేం కావాలి ఇది చాలదా - రిషిధార స్పెషల్ సెలబ్రేషన్స్, షాకిచ్చిన అనుపమ!
రిషి అనుపమ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకు రెండుసార్లు జన్మనిచ్చిన తల్లి చావుని తేలిగ్గా తీసుకోలేదు మేడం అనుకుంటాడు.. ఇంతలో వసుధార పిలవడంతో కిచెన్ లోకి వెళ్తాడు. ఎందుకు పిలిచావు వసుధార అని అడగగా ఏమీ లేదు సార్ మీరు భోజనం సరిగా చేయలేదు కదా అలాగే పడుకుంటే మళ్ళీ ఆరోగ్యం దెబ్బతింటుంది అనడంతో అప్పుడు రిషి..నీ ప్రేమ నాకు నచ్చలేదంటాడు. వసుధార షాక్ అవుతుంది... నన్ను ప్రేమించడమే కాదు నిన్ను నువ్వు ప్రేమించుకోవా అని అడుగుతాడు. హమ్మయ్య కాసేపు టెన్షన్ పెట్టారు కదా అన్న వసుధార...పెరుగులో పంచదార వేసి తినమని ఇస్తుంది. మరి నీకో అంటూ ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు... బ్యాంగ్రౌండ్ లో మంచి సాంగ్....ఇంతలో రిషికి కాల్ చేస్తాడు ముకుల్
Also Read: ఇచ్చిపడేసిన రిషి - దేవయానిలో మొదలైన భయం
ముకుల్: ఒక వాయిస్ ని ట్రేస్ అవుట్ చేసాము ఆ వాయిస్ ఎవరిదో మీరు కనుక్కోవాలి మీరందరూ ఉండాలి
సరే రేపు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కలుద్దాం అంటాడు రిషి...
శైలేంద్ర ఇంట్లో అందరూ ముకుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ తట్టుకోలేక అసలు ఏంటి రిషి అతను ఏం చెప్పాడు అనడంతో ఏదో వాయిస్ అని చెప్పాడు పెద్దమ్మ ఆ వాయిస్ ఎవరిదో మనం గుర్తుపట్టాలి అన్నాడు అనడంతో దేవయాని మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే ముకుల్ అక్కడికి వస్తాడు.
ముకుల్: మేము చాలా ప్రయత్నాలు చేయగా ఒక్క చిన్న క్లూ దొరికింది అనడంతో దేవయాని షాక్ అవుతుంది.
ఫణీంద్ర: టీ కాఫీ కావాలా
ముకుల్: మా జగతి మేడం కేసుకి సంబంధించి క్లూ దొరికింది అది చాలు ..నిందుతుడు చాలా తెలివైనవాడు కానీ ఎక్కడో చోట పొరపాటు చేస్తాడు. ఎవడైతే జగతి మేడంని షూట్ చేశాడో వాడి ఫోన్ డేటాలో దొరికింది
ఫణీంద్ర: షూటర్ చనిపోయాడు..ఫోన్ డేటా డిలీట్ అయిపోయింది అన్నారు
ముకుల్: డిలీట్ అయిపోయింది సర్..కానీ మళ్లీ రిట్రైవ్ చేశావ్...క్రిమినల్ కే అన్ని తెలివితేటలుంటే కష్టపడి చదువుకుని ఇంతవరకూ వచ్చాం మేమెన్ని తెలివితేటలు చూపించాలి....
మహేంద్ర: ముకుల్ గారు మీరు వాయిస్ ప్లే చేయండి ప్లీజ్...
అప్పుడు అందరూ ముకుల్ ప్లే చేసినవాయిస్ వింటుంటారు...అతను ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అప్పుడు ముకుల్ అందరి ముందు వాయిస్ ని ప్లే చేస్తాడు. అందులో శైలేంద్ర ఇద్దరిని కలిపి చంపేయ్ అని రౌడీతో మాట్లాడుతుండగా ఆ వాయిస్ విన్న దేవయానితో పాటు అక్కడున్న అందరూ షాక్ అవుతారు.
ముకుల్: విన్నారు కదా సార్ ఈ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టారా అని ముకుల్ అడగడంతో
ఫణీంద్ర: నా కొడుకుది అని అంటాడు..ఎమోషనల్ అవుతాడు
రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు.
దేవయాని: అది నా కొడుకు వాయిస్ కాదు అని అందరితో వాదిస్తూ ఉంటుంది
దేవయాని మాటలకు వసుధార మహేంద్ర ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇది మిమిక్రీ చేసి ఉంటారు మార్ఫింగ్ చేసి ఉంటారు అని కొడుకుని సేవ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది.
మహేంద్ర: ఇది శైలేంద్ర వాయిస్ అని పక్కాగా చెబుతాడు
దేవయాని: వాయిస్ ని మిమిక్రీ చేసి ఉంటారు..మార్ఫింగ్ చేసి ఉంటారు..రోజుకి ఎన్ని చూడడం లేదు ఇలాంటివి అంటూ కవర్ చేసే ప్రయత్నాలు చేస్తుంది...మీరునమ్మకండి ఇది మన అబ్బాయి వాయిస్ కాదు..
ముకుల్: ఈ ఒక్కదానితోనే కేసు తేల్చేయను...నేను మీ అబ్బాయిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తాం అనడంతో నేను ఒప్పుకోనంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది దేవయాని.
ఫణీంద్ర: నీకు పిచ్చిపట్టిందా దేవయానీ
దేవయాని: నా కొడుకుని దోషిని చేస్తున్నావా అంటూ కొడుకుది తప్పు ఏం లేదని మాట్లాడుతుంది. అలా మౌనంగా ఉన్నావేంటి రిషి ఇదంతా అబద్ధమని కొట్టి పారేయ్ అంటుంది...
రిషి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు...
Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply