డిసెంబరులో ఈ రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి కానీ! 2023 సంవత్సరంలో ఆఖరి నెలలో మేషరాశివారి ఫలితం ఎలా ఉందంటే... మేష రాశివారికి ఈ నెల అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాలవారు రాణిస్తారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. మీ తెలివితేటలతో ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రవర్తనను అందరూ మెచ్చుకుంటారు, గౌరవం పెరుగుతుంది. 8వ స్థానంలో శుక్రసంచారం వల్ల స్త్రీలతో విరోధ సూచనలున్నాయి. చేపట్టిన కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మేష రాశివారి అదృష్ట సంఖ్య 2, మీకు కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. Images Credit: Pixabay